Bigg Boss Telugu 8: ఒక్కరోజే ఏడ్చేసిన ముగ్గురు.. బూతులు తిట్టాడు, ఎఫ్X వర్డ్ వాడిందన్న నిఖిల్.. 2 గంటలు భరించిన పృథ్వీ-bigg boss telugu 8 october 30th episode highlights nikhil felt emotional bigg boss 8 telugu bb intiki daredi task ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Telugu 8: ఒక్కరోజే ఏడ్చేసిన ముగ్గురు.. బూతులు తిట్టాడు, ఎఫ్X వర్డ్ వాడిందన్న నిఖిల్.. 2 గంటలు భరించిన పృథ్వీ

Bigg Boss Telugu 8: ఒక్కరోజే ఏడ్చేసిన ముగ్గురు.. బూతులు తిట్టాడు, ఎఫ్X వర్డ్ వాడిందన్న నిఖిల్.. 2 గంటలు భరించిన పృథ్వీ

Sanjiv Kumar HT Telugu
Oct 31, 2024 06:23 AM IST

Bigg Boss Telugu 8 October 30th Episode Highlights: బిగ్ బాస్ తెలుగు అక్టోబర్ 30 ఎపిసోడ్‌లో ఒక్కరోజే ముగ్గురు కంటెస్టెంట్స్ ఏడ్చేశారు. గౌతమ్ తనను బూతులు తిట్టాడని, ప్రేరణ ఎఫ్ వర్డ్ యూజ్ చేసి తిట్టిందని నిఖిల్ కన్నీటిపర్యంతం అయ్యాడు. అలాగే మరో కంటెస్టెంట్ కూడా క్రై బేబీలానే చేసింది.

ఒక్కరోజే ఏడ్చేసిన ముగ్గురు.. బూతులు తిట్టాడు, ఎఫ్X వర్డ్ వాడిందన్న నిఖిల్.. 2 గంటలు భరించిన పృథ్వీ
ఒక్కరోజే ఏడ్చేసిన ముగ్గురు.. బూతులు తిట్టాడు, ఎఫ్X వర్డ్ వాడిందన్న నిఖిల్.. 2 గంటలు భరించిన పృథ్వీ (Disney Plus Hotstar/YouTube)

Bigg Boss 8 Telugu October 30th Episode Highlights: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. కంటెస్టెంట్ల మధ్య హోరాహోరీ పోటీ సాగుతోంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో బీబీ ఇంటికి దారేది అనే టాస్క్ నడుస్తోంది. ఇందులో ముగ్గురు చొప్పున నాలుగు టీమ్స్ ఉన్నాయి. వీరందరి మధ్య పోటీ గట్టిగానే సాగుతోంది.

రెండో రోజు కూడా

బిగ్ బాస్ తెలుగు 8 అక్టోబర్ 29 ఎపిసోడ్‌లో గౌతమ్, నిఖిల్ మధ్య జరిగిన గొడవ బిగ్ బాస్ 8 తెలుగు అక్టోబర్ 30వ రోజు కూడా కొనసాగింది. అయితే నిఖిల్, గౌతమ్ వాదించుకోలేదు కానీ, దాని వల్ల ఏర్పడిన డిస్టర్బెన్స్ అలాగే కొనసాగింది. యష్మీ, ప్రేరణపై నిఖిల్ ఒక మృగంలా దాడి చేసి, ఫిజికల్ అటాక్ చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో యష్మీ, ప్రేరణ మాట్లాడిన తీరు తలుచుకుని నిఖిల్ ఏడ్చాడు.

"హరితేజతో ఫిజికల్ అవ్వొద్దని గౌతమ్‌కు చెబితే.. రూల్స్ బుక్‌లో ఉందా. దమ్ముంటే నువ్ ఆడు అని విసిరేసాడు. అక్కడ నాకు ట్రిగ్గర్ అయింది. మీకు ముందే సారీ అని చెప్పే టాస్క్ స్టార్ట్ చేశాను. నువ్ ఏడవటం ముందు నేను వినలేదు. నేను ఎప్పుడైతే విన్నానో అప్పుడే ఆపేసి ప్రేరణని లాగాను. కానీ, నేను ఏం చేయకముందే బ్లడీ అని ప్రేరణ అందు. ఎఫ్ వర్డ్ యూజ్ చేసింది" అని యష్మీతో నిఖిల్ చెప్పుకున్నాడు.

నిఖిల్-యష్మీ వాగ్వాదం

"నేను అనేది సంచాలక్‌ను రెస్పెక్ట్ చేయాలని మనమే కదా లాస్ట్ వీక్ ఫైట్ చేశాం. ఇప్పుడు నువ్వే వినకుంటే ఎలా" అని యష్మీ అంది. "నాకు మొదట వినపడలేదు. వింటే ఎందుకు చేస్తాను" అని నిఖిల్ అన్నాడు. "అంతా ఒక్కటై ఆడారు. నేను ఒక్కన్ని అయ్యాను. ఇక నుంచి నా గేమ్ నేను ఆడతాను" అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. హగ్ చేసుకుంటానని యష్మీ అంటే వద్దని గట్టిగానే చెప్పాడు.

ఇక చాలు అని ఎవరి ఫ్రెండ్షిప్ వద్దన్నట్లుగా నిఖిల్ ఫైర్ అయ్యాడు. పక్కనే పృథ్వీ కూడా ఉన్నాడు. నిఖిల్ వెళ్లాక.. పృథ్వీని పట్టుకుని యష్మీ ఏడ్చేసింది. "కావాలని ఎవరు చేయలేదు కదరా" అంటూ ఏడ్చేసింది యష్మీ. ఇదంతా రాత్రి 1 నుంచి 2 గంటల మధ్య జరిగింది. తర్వాత ఉదయం రోలింగ్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. అందులో బ్లూ టీమ్ గెలిచింది. రెండో ప్లేసులో కాస్తా లేట్‌గా యెల్లో టీమ్ వచ్చింది.

సొంత టీమ్ వాళ్లే

గౌతమ్ సంచాలక్‌గా ఉన్న ఈ టాస్క్‌లో యెల్లో టీమ్ నుంచి నయని పావని, పృథ్వీ ఆడారు. అయితే, నయని సరిగా ఆడలేదని, ఫౌల్ చేశావని తన టీమ్ మెంబర్ అయిన రోహిణి చెప్పింది. నేను ఫౌల్ చేయలేదు. ఈ టాస్క్ ఇలా కాకుండా ఎలా ఆడతారు అని చూపించింది. దానికి రోహిణి వివరణ ఇచ్చుకుంది. సొంత టీమ్ వాళ్లే ఎంకరేజ్ చేయకుండా తప్పుపడితే ఎలా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది నయని.

ఇలా ప్రతిదానికి ఫీల్ అయిపోతే ఎలా అని రోహిణి అంది. ముందు నీ ఒక్కదానికే వచ్చి చెప్పా. నువ్వే పెద్దగా చేశావ్ అని నయని, రోహిణి మాట్లాడుకున్నారు. తర్వాత హరితేజతో అంత కష్టపడి ఆడితే మెచ్చుకోకపోవడం పోగా సరిగా ఆడలేదని మన టీమ్ వాళ్లే అంటే ఎంత హర్టింగ్‌గా ఉంటుంది అని చెప్పుకుంటూ ఏడ్చింది. అదంతా చూసిన పృథ్వీ నయనిని ఓదార్చాడు. దాదాపు నయని రెండు గంటలపాటు ఏడిస్తే.. అదంతా భరించాడు పరిస్థితిని కూల్ చేశాడు.

Whats_app_banner