Drugs Case: డ్ర‌గ్స్ టెస్ట్ రిపోర్ట్‌లో హేమకు పాజిటివ్ - ఏం చేస్తారో చేసుకొండి అంటూ టాలీవుడ్ న‌టి కామెంట్స్‌-bangalore rave party case tollywood actress hema drug test report is positive ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Drugs Case: డ్ర‌గ్స్ టెస్ట్ రిపోర్ట్‌లో హేమకు పాజిటివ్ - ఏం చేస్తారో చేసుకొండి అంటూ టాలీవుడ్ న‌టి కామెంట్స్‌

Drugs Case: డ్ర‌గ్స్ టెస్ట్ రిపోర్ట్‌లో హేమకు పాజిటివ్ - ఏం చేస్తారో చేసుకొండి అంటూ టాలీవుడ్ న‌టి కామెంట్స్‌

Nelki Naresh Kumar HT Telugu
May 23, 2024 02:37 PM IST

Drugs Case: బెంగ‌ళూరు రేవ్ పార్టీలో సినీ న‌టి హేమ కూడా పోలీసుల‌కు దొరికిన సంగ‌తి తెలిసిందే. తాజాగా నార్కోటిక్స్ టీమ్ చేసిన బ్ల‌డ్ శాంపిల్స్ టెస్ట్ హేమ డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు రిపోర్ట్స్ వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.

 సినీ న‌టి హేమ
సినీ న‌టి హేమ

Drugs Case: బెంగ‌ళూరులో జ‌రిగిన ఓ రేవ్ పార్టీలో టాలీవుడ్‌కు చెందిన న‌టీన‌టులు, ప్ర‌ముఖులు ప‌ట్టుబ‌డ‌టం క‌ల‌క‌లాన్ని రేపింది. ఈ రేవ్ పార్టీలో న‌టి హేమ కూడా పోలీసుల‌కు దొరికింది. కానీ తాను రేవ్ పార్టీకి వెళ్ల‌లేద‌ని, హైద‌రాబాద్‌లోనే ఉన్నానంటూ హేమ ఓ వీడియోను విడుద‌ల‌చేసి అంద‌రిని త‌ప్పుదోవ ప‌ట్టించే ప్ర‌య‌త్నం చేసింది. హేమ రేవ్ పార్టీలో పాల్గొన్న‌ట్లు క‌ర్ణాట‌క పోలీసులు ధృవీక‌రించారు. తొలుత ఆమె పేరును కృష్ణ‌వేణిగా న‌మోదు చేసిన‌ట్లు స‌మాచారం.రేవ్ పార్టీ తాలూకు వీడియోలు, ఫోటోలు వైర‌ల్ కావ‌డంతో ఆమెను హేమ‌గా గుర్తించిన‌ట్లు తెలిసింది.

బ్ల‌డ్ టెస్ట్ రిజ‌ల్ట్స్ పాజిటివ్‌...

ఈ బెంగ‌ళూరు రేవ్ పార్టీకి 106 మంది హాజ‌రైన‌ట్లు స‌మాచారం. వారంద‌రి బ్లడ్ శాంపిల్స్ సేక‌రించిన‌ట్లు తెలిసింది. నార్కోటిక్ టీమ్ బ్ల‌డ్ శాంపిల్స్ సేక‌రించిన వారిలో హేమ కూడా ఉంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. తాజాగా నటి హేమ డ్రగ్స్ టెస్ట్ రిజల్ట్స్ పాజిటివ్‌గా వ‌చ్చిన‌ట్లు తెలిసింది.

ఆమె బ్లడ్ శాంపిల్స్‌లో డ్ర‌గ్స్ ఆన‌వాళ్లు ఉన్నట్లు నార్కోటిక్స్ టీమ్ ధృవీక‌రించిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ విష‌యాన్ని స్వ‌యంగా బెంగ‌ళూరు నార్కోటిక్స్ టీమ్ వెల్ల‌డించ‌డం టాలీవుడ్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

86 మందికి పాజిటివ్‌...

ఈ డ్ర‌గ్స్ రిజ‌ల్ట్ టెస్ట్‌లో హేమ‌తో పాటు మ‌రో 86 మంది రిజ‌ల్ట్ పాజిటివ్‌గా వ‌చ్చిన‌ట్లు తెలిసింది. వీరిద్ద‌రి నార్కోటిక్స్ కంట్రోల్ టీమ్‌ నోటీసులు జారీ చేసిన‌ట్లు తెలిసింది. త్వ‌ర‌లోనే కౌన్సిలింగ్‌కు హాజ‌రుకావాల‌ని నోటీసులో పేర్కొన్న‌ట్లు తెలిసింది.

స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడే మాట్లాడుతా...

డ్ర‌గ్స్ టెస్ట్‌లో రిజ‌ల్ట్ పాజిటివ్‌గా తేలిన‌ట్లు వ‌స్తోన్న వార్త‌ల‌పై హేమ స్పందించింది. స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు ఈ వివాదంపై మాట్లాడుతాన‌ని అన్న‌ది. అప్ప‌టివ‌ర‌కు ఏం చేస్తారో చేసుకొండి అంటూ పేర్కొన్న‌ది. అంత‌కుమించి ఈ డ్ర‌గ్స్ కేసుపై మాట్లాడ‌టానికి హేమ నిరాక‌రించింది.కౌన్సిలింగ్‌కు హేమ హాజ‌రుఅవుతారా లేదా అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

శ్రీకాంత్‌, యాంక‌ర్ శ్యామ‌ల పేర్లు...

ఈ రేవ్ పార్టీలో హేమ‌తో పాటు శ్రీకాంత్‌, యాంక‌ర్ శ్యామ‌ల కూడా పాల్గొన్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. ఈ పుకార్ల‌పై శ్రీకాంత్ రియాక్ట్ అయ్యాడు. రేవ్ పార్టీలు ఎలా ఉంటాయో కూడా త‌న‌కు తెలియ‌ద‌ని అన్నాడు. ఈ రేవ్ పార్టీలో దొరికిన‌ వాడెవడో కానీ, కొంచెం నాలాగే ఉన్నాడు. అత‌డికి కాస్త గ‌డ్డం ఉంది. ముఖం క‌వ‌ర్ చేసుకున్నాడు. అత‌డిని చూసి చాలా మంది నేనే అని పొర‌ప‌డుతున్నారు.

కానీ అది నేను కాదు. ద‌య‌చేసి ఈ పుకార్ల‌ను ఎవ‌రూ న‌మ్మొద్దు. ఎందుకంటే రేవ్ పార్టీల‌కు, ప‌బ్స్ వెళ్లే వ్య‌క్తిని కాను నేను.. రేవ్ పార్టీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియ‌దునేను ఇంట్లోనే ఉన్నాను. ద‌య‌చేసి త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మొద్దు’’ అని శ్రీకాంత్ స్పష్టం చేశాడు.శ్యామ‌ల కూడా తాను రేవ్ పార్టీల‌కు వెళ్ల‌లేద‌ని స్ప‌ష్టం చేసింది. త‌ప్పుడు క‌థ‌నాల‌ను ప్ర‌చారం చేయ‌ద్ద‌ని పేర్కొన్న‌ది.

Whats_app_banner