OTT Banned movies: ఇండియాలో నిషేధానికి గురైన ఈ సినిమాలను ఓటీటీల్లో చూడొచ్చు-banned movies you can watch on otts prime video netflix youtube hotstar fire water angry indian goddesses loev and more ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Banned Movies: ఇండియాలో నిషేధానికి గురైన ఈ సినిమాలను ఓటీటీల్లో చూడొచ్చు

OTT Banned movies: ఇండియాలో నిషేధానికి గురైన ఈ సినిమాలను ఓటీటీల్లో చూడొచ్చు

Hari Prasad S HT Telugu
Apr 17, 2024 12:04 PM IST

OTT Banned movies: వివిధ కారణాల వల్ల థియేటర్లలో నిషేధానికి గురైన సినిమాలు ఓటీటీల్లో మాత్రం అలాగే ఉన్నాయి. ఈ సినిమాను ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, యూట్యూబ్ లాంటి వాటిలో చూడొచ్చు.

ఇండియాలో నిషేధానికి గురైన ఈ సినిమాలను ఓటీటీల్లో చూడొచ్చు
ఇండియాలో నిషేధానికి గురైన ఈ సినిమాలను ఓటీటీల్లో చూడొచ్చు

OTT Banned movies: మన దేశంలో వివిధ కారణాల వల్ల కొన్ని దశాబ్దాలుగా ఎన్నో సినిమాలను నిషేధించారు. అందులో ఇండియాలోని వివిధ భాషల సినిమాలతోపాటు ఇంగ్లిష్ మూవీస్ కూడా ఉన్నాయి. రాజకీయ, మత సంబంధిత, సాంస్కృతిక కారణాల వల్ల ఈ సినిమాలపై నిషేధం విధించారు. కానీ అలాంటి సినిమాలన్నీ ప్రస్తుతం వివిధ ఓటీటీల్లో అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూడండి.

ఫైర్ - ప్రైమ్ వీడియో

నందితా దాస్, షబానా అజ్మి లెస్బియన్లుగా నటించిన సినిమా ఇది. ఆర్టికల్ 377 రద్దుకు ముందు వచ్చిన ఇలాంటి సినిమాలను భారత ప్రభుత్వం నిషేధించింది. అయితే ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

లవ్ (LOEV)- నెట్‌ఫ్లిక్స్

ఇది కూడా గే సెక్స్ కు సంబంధించిన సినిమానే. 2017లో ఈ ఎల్‌వోఈవీ మూవీ వచ్చింది. ఈ సినిమాను నిషేధించినా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లో చూడొచ్చు.

అన్‌ఫ్రీడమ్ - నెట్‌ఫ్లిక్స్

ఇది రెండు వేర్వేరు దేశాలు, రెండే వేర్వేరు కథల చుట్టూ తిరిగే సినిమా. ఓవైపు ఓ ముస్లిం టెర్రరిస్టు ఓ లిబరల్ ముస్లిం స్కాలర్ ను కిడ్నాప్ చేయడం, మరోవైపు ఓ లెస్బియన్ అమ్మాయికి బలవంతంగా పెళ్లి చేయాలని చూడటం.. ఇలా మూవీ సాగుతుంది. ఈ సినిమాను ఇండియాలో నిషేధించినా నెట్‌ఫ్లిక్స్ లో మాత్రం అలాగే ఉంది.

బ్లాక్ ఫ్రైడే - డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

ఓ గ్యాంగ్‌స్టర్, ముంబైలో జరిగే పేలుళ్ల చుట్టూ తిరిగే కథే ఈ బ్లాక్ ఫ్రైడే మూవీ. అనురాగ్ కశ్యప్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను నిషేధించారు. అయితే ఈ మూవీ మాత్రం హాట్‌స్టార్ లో అందుబాటులో ఉంది.

వాటర్ - యూట్యూబ్

దీపా మెహతా తెరకెక్కించిన మూవీ వాటర్. 1930ల్లో భర్తలను కోల్పోయి విధవలుగా మారిన కొందరు యువతుల చుట్టూ తిరిగే కథ ఇది. సతీ సహగమనం, భర్తను కోల్పోయిన అప్పటి సమాజం చూసిన తీరును ఈ సినిమా కళ్లకు కడుతుంది. ఈ మూవీని ఇండియాలో నిషేధించారు. అయితే యూట్యూబ్ లో మాత్రం చూడొచ్చు.

గాండు - నెట్‌ఫ్లిక్స్

ఈ సినిమాలో వాడిన బూతుల కారణంగా మూవీని థియేటర్లలో రిలీజ్ కాకుండా నిషేధించారు. అయితే ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లో మాత్రం అందుబాటులో ఉంది.

ఇన్షాఅల్లా ఫుట్‌బాల్ - యూట్యూబ్

ఓ కశ్మీర్ యువకుడు బ్రెజిల్ జట్టుకు ఫుట్‌బాల్ ఆడదామన్న కల.. రాజకీయాల వల్ల కలగానే మిగిలిపోతుంది. అతని తండ్రి ఓ టెర్రరిస్ట్ అన్న కారణంగా అతనికి వీసా నిరాకరిస్తారు. ఈ మూవీ ప్రస్తుతం యూట్యూబ్ లో ఉంది.

పర్జానియా - హాట్‌స్టార్

గుజరాత్ అల్లర్ల చుట్టూ తిరిగే కథ ఈ పర్జానియా. ఈ సినిమాపై అప్పట్లో నిషేధం విధించారు. అయితే హాట్‌స్టార్ లో మాత్రం అందుబాటులో ఉంది.

బాండిట్ క్వీన్ - ప్రైమ్ వీడియో

బందిపోటు రాణిగా పేరుగాంచిన ఫూలన్ దేవి జీవితం ఆధారంగా తెరకెక్కిన మూవీ ఈ బాండిట్ క్వీన్. ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కాకపోయినా.. ప్రైమ్ వీడియోలో చూసే వీలుంది.

IPL_Entry_Point