Bigg Boss 8 Telugu: యష్మి, హరితేజ మధ్య వార్ షురూ.. పృథ్విది నాన్‍సెన్స్ పాయింట్ అంటూ..: వీడియో
Bigg Boss 8 Telugu Today Promo: వైల్డ్ కార్డ్ ఎంట్రీల తర్వాత బిగ్‍బాస్ హౌస్‍లో తొలి నామినేషన్లు రసవత్తరంగా సాగనున్నాయి. రెండు క్లాన్‍ల మధ్య ఈ ప్రక్రియ సాగనుంది. దీనికి సంబంధించిన ప్రోమో వచ్చేసింది.
బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్‍లో ఆరో వారం మొదలైంది. వీకెండ్‍లో ఎనిమిది మంది కంటెస్టెంట్లు వైల్డ్ కార్డుల ద్వారా ఎంట్రీ ఇచ్చారు. అప్పటికే హౌస్‍లో 8 మంది ఉన్నారు. దీంతో వీరంతా రెండు క్లాన్‍లుగా విడిపోయారు. పాత కంటెస్టెంట్లు ఒరిజినల్ గ్యాంగ్‍స్టర్స్ (ఓజీ), వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన వారు రాయల్స్ క్లాన్‍గా ఏర్పడ్డారు. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు వచ్చాక నేడు (అక్టోబర్ 7) తొలిసారి నామినేషన్ల ప్రక్రియ జరగనుంది. దీనికి సంబంధించి ప్రోమో ఇంట్రెస్టింగ్‍గా ఉంది.
నామినేషన్లలో ఓజీ వర్సెస్ రాయల్
ఈ నామినేషన్ ప్రక్రియలో ఓజీ క్లాన్‍లోని వారిని వైల్డ్ కార్డ్ ‘రాయల్’ క్లాన్ సభ్యులు నామినేట్ చేశారు. ఈ సీజన్‍లో ఇప్పటి వరకు హౌస్‍లో ఓజీ క్లాన్‍లో ఉన్న వారి ఆటను బయటి నుంచి చూశారు రాయల్ టీమ్‍మేట్స్. వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన వారు ఓజీ క్లాన్ వారిని నామినేట్ చేశారు. హౌస్‍లో ఉండేందుకు ఎవరు అర్హులు కాదనుకుంటున్నారో ఇద్దరి మెడలో బోర్డు వేసి నామినేట్ చేయాలని చెప్పారు బిగ్‍బాస్ చెప్పారు.
యష్మిని టార్గెట్ చేసిన హరితేజ
హౌస్‍లో తన గురి యష్మినే అంటూ వైల్డ్ కార్డ్ ఎంట్రీ సమయంలో వేదికపైనే హరితేజ చెప్పారు. అందుకు తగ్గట్టే యష్మిని నామినేట్ చేశారు. మెడలో నామినేషన్ బోర్డ్ వేశారు. వ్యక్తి వ్యక్తికి రూల్స్ వేరు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారని యష్మిపై హరితేజ అభ్యంతరం తెలిపారు.
తనకు కరెక్ట్ అనిపించిందే చేస్తానని యష్మి ఆన్సర్ ఇచ్చారు. “పర్సన్ పర్సన్‍కు రూల్స్ మారుతున్నాయి. నీకు ఇష్టం లేదన్న దగ్గర వేరే రూల్ అప్లై అవుతుంది” అని హరితేజ అన్నారు. “నాకు ఏది కరెక్ట్ అనిపిస్తోందో అదే చేస్తా. నాకు గేమ్‍కు ఎవరు అడ్డుగా ఉన్నారో వారినే కదా చేయాలి” యష్మి కాస్త గట్టిగా బదులిచ్చారు. వీరిద్దరి మధ్య హౌస్‍లో మంచి పోరు ఉంటుందని అంచనాలు ఉండగా.. ఆ వార్ అప్పుడే షురూ అయినట్టు కనిపిస్తోంది.
విష్ణుప్రియను గౌతమ్ కృష్ణ నామినేట్ చేశారు. విష్ణు వేరే వ్యక్తిపై దృష్టి పెడుతోందని అన్నారు. పరోక్షంగా పృథ్వి అన్నట్టు మాట్లాడారు. దీంతో తన ఎమోషన్‍నే చూపిస్తానని విష్ణు అన్నారు.
15 వారాలే కదా..
విష్ణుప్రియకు సీరియెస్‍నెస్ లేనట్టు అనిపిస్తుందని నయని పావని అన్నారు. చీఫ్ అవ్వాలని అనుకోవట్లేదని విష్ణు చెప్పిన మాటలను ఆమె గుర్తు చేశారు. షోను అర్థం చేసుకునేందుకు తనకు టైమ్ కావాలనే ఉద్దేశంతోనే అలా అన్నారని విష్ణు వివరణ ఇచ్చారు. అయితే, బిగ్‍బాస్ ఉండేది 15 వారాలే కదా.. గెలిచేందుకు అని వెటకారంగా నయని మాట్లాడారు.
నాన్‍సెన్స్ పాయింట్
పృథ్విని హరితేజ నామినేట్ చేశారు. హౌస్‍లో గతంలో స్పెల్లింగ్‍లపై జరిగిన ఛాలెంజ్ విషయాన్ని లేవనెత్తారు. అప్పుడు కన్‍ఫ్యూజన్ ఉన్న సమయంలో కూడా చుట్టూ ఉన్న నిర్ణయాలను తీసుకున్నారు తప్ప అంటూ హరితేజ ఏదో చెప్పబోయారు. దీంతో ఆ పదంలో స్పేస్ ఉండాలో లేదో తనకు ఇప్పటికీ క్లారిటీ లేదని పృథ్వి చెప్పారు. “మీరు చూసింది గంటే కదా” అని పృథ్వి అన్నారు. దీంతో అది వేరే టాపిక్ అని హరితేజ అన్నారు. నామినేషన్‍ను తాను అంగీకరించనని పృథ్వి చెప్పారు. “నా నామినేషన్‍ను మీరు అంగీకరించకపోయినా.. నేను ఒప్పుకుంటాను. ఇది నా అభిప్రాయం” అని చెప్పి పృథ్వి మెడలో నామినేషన్ బోర్డ్ వేశారు హరితేజ.
గంటే చూశారని పృథ్వి అనడంతో దీనిపై సెటైర్ వేశారు నయని పావని, హరితేజ. జనాలు అందరూ కూడా గంటే కదా చూస్తారు అని నయని వెటకారంగా కామెంట్ చేశారు. పృథ్వి చెప్పిన ఆ పాయింట్ పూర్తిగా నాన్‍సెన్స్ అని హరితేజ అన్నారు. ఈ మధ్యలో హౌస్‍లో పదేపదే ఏడ్వడం గురించి సీతను నయని పాపని నామినేట్ చేశారు. ఎమోషన్ అంటే ఏడుపు ఒక్కటే కాదు కదా అని అన్నారు. అది కూడా ఎమోషనే అని సీత అంటుంటే నయని అడ్డుపడ్డారు. ప్రోమో ఇంట్రెస్టింగ్‍గా సాగింది.
హౌస్‍లో కంటెస్టెంట్లు ఇలా..
బిగ్‍బాస్ 8వ సీజన్‍లో మొదటి నుంచి ఉన్న యష్మి, సీత, పృథ్విరాజ్, నిఖిల్, నబీల్ ఆఫ్రిది, విష్ణుప్రియ, ప్రేరణ, మణికంఠ ఓజీ క్లాన్‍లో ఉన్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీల ద్వారా వచ్చిన హరితేజ, టేస్టీ తేజ, నయని పావని, మహబూబ్, రోహిత్, గౌతమ్ కృష్ణ, అవినాశ్, గంగవ్వ.. రాయల్ క్లాన్‍గా ఏర్పడ్డారు.