Madhavan: బ్లాక్‌బస్టర్ లవ్‌స్టోరీతో మాధవన్ హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వాల్సింది - ఆ మూవీ ఎలా మిస్సయిందంటే?
Madhavan: 2001లో యూత్‌ఫుల్ లవ్‌స్టోరీతో టాలీవుడ్‌లోకి మాధవన్ హీరోగా ఎంట్రీ ఇవ్వాల్సింది. కానీ తెలుగు సినిమా చేయడానికి ఆసక్తి లేకపోవడంతో మాధవన్ ఆ మూవీని రిజెక్ట్ చేశాడు. ఆ సినిమా ఏదంటే?
Madhavan: మాధవన్‌కు తెలుగునాట కూడా భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలుగులో విలన్‌గా తప్పితే హీరోగా ఒక్క స్ట్రెయిట్ మూవీ కూడా చేయలేదు మాధవన్. అయినా టాలీవుడ్ హీరోలతో సమానంగా క్రేజ్, స్టార్‌డమ్‌ను సంపాదించుకున్నాడు. మణిరత్నం డబ్బింగ్ మూవీ సఖితో తెలుగులో హిట్ అందుకున్నాడు మాధవన్.
2000 ఏడాదిలో రిలీజైన ఈ మూవీ మ్యూజికల్ లవ్‌స్టోరీగా తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించింది. ఈ మూవీతో యూత్ ఫేవరేట్ హీరోగా మాధవన్ మారిపోయాడు. సఖి హిట్‌తో మాధవన్‌కు టాలీవుడ్‌లో హీరోగా పలు ఆఫర్స్ వచ్చాయి. కానీ అనివార్య కారణాల వల్ల ఆ అవకాశాల్ని మిస్ చేసుకున్నాడు మాధవన్.
నువ్వునేనులో హీరో...
మాధవన్ మిస్ చేసుకున్న సినిమాల్లో నువ్వు నేను కూడా ఒకటి. ఉదయ్ కిరణ్ హీరోగా తేజ దర్శకత్వంలో 2001లో రిలీజైన ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. కేవలం మూడు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా 16 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.
సఖి హిట్‌తో...
ఈ ట్రెండ్‌సెట్టింగ్ లవ్‌స్టోరీలో హీరోగాఉదయ్ కిరణ్ ఫస్ట్ ఛాయిస్ కాదు. మాధవన్‌తో నువ్వు నేను సినిమా చేయాలని డైరెక్టర్ తేజ అనుకున్నారట. ఈ కథతో అతడిని సంప్రదించాడట. సఖి హిట్‌తో తమిళంలో బిజీగా మారిన తెలుగులో సినిమాలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. ఈ విషయంలో అప్పట్లో తేజనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. మాధవన్ రిజెక్ట్ చేయడంతో అతడి స్థానంలో ఉదయ్‌కిరణ్‌ను హీరోగా తీసుకొని నువ్వునేను సినిమా చేశానని తేజ చెప్పాడు. నువ్వునేను సినిమాను రిజెక్ట్ చేసిన మాధవన్ బ్లాక్‌బస్టర్ మూవీలో అవకాశాన్ని కోల్పోయాడు.
రెండు వందల రోజులు ఆడింది...
ఫస్ట్ వీకెండ్ నువ్వు నేను సినిమాను తెలుగు ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. మౌత్‌టాక్‌తో మెల్లగా ప్రేక్షకులు థియేటర్లకు రావడం మొదలుపెట్టారు. ఆ తర్వాత హౌజ్‌ఫుల్స్‌తో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. కొన్ని థియేటర్లలో రెండు వందల రోజులకుపైగా ఆడింది. ఐదు నంది అవార్డులతో పాటు అనేక పురస్కారాలను దక్కించుకున్నది.
సవ్యసాచితో విలన్‌గా...
నువ్వు నేను సినిమాను మాధవన్ చేసి ఉంటే అతడి కెరీర్ మరోలా ఉండేది. తెలుగులో యూత్ హీరోగా పాపులర్ అయ్యేవాడు. నువ్వునేనును రిజెక్ట్ చేసిన మాధవన్ ఈ సినిమా రిలీజైన పదహారేళ్ల తర్వాత నాగచైతన్య సవ్యసాచి మూవీతో విలన్‌గా తెలుగులోకి అరంగేట్రం చేశాడు.
సైతాన్‌లో విలన్...
తమిళం, తెలుగుతో పాటు హిందీ భాషల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ వెర్సటైల్ యాక్టర్‌గా పేరుతెచ్చుకున్నాడు మాధవన్. విలన్ పాత్రలతో పాటు సాఫ్ట్ రోల్స్ చేస్తోన్నాడు. ఇటీవల రిలీజైన బాలీవుడ్ మూవీ సైతాన్‌లో అతీంద్రియ శక్తులు ఉన్న విలన్ పాత్రలో మాధవన్ యాక్టింగ్‌కు ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం తమిళంలో క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో టెస్ట్ మూవీ చేస్తోన్నాడు. హిందీలో రెండు సినిమాలు అంగీకరించాడు.