Bigg Boss Voting: బిగ్ బాస్ ఓటింగ్‌లో నిఖిల్‌ను దాటేసిన లేడి కంటెస్టెంట్.. టాప్‌లో వీళ్లే.. ఈ వారం ఎలిమినేట్ ఎవరంటే?-bigg boss telugu 8 eight week nomination voting results prerana in top bigg boss elimination this week mehaboob nayani ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Voting: బిగ్ బాస్ ఓటింగ్‌లో నిఖిల్‌ను దాటేసిన లేడి కంటెస్టెంట్.. టాప్‌లో వీళ్లే.. ఈ వారం ఎలిమినేట్ ఎవరంటే?

Bigg Boss Voting: బిగ్ బాస్ ఓటింగ్‌లో నిఖిల్‌ను దాటేసిన లేడి కంటెస్టెంట్.. టాప్‌లో వీళ్లే.. ఈ వారం ఎలిమినేట్ ఎవరంటే?

Sanjiv Kumar HT Telugu
Oct 22, 2024 01:57 PM IST

Bigg Boss Telugu 8 Eight Week Nomination Voting Results: బిగ్ బాస్ తెలుగు 8 ఎనిమిదో వారం నామినేషన్స్ కంటెస్టెంట్స్‌కు సంబంధించిన ఓటింగ్ రిజల్ట్స్ వైరల్ అవుతున్నాయి. వారిలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అండ్ టైటిల్ విన్నర్ మెటీరియల్ నిఖిల్‌ను లేడి కంటెస్టెంట్ దాటేసి టాప్‌లో ఉంది.

బిగ్ బాస్ ఓటింగ్‌లో నిఖిల్‌ను దాటేసిన లేడి కంటెస్టెంట్.. టాప్‌లో వీళ్లే.. ఈ వారం ఎలిమినేట్ ఎవరంటే?
బిగ్ బాస్ ఓటింగ్‌లో నిఖిల్‌ను దాటేసిన లేడి కంటెస్టెంట్.. టాప్‌లో వీళ్లే.. ఈ వారం ఎలిమినేట్ ఎవరంటే? (Disney Plus Hotstar/YouTube)

Bigg Boss Telugu 8 Voting Results: బిగ్ బాస్ తెలుగు 8 ఎనిమిదో వారం నామినేషన్స్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. బిగ్ బాస్ 8 తెలుగు అక్టోబర్ 21వ తేది ఎపిసోడ్‌లో మొదటి రోజు నామినేషన్స్ ప్రక్రియ మొదలు అయింది. ఎప్పటిలాగే బిగ్ బాస్ 8 తెలుగు ఈవారం నామినేషన్స్ కూడా రచ్చ రచ్చగా సాగాయి.

ఈ వారం నామినేషన్స్

ముఖ్యంగా రోహిణి వర్సెస్ పృథ్వీ నామినేషన్స్ అయితే మరింత హీట్ పుట్టించాయి. బాడీ షేమింగ్ చేస్తున్నావంటూ పృథ్వీపై ఫైర్ అయింది రోహిణి. ఇదిలా ఉంటే, బిగ్ బాస్ తెలుగు 8 ఎనిమిదో వారం నామినేషన్స్‌లో ఆరుగురు ఉన్నట్లు ఇదివరకే సమాచారం లీక్ అయింది. వారిలో చాలా వరకు స్ట్రాంగ్ కంటెస్టెంట్సే ఉన్నారు.

ఇవాళ పూర్తి

బిగ్ బాస్ తెలుగు 8 ఈ వారం నామినేషన్స్‌లో సీరియల్ హీరో నిఖిల్, మోడల్ పృథ్వీ రాజ్, సీరియల్ హీరోయిన్ ప్రేరణ కంబం, యాంకర్ విష్ణుప్రియ, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ నయని పావని, బిగ్ బాస్ తెలుగు 4 సీజన్ కంటెస్టెంట్ మెహబూబ్ ఆరుగురు ఉన్నారు. అయితే, ఇవాళ్టితో (అక్టోబర్ 22) ఈ వారం నామినేషన్ల ప్రక్రియ పూర్తి అవుతుంది.

టాప్‌లో లేడి కంటెస్టెంట్

నామినేషన్స్ ప్రాసెస్ పూర్తి కాగానే నామినేట్ కంటెస్టెంట్స్‌కు ఓటింగ్ పోల్స్ ఓపెన్ అవుతాయి. కానీ, ఇదివరకే బిగ్ బాస్ తెలుగు 8 ఎనిమిదో వారం నామినేట్ అయిన సభ్యుల లిస్ట్ లీక్ కావడంతో ఓట్లు పడుతున్నాయని తెలుస్తోంది. దీనికి సంబంధించి కంటెస్టెంట్ల ఓటింగ్ రిజల్ట్స్ వివరాలు ఆన్‌లైన్‌లో దర్శనం ఇస్తున్నాయి. ఆ లెక్కల ప్రకారం టాప్‌లో లేడి కంటెస్టెంట్ ఉంది.

విన్నర్ కంటెస్టెంట్‌ను దాటి

బిగ్ బాస్ తెలుగు 8 ఈ వారం ఓటింగ్‌లో ప్రేరణ కంబం 27.8 శాతం ఓట్లతో టాప్‌లో ఉంది. అది కూడా బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ మెటీరియల్‌గా అడుగుపెట్టిన నిఖిల్‌ను దాటేసింది ప్రేరణ. సాధారణంగా నిఖిల్ నామినేషన్స్‌లో ఉంటే అతనే టాప్‌లో ఉంటాడు. కానీ, మొదటిసారి అతన్ని దాటి నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఫ్రెండ్ ప్రేరణ టాప్‌లో ఉండటం విశేషం.

బాయ్‌ఫ్రెండ్‌కే ఎక్కువ

ఇక 24.24 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచాడు నిఖిల్. మూడో స్థానంలో నిఖిల్ ఫ్రెండ్, విష్ణుప్రియ ట్రై చేస్తున్న బాయ్‌ఫ్రెండ్ పృథ్వీ 17.32 శాతం ఓట్లతో ఉన్నాడు. నాలుగో స్థానంలో ఇక్కడ కూడా అతని పక్కనే విష్ణు ఉంది. విష్ణుప్రియకు 13.08 శాతం ఓట్లు పడ్డాయి. విష్ణుప్రియ తన గేమ్ ఆడకుండా బాయ్‌ఫ్రెండ్‌ పృథ్వీని లేపి ఆఖరుకు తనే వెనుకపడిపోయిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ వారం ఎలిమినేట్

ఇక ఐదో స్థానంలో 9.34 శాతం ఓట్లతో నయని పావని, ఆరో స్థానంలో 8.22 శాతం ఓట్లతో మెహబూబ్ ఉన్నారు. అంటే, వీళ్లిద్దరు డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఇలాగే ఓటింగ్ కొనసాగితే వీరిద్దరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అయి హౌజ్‌ను వీడటం ఖాయమని తెలుస్తోంది.

Whats_app_banner