Bigg Boss Elimination: ఈ వారం ఎలిమినేషన్ ఈ ఇద్దరి ఫ్యాన్స్ చేతుల్లోనే.. బిగ్ బాస్ ముద్దుబిడ్డను కాపాడేందుకు అతను బలి!
Bigg Boss Telugu 8 Elimination 4th Week: బిగ్ బాస్ తెలుగు 8 నాలుగో వారం నామినేషన్స్ కూడా రచ్చ రచ్చగానే సాగాయి. బిగ్ బాస్ 8 తెలుగు ఈ వారం నామినేషన్స్‌లో ఆరుగురు ఉన్నారు. వారిలో డేంజర్ జోన్‌లో ఉన్న బిగ్ బాస్ ముద్దుబిడ్డ సోనియా ఆకులను కాపాడటానికి ఆ కంటెస్టెంట్‌ను బలి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Bigg Boss 8 Telugu Elimination This Week: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ కూడా మంచి జోరు అందుకుంది. మొదటి రోజు నుంచే గొడవలతో హడావిడి సంతరించుకుంది. దానికి తగినట్లుగా ప్రతివారం ఏదో ఒక టాపిక్ మీద కంటెంట్ ఇస్తున్నారు హౌజ్‌మేట్స్. 14 మందితో ప్రారంభమైన బిగ్ బాస్ 8 తెలుగు సీజన్‌లో ప్రస్తుతం 11 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు.
టాప్‌లో నబీల్
వీరికి సోమవారం (సెప్టెంబర్ 23) నాలుగో వారం నామినేషన్స్ నిర్వహించారు. బిగ్ బాస్ తెలుగు 8 నాలుగో వారం నామినేషన్స్‌లో ఆరుగురు కంటెస్టెంట్ నామినేట్ అయ్యారు. వారిలో నాగ మణికంఠ, ఆదిత్య ఓం, నబీల్ అఫ్రిది, పృథ్వీరాజ్, సోనియా ఆకుల, ప్రేరణ ఉన్నారు. అయితే, వీరిలో అత్యధికి ఓటింగ్‌తో నబీల్ దూసుకుపోతున్నాడు. దాదాపుగా 35 శాతం ఓటింగ్‌తో టాప్‌లో ఉన్నాడు.
ఆ తర్వాతి రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో వరుసగా.. నాగ మణికంఠ, ప్రేరణ, ఆదిత్య ఓం, పృథ్వీరాజ్, సోనియా నిలిచారు. వీరిలో పృథ్వీరాజ్, సోనియా డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఓటింగ్ ఇలాగే సాగితే వీకెండ్ నాటికి అంటే ఓటింగ్ ముగిసే సమయానికి కూడా వీరిద్దరే డేంజర్ జోన్‌లో ఉండాల్సి వస్తుంది. అలా అయితే, బిగ్ బాస్ తెలుగు 8 నాలుగో వారం ఎలిమినేషన్ పృథ్వీ, సోనియా మధ్య ఉంటుంది.
కానీ, అలా జరగాలంటే విష్ణుప్రియ, నిఖిల్ ఫ్యాన్స్ చేతుల్లో ఉంటుంది. నిఖిల్ బెస్ట్ ఫ్రెండ్స్ అయిన సోనియా, పృథ్వీకి అతని ఫ్యాన్స్ ఓట్లు వేస్తే మాత్రం చివరి స్థానాల్లో ఉండలేరు. అలాగే, విష్ణుప్రియ ఫ్యాన్స్ కూడా ఎవరికి సపోర్ట్ చేస్తారనేది కీలకంగా మారింది. ఎందుకంటే వీరిద్దరికి ఫ్యాన్ బేస్ బాగుంది. కాబట్టి, విష్ణుప్రియ, నిఖిల్ ఫ్యాన్స్ ఎక్కువగా ఎవరికి సపోర్ట్ చేస్తారో వాళ్లు టాప్‌లో నిలిచే అవకాశం ఉంది.
ఎలిమినేషన్ నుంచి
ఒకవేళ నిఖిల్, విష్ణుప్రియ ఫ్యాన్స్ సపోర్ట్ సోనియాకు లేకుంటే మాత్రం కచ్చితంగా డేంజర్ జోన్‌లో ఉంటుంది. సోనియా వల్ల నిఖిల్‌కు మైనస్ కావడంతోపాటు విష్ణుప్రియను చాలాసార్లు పర్సనల్ అటాక్ చేసింది సోనియా. ఆ కారణంతో సోనియాకు ఈ ఇద్దరి ఫ్యాన్స్ ఓట్లు వేసే అవకాశం కూడా లేకపోవచ్చు. ఇలా జరిగి ఆఖరుకు సోనియా డేంజర్ జోన్‌లో ఉన్నప్పటికీ తనను ఎలిమినేషన్ నుంచి బిగ్ బాస్ సేవ్ చేసేందుకు ప్లాన్ చేయొచ్చు.
ఎందుకంటే, హౌజ్‌లో సోనియా చాలా తప్పులు చేసింది. కానీ, అవేం ఎపిసోడ్‌లో టెలీకాస్ట్ చేయలేదు. కేవలం లైవ్ వరకే పరిమితం చేసి సోనియాపై చాలా వరకు రావాల్సిన నెగెటివిటీని తగ్గించారు బిగ్ బాస్ టీమ్. ఆర్జీవీ కాంపౌండ్ నుంచి వచ్చిన సోనియా ఆకుల మేనేజ్‌మెంట్ కోటా అని, అందుకే ఆమె ఎన్ని తప్పులు చేసిన బిగ్ బాస్ బయటకు తెలిసేలా చేయట్లేదని టాక్. దాంతో ఈ సీజన్‌లో బిగ్ బాస్ ముద్దుబిడ్డ సోనియా అని తెలుస్తోంది.
అయితే, ఎలిమినేషన్ నుంచి సోనియాను సేవ్ చేసేందుకు హీరో ఆదిత్య ఓంను బిగ్ బాస్ బలి చేసే అవకాశం ఉందని సమాచారం. మిగతా వారితో పోల్చితే.. ఆదిత్యం ఓం పర్ఫామెన్స్ కాస్తా తక్కువగా ఉంది. కానీ, అతని పీఆర్ కూడా గట్టిగానే ఉంది. అతనికి సోనియా కంటే ఎక్కువ ఓట్లు పడిన కూడా తన ముద్దుబిడ్డను సేవ్ చేసేందుకు బిగ్ బాస్ ఏదో ఒక ప్లాన్ వేసే ఛాన్సెస్ ఉన్నాయని రివ్యూవర్స్ అంటున్నారు.
నెగెటివిటీ వచ్చే ఛాన్స్
ఇక పృథ్వీ అవసరం హౌజ్‌కు ఉంది కాబట్టి, అతని తక్కువ ఓట్లు పడ్డా ఎలిమినేట్ చేయడం కష్టమని తెలుస్తోంది. మిగతా వాళ్లలో కూడా ఆదిత్య ఓంను కాకుండా మిగతా వారిని బయటకు పంపిస్తే బిగ్ బాస్‌కు నెగెటివిటీ వచ్చే అవకాశం ఉంది. దీంతో సోనియాకు బదులు ఆదిత్య ఓంను ఎలిమినేట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని సమాచారం.