Rave Party: పేకాడితే రచ్చచేశావ్.. ఇప్పుడేమంటావ్.. నీకు శిక్ష తప్పదు: హేమపై కరాటే కల్యాణి ఫైర్-bangalore rave party actress karate kalyani fires on hema ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rave Party: పేకాడితే రచ్చచేశావ్.. ఇప్పుడేమంటావ్.. నీకు శిక్ష తప్పదు: హేమపై కరాటే కల్యాణి ఫైర్

Rave Party: పేకాడితే రచ్చచేశావ్.. ఇప్పుడేమంటావ్.. నీకు శిక్ష తప్పదు: హేమపై కరాటే కల్యాణి ఫైర్

Chatakonda Krishna Prakash HT Telugu
May 22, 2024 02:17 PM IST

Bangalore Rave Party - Hema vs Karate Kalyani: బెంగళూరు రేవ్ పార్టీ అంశంలో హేమపై కరాటే కల్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. తానే పెద్ద అని ఇండస్ట్రీలో చెప్పుకొని తిరిగే హేమ అసలు రూపం ఇదేనంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరిన్ని కామెంట్లు చేశారు.

Rave Party: పేకాడితే రచ్చచేశావ్.. ఇప్పుడేమంటావ్.. నీకు శిక్ష తప్పదు: హేమపై కరాటే కల్యాణి ఫైర్
Rave Party: పేకాడితే రచ్చచేశావ్.. ఇప్పుడేమంటావ్.. నీకు శిక్ష తప్పదు: హేమపై కరాటే కల్యాణి ఫైర్

Rave Party: బెంగళూరులో జరిగిన ఓ రేవ్ పార్టీ వ్యవహారంలో సినీ నటి హేమ చిక్కుకున్నారు. తాను ఆ పార్టీలో లేనని హేమ చెప్పగా.. ఆమె ఉన్నారని బెంగళూరు పోలీసులు వెల్లడించారు. ఈ రేవ్ పార్టీలో పాల్గొన్న వారిని గుర్తించి అదుపులోకి తీసుకునే పనిలో పోలీసులు ఉన్నారు. అయితే, రేవ్ పార్టీ విషయంలో హేమపై నటి కరాటే కల్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. హేమను విమర్శిస్తూ ఆమె ఓ వీడియో పోస్ట్ చేశారు. పెద్దదిక్కు అని చెప్పుకొని తిరిగే హేమ రేవ్ పార్టీలో దొరికిపోయారంటూ ఫైర్ అయ్యారు.

yearly horoscope entry point

పేకాడితే గొడవ చేశావ్

తాను స్నేహితులతో పేకాడితే హేమ చాలా రచ్చ చేశారని, ఇప్పుడు ఆమె రేవ్ పార్టీలో డ్రగ్స్‌తో దొరికారని కరాటే కల్యాణి ఫైర్ అయ్యారు. “ఏదో స్నేహితులతో పేకాడుకుంటే ఎవరో పట్టిస్తే.. అదేదో పెద్ద నేరంలాగా చెప్పావు. పేకాడావ్.. నేరం చేశావని చెప్పిన హేమక్క.. ఇప్పుడు నువ్వేం చేశాం. ఒక రేవ్ పార్టీలో డ్రగ్స్‌తో పాటు దొరికావు” అని కరాటే కల్యాణి అన్నారు.

శిక్షకు సిద్ధంగా ఉండు

పోలీసులు శాంపిల్స్ సేకరించిన తర్వాత శిక్షకు సిద్ధంగా ఉండాలని హేమపై వ్యాఖ్యలు చేశారు కరాటే కల్యాణి. “శాంపిల్స్ వచ్చిన తర్వాత బెంగళూరు పోలీసులు కచ్చితంగా నీకు పనిష్మెంట్ ఇస్తారు. ఎలాగూ చాలా శిక్షలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండు. ఒక మాట అనే ముందు.. కర్మ రిటర్న్స్ అంటారు.. మనకు చేసింది మనకు తిరిగి వస్తుందని అంటారు. దేవుడి దయ వల్ల నీకు డ్రగ్స్‌తో సంబంధం లేకుండా శాంపిల్స్‌లో ఏమీ లేకుండా ఉండాలని కోరుకుంటున్నా” అని కరాటే కల్యాణి ఆ వీడియోలో చెప్పారు. ఓ వైపు హేమకు శిక్ష తప్పదని అంటూనే.. మళ్లీ ఆమె కేసు నుంచి బయటపడాలని కోరుకుంటున్నానని కల్యాణి అన్నారు.

‘మా’ అసోసియేషన్ ఎన్నికల సమయంలోనూ హేమ చాలా రచ్చ చేశారని కరాటే కల్యాణి అన్నారు. ఇండస్ట్రీలో మహిళలకు చాలా చేశానని చెప్పుకుంటూ తిరుగుతున్నారని అన్నారు. ఆమే ఇప్పుడు రేవ్ పార్టీలో దొరికారని విమర్శించారు. “గురివింద గింజ తన వెనక ఉన్న మచ్చ చూసుకోదు అన్నట్టుగా.. బెంగళూరు రేవ్ పార్టీలో దొరిగిన హేమక్క.. ఇండస్ట్రీ వాళ్లని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారు. నేనే పెద్ద.. నేనే అందరినీ ఉద్దరిస్తున్నాను.. ఆడవాళ్లకి చాలా సాయం చేస్తున్నాను.. నేనే పెద్దదిక్కు అని హేమ ప్రవర్తించే తీరు చూస్తే బయటి వాళ్లు అబ్బో అనుకుంటారు. ఆమె చేసిన గొడవలు చూశాం. మా అసోసియేషన్ ఎన్నికల సమయంలో శివబాలాజీ చేయికొరికారు. రాజేంద్ర ప్రసాద్‍ను అడ్డుకున్నారు” అని హైమపై కరాటే కల్యాణి ఫైర్ అయ్యారు. ఆ తర్వాత తన పేకాట వ్యవహారంపై హేమ రచ్చ చేసిన విషయాన్ని లేవనెత్తారు కరాటే కల్యాణి.

ఇటీవలే బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఓ ఫామ్ హౌస్‍లో ఈ రేవ్ పార్టీ జరిగింది. హైదరాబాద్‍కు చెందిన ఓ వ్యాపారి ఈ పార్టీని నిర్వహించినట్టు బెంగళూరు పోలీసులు గుర్తించారు. ఈ పార్టీలో పాల్గొన్న కొందరిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మిగిలిన వారి వివరాలను రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ రేవ్ పార్టీలో హేమ కూడా పాల్గొన్నారని బెంగళూరు కమిషనర్ దయానంద్ చెప్పారు.

Whats_app_banner