Bigg Boss Vishnupriya: ఎట్టకేలకు మెగా చీఫ్ అయిన విష్ణుప్రియ.. అనుకూలించిన గ్రహాలు.. కోరుకున్న వారానికే సాధించిన యాంకర్
Bigg Boss Telugu 8 Vishnupriya Is New Mega Chief: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో ఎట్టకేలకు విష్ణుప్రియ మెగా చీఫ్ అయిపోయింది. తన కష్టం ఏమాత్రం లేకుండానే తాను కోరుకున్న వారానికే మెగా చీఫ్‌గా బాధ్యతలు తీసుకుంది. దీంతో ఆమె నమ్మిన గ్రహాల అనుకూలత ఫలించిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Bigg Boss Telugu October 25 Episode Highlights: బిగ్ బాస్ తెలుగు 8 అక్టోబర్ 25 ఎపిసోడ్‌లో యాంకర్ విష్ణుప్రియ మెగా చీఫ్ అయిపోయింది. మెగా చీఫ్ కంటెండర్ కోసం బీబీ రాజ్యం అనే థీమ్‌తో అనేక ఛాలెంజ్‌లు ఇచ్చాడు బిగ్ బాస్. ఈ ఛాలెంజ్‌లో ఎక్కువగా ఓజీ క్లాన్ గెలిచింది. దాంతో ఓజీ నుంచి నలుగురు మెగా చీఫ్ కంటెండర్స్‌గా నిలిచారు.
మెగా చీఫ్ కంటెండర్స్‌గా ఆరుగురు
టాస్క్ గెలిచిన ప్రతిసారి ఓజీ నుంచి పృథ్వీ, నిఖిల్, ప్రేరణ, విష్ణుప్రియను వరుసగా మెగా చీఫ్ కంటెండర్స్‌గా సెలెక్ట్ చేశారు. ఇక రాయల్ క్లాన్ ఓడిపోయిన ప్రతిసారి ఒక్కొక్కరిని కంటెండర్ టాస్క్ నుంచి తీసివేశారు. రాయల్ క్లాన్ రెండు టాస్క్‌లు గెలవడంతో వారి నుంచి రోహిణి, టేస్టీ తేజ ఇద్దరిని మెగా చీఫ్ కంటెండర్స్‌గా ఎన్నుకున్నారు.
పూలదండలు-మిరపకాయ దండలు
ఆ ఒకరిని మెగా చీఫ్‌గా ఎన్నుకునేందుకు మరో టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. మెగా చీఫ్ కంటెండర్స్ మెడలో పూలదండలు ఉంటాయి. గార్డెన్ ఏరియాలో ఉన్న మిరపకాయ్ కత్తిని పట్టుకున్న మిగతా ఇంటి సభ్యుడు మెగా చీఫ్‌గా అనర్హుడు కాదు అనుకున్న వ్యక్తిని తీసివేయాల్సి ఉంటుంది. ఎందుకు వద్దో పాయింట్స్ చెప్పి పూలదండ తీసేసి మిరపకాయ దండ వేయాలి.
సపోర్ట్‌గా నిలిచే
ఒకసారి మిరపకాయ్ కత్తి పట్టుకున్న ఇంటి సభ్యుడు మరోసారి పట్టుకోడానికి వీళ్లేదు. అలాగే, మెగా చీఫ్ టాస్క్ నుంచి అవుట్ అయిన కంటెండర్ ఆ గేమ్ ఆడొచ్చు. అలా ముందుగా కత్తి అందుకున్న మెహబూబ్ ప్రేరణను అవుట్ చేశాడు. ఆ తర్వాత రోహిణిని నబీల్ అవుట్ చేశాడు. తమ టీమ్ నుంచి తేజ ఒక్కడే ఉండటంతో ఓజీ క్లాన్‌లో తమకు ఎవరు సపోర్ట్‌గా ఉంటారో వారిని మెగా చీఫ్‌గా చూసేందుకు ప్లాన్ చేసుకుందు రాయల్ టీమ్.
సమానమైన ఇంపార్టెన్స్
అనంతరం కత్తి అందుకున్న అవినాష్.. ఓజీ టీమ్ పృథ్వీని అవుట్ చేశాడు. ఆ తర్వాత వెంటనే కత్తి చేజిక్కించుకున్న పృథ్వీ రాయల్ క్లాన్‌లోని తేజను అవుట్ చేశాడు. దాంతో నిఖిల్, విష్ణుప్రియ మిగిలారు. చివరగా కత్తి అందుకున్న గౌతమ్ యాంకర్ విష్ణుప్రియను మొదటి లేడి మెగా చీఫ్‌గా చూడాలని, అందరికి సమానమైన ఇంపార్టెన్స్ ఇస్తుందని కోరుతూ నిఖిల్‌ను అవుట్ చేశాడు.
ఫస్ట్ లేడి మెగా చీఫ్
అలా ఎలాంటి కష్టం లేకుండానే యాంకర్ విష్ణుప్రియ తొమ్మిదో వారానికి మెగా చీఫ్ అయింది. అంతేకాకుండా బిగ్ బాస్ తెలుగు 8లో మొదటి మహిళా మెగా చీఫ్‌గా విష్ణుప్రియ నిలిచింది. అయితే, ఇదివరకు ఆరో వారానికి మెగా చీఫ్ కావాలని కోరుకున్న విష్ణుప్రియ తర్వాత ఆస్ట్రాలజీ నెంబర్ ప్రకారం అది వద్దనుకుంది. తొమ్మిదో వారానికి మెగా చీఫ్ కావాలని కోరుకుంటున్నట్లు ఇదివరకు నాగార్జునతో చెప్పింది విష్ణుప్రియ.
గ్రహాల అనుకూలత
విష్ణుప్రియ కోరుకున్నట్లుగానే తొమ్మిదో వారానికి మెగా చీఫ్ అయింది. అయితే, జ్యోతిష్యం, తథాస్తు దేవతలు అనేటువంటికి ఎక్కువ నమ్మే విష్ణుప్రియ ప్లానెట్రీ మోషన్, గ్రహాల అనుకూలత అంటూ హౌజ్‌లో, నాగార్జునతో చాలా సార్లు మాట్లాడింది. ఇప్పుడు ఎలాంటి కష్టం లేకుండా విష్ణుప్రియ మెగా చీఫ్ కావడంతో గ్రహాల అనుకూలత ఫలించినట్లుందని నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
టాపిక్