Bigg Boss Telugu 8: ఆడియెన్స్‌తోనే గౌతమ్‌ను మోసం చేయించిన నాగార్జున.. జెన్యూన్ కంటెస్టెంట్‌కు అన్యాయం (వీడియో)-bigg boss telugu 8 nagarjuna injustice to gautham with audience bigg boss 8 telugu november 2 episode highlights ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Telugu 8: ఆడియెన్స్‌తోనే గౌతమ్‌ను మోసం చేయించిన నాగార్జున.. జెన్యూన్ కంటెస్టెంట్‌కు అన్యాయం (వీడియో)

Bigg Boss Telugu 8: ఆడియెన్స్‌తోనే గౌతమ్‌ను మోసం చేయించిన నాగార్జున.. జెన్యూన్ కంటెస్టెంట్‌కు అన్యాయం (వీడియో)

Sanjiv Kumar HT Telugu
Nov 03, 2024 01:32 PM IST

Bigg Boss Telugu 8 Nagarjuna Injustice To Goutham: బిగ్ బాస్ తెలుగు 8 నవంబర్ 2 ఎపిసోడ్‌లో జెన్యూన్ కంటెస్టెంట్ అయిన గౌతమ్ కృష్ణకు అన్యాయం జరిగింది. ఏకంగా పెయిడ్ ఆడియెన్స్‌ను పెట్టించి మరి గౌతమ్ కృష్ణకు మోసం చేశాడు హోస్ట్ నాగార్జున. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆడియెన్స్‌తోనే గౌతమ్‌ను మోసం చేయించిన నాగార్జున.. జెన్యూన్ కంటెస్టెంట్‌కు అన్యాయం (వీడియో)
ఆడియెన్స్‌తోనే గౌతమ్‌ను మోసం చేయించిన నాగార్జున.. జెన్యూన్ కంటెస్టెంట్‌కు అన్యాయం (వీడియో) (Disne Plus Hotstar/YouTube)

Bigg Boss Telugu 8 November 2 Episode Highlights: బిగ్ బాస్ అనేది రియాలిటీ షో అంటారు. కానీ, అది చాలా సందర్భాల్లో అన్‌ఫెయిర్ అండ్ బయాస్‌డ్ (పక్షపాతం) షోగా నిరూపించుకుంది. తాజాగా అందుకు ఉదాహరణగా నిలిచాడు హోస్ట్ నాగార్జున.

ఏమార్చే బీబీ టీమ్

బిగ్ బాస్ షోలోని ప్రతి సీజన్‌లో ఇద్దరు ముగ్గురు కంటెస్టెంట్స్‌పై టీమ్, హోస్ట్ నాగార్జున చాలా పక్షపాతం చూపిస్తుంటారు. వారు ఎన్ని తప్పులు చేసిన పెద్దగా అనరు. వారిని ఎదుటివారు ఏమైనా అంటే మాత్రం తీవ్రంగా ఫైర్ అవుతారు. అలాగే, ఆ కంటెస్టెంట్స్ చేసే మిస్టేక్స్‌ను రాత్రి పసారమయ్యే ఎపిసోడ్‌లో వేయరు. వారు ఎన్ని తప్పులు చేసినా, మాటలు జారిన వాటిని చూపించకుండా ఆడియెన్స్‌ను ఏమారుస్తుంది బీబీ టీమ్.

ఇక బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌ విషయానికొస్తే బీబీ టీమ్ పక్షపాతం చూపిస్తున్న కంటెస్టెంట్ నిఖిల్. సీరియల్ హీరోగా, టైటిల్ విన్నర్ మెటీరియల్‌గా వచ్చిన నిఖిల్ ఎన్ని తప్పులు చేసిన అవి ఎపిసోడ్‌లో టెలీకాస్ట్ కావట్లేదు. కానీ, లైవ్ చూసినవాళ్లకు మాత్రం నిఖిల్ ఎంత కోపిస్టో, టాస్క్‌లో మృగంలా ఎంతలా రెచ్చిపోతాడో తెలుసు. అలాంటి నిఖిల్‌ తొమ్మిదో వారం చేసిన తప్పులను కప్పిపుచ్చడానికి నాగార్జునను వాడారు బీబీ టీమ్.

పానిపట్టు టాస్క్

బిగ్ బాస్ 8 తెలుగు తొమ్మిదో వారం మెగా చీఫ్ కంటెండర్ టాస్క్‌ల్లో భాగంగా ఇచ్చిన పానిపట్టు ఛాలెంజ్‌లో నిఖిల్ వర్సెస్ గౌతమ్, ప్రేరణ, యష్మీ వార్ జరిగింది. ప్రేరణ, యష్మీ వాటర్‌ కిందపోకుండా ఆపేందుకు ట్రై చేస్తుంటే నిఖిల్ చాలా రూడ్‌గా వచ్చి వాళ్లను లాగడం, పక్కకు తోయడం వంటివి చేశాడు. అది చూసిన గౌతమ్ సెన్స్ ఉండాలి, అలానా ట్రీట్ చేయడం అంటూ స్టాండ్ తీసుకున్నాడు.

ఈ క్రమంలోనే నిఖిల్, గౌతమ్ మధ్య పెద్ద గొడవ జరిగింది. ఒకరికొకరు పైపైకి వెళ్లారు. గర్ల్స్‌పైకి వెళ్లొద్దు అనట్లే.. ట్రీట్ చేసే విధానం తప్పు అంటున్నా అని గౌతమ్ అంటే.. ఓవరాక్షన్ చేయకు అని నిఖిల్ అన్నాడు. నువ్ చేసింది ఓవరాక్షన్. ఎక్కువ తక్కువ మాట్లాడకు అని గౌతమ్ అన్నాడు. దానికి గౌతమ్ ఏదో బీప్ ఇచ్చి బూతు తిట్టాడు అని నిఖిల్ ఆరోపించడం స్టార్ట్ చేశాడు.

బీప్ పదం వాడని గౌతమ్

మాXXXX అనే బూతు గౌతమ్ తిట్టినట్లు పృథ్వీతో నిఖిల్ చెప్పాడు. కానీ, నిజానికి అక్కడ గౌతమ్ ఎలాంటి బీప్ పదం వాడలేదు. ఎక్కువ తక్కువ అన్నదాన్నే నిఖిల్ తప్పుగా అర్థం చేసుకున్నాడు. ఇదే విషయంపై బిగ్ బాస్ తెలుగు 8 నవంబర్ 2 ఎపిసోడ్‌లో నాగార్జున మాట్లాడాడు. దీని గురించి గౌతమ్‌, నిఖిల్‌తో మాట్లాడాడు.

నిఖిల్ చేసిన రచ్చ గురించి కూడా నిలదీశాడు నాగార్జున. "హరితేజ చెబుతూనే ఉంది. ఆ మాటలు వినిపించలేదు కానీ, ఒక్క మాట వినిపించింది. దాంతో ట్రిగ్గర్ అయిపోయావ్" అని నాగార్జున అన్నాడు. అప్పుడు గౌతమ్ అన్న వీడియో చూపించారు. అది చూపించి గౌతమ్‌ను ఏమంటావ్ అని నాగ్ అడిగాడు. "కోపంలో ఏదో మాట్లాడేటప్పుడు ఇలా బ్లాబర్ చేసినట్లున్న కానీ నేను అయితే అసలు అలాంటి వర్డ్ అనలేదు" అని గౌతమ్ చెప్పుకున్నాడు.

"బ్లాబర్ చేయడంలో సైలెంట్‌ ఎందుకు. చాలా తెలివిగా వాడాల్సిన వర్డ్ సైలెంట్‌గా వాడేసావ్" అని నాగార్జున అన్నాడు. దాంతో గౌతమ్ షాక్ అయ్యాడు. "నేను తల్లి ప్రమాణంగా చెబుతున్నా. అలాంటి వర్డ్ వాడలేదు సర్. నేను చేయని తప్పును అస్సలు ఒప్పుకోను సర్. నేను నిజంగా చేశానని ప్రూవ్ చేయండి సర్ నేను హౌజ్ నుంచి వెళ్లిపోతా" అని గౌతమ్ అన్నాడు.

గౌతమ్‌కు అన్యాయం

"గౌతమ్ కేవలం బ్లాబర్ చేశాడు అని హౌజ్‌లో ఎంతమంది నమ్ముతున్నారో చేతులు ఎత్తండి" అని నాగార్జున అడిగితే.. ఎవరు ఎత్తలేదు. తర్వాత స్టూడియో ఆడియెన్స్‌ను ఇదే అడిగితే.. వారు కూడా ఎత్తలేదు. దాంతో "నీ హౌజ్‌మేట్స్ నమ్మట్లేదు. ఆడియెన్స్ నమ్మట్లేదు. బయట ఉన్న ఆడియెన్స్ కూడా నమ్ముతున్నారో నమ్మట్లేదో నువ్వే ఆలోచించుకో" అని నాగార్జున అన్నాడు. దాంతో గౌతమ్ నిస్సహాయంగా నవ్వాడు.

అయితే, గౌతమ్ కావాలనే తిట్టాడు అని చెప్పిన ఆడియెన్స్ అంతా పెయిడ్ ప్రేక్షకులు అని టాక్ నడుస్తోంది. ఒక కంటెస్టెంట్‌ గురించి మంచిగా చెప్పాలన్న, చెడుగా చెప్పాలన్న బీబీ టీమ్ కొంతమంది పెయిడ్ ఆర్టిస్ట్స్‌ను స్టూడియోలోకి తీసుకొస్తారని తెలిసిందే. ఇలా గౌతమ్ తప్పు చేసినట్లు ఆడియెన్స్ నమ్ముతున్నట్లు చెప్పించి నాగార్జునతో మోసం చేయించింది బిగ్ బాస్ టీమ్.

Whats_app_banner