Animal OTT release: ఓటీటీలోకి యానిమల్.. మరికొన్ని గంటల్లోనే వచ్చేస్తోంది..
Animal OTT release: యానిమల్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. మరికొన్ని గంటల్లోనే రణ్బీర్ కపూర్, రష్మిక మందన్నా నటించిన ఈ మోస్ట్ వయోలెంట్ ఫిల్మ్.. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
Animal OTT release: యానిమల్ ఎట్టకేలకు ఓటీటీలో అడుగుపెడుతోంది. గురువారం (జనవరి 25) అర్ధరాత్రి 12 గంటల నుంచి నెట్ఫ్లిక్స్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. రిపబ్లిక్ డే సందర్భంగా మూవీని తీసుకొస్తున్నట్లు నెట్ఫ్లిక్స్ తమ ఇన్స్టాగ్రామ్ పోస్టు ద్వారా వెల్లడించింది.
అంతేకాదు థియేటర్లలో కంటే 8 నిమిషాలు ఎక్కువ నిడివితో ఈ సినిమా ఓటీటీలోకి రానుండటం విశేషం. ఇందులో రష్మికకు సంబంధించిన కొన్ని అదనపు సీన్లు చూసే అవకాశం ఓటీటీ ప్రేక్షకులకు దక్కనుంది. థియేటర్లలోనే 3 గంటల 21 నిమిషాలుగా ఉన్న ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీలో సుమారు మూడున్నర గంటలుగా ఉండనుంది.
యానిమల్ ఓటీటీ రిలీజ్
యానిమల్ మూవీ గతేడాది డిసెంబర్ 1న థియేటర్లలో రిలీజైంది. మొత్తానికి ఇప్పుడు సుమారు 56 రోజుల తర్వాత ఓటీటీలో అడుగుపెడుతోంది. జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా మూవీ నెట్ఫ్లిక్స్ లోకి వస్తోందని చాలా రోజులుగా వార్తలు వస్తున్నా.. కొన్ని లీగల్ అడ్డంకులు ఎదురయ్యాయి. అయితే రెండు రోజుల కిందటే వాటిని అధిగమించిన మూవీ టీమ్.. శుక్రవారం (జనవరి 26) నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు పరోక్షంగా చెప్పింది.
తాజాగా నెట్ఫ్లిక్స్ కూడా అధికారికంగా ప్రకటించింది. "గాలి దట్టంగా అలుముకుంది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. యానిమల్లో అతని క్రూరత్వాన్ని చూడండి. జనవరి 26 నుంచి తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో మీ నెట్ఫ్లిక్స్ లో" అనే క్యాప్షన్ తో ఈ అప్డేట్ ఇచ్చింది. ఈ సందర్భంగా ఓ వీడియో కూడా పోస్ట్ చేసింది.
రణ్బీర్ కపూర్ తన మూవీ ఓటీటీ రిలీజ్ పై స్పందించాడు. "థియేటర్లలో యానిమల్ మూవీకి వచ్చిన రెస్పాన్స్ మమ్మల్ని చాలా ఆనందానికి గురి చేసింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు తమ ఇళ్లలో కూర్చొని ఈ మూవీ చూసే అవకాశం దక్కనుంది. మా సినిమాను ప్రపంచ్యవాప్తంగా చూపించే అవకాశం రావడం నిజంగా చాలా ప్రత్యేకం" అని రణ్బీర్ అన్నాడు.
విమర్శలు.. కలెక్షన్లు..
యానిమల్ మూవీ రిలీజైనప్పటి నుంచీ ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. అయినా థియేటర్లలో మాత్రం మంచి వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లకుపైగా వసూలు చేయడం విశేషం. ఇందులో రణ్బీర్ చాలా వయోలెంట్ పాత్ర పోషించాడు. రష్మిక అతని భార్యగా నటించింది. బాబీ డియోల్ విలన్ గా నటించగా.. అనిల్ కపూర్ రణ్బీర్ తండ్రి పాత్ర పోషించాడు.
సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన యానిమల్ మూవీకి యానిమల్ పార్క్ పేరుతో సీక్వెల్ కూడా రానుంది. ఈ సినిమాకు సహ నిర్మాతగా కూడా వ్యవహరించిన సందీప్.. బాగానే సంపాదించాడు. అతడు సుమారు రూ.200 కోట్లకుపైగానే యానిమల్ ద్వారా ఆర్జించినట్లు తెలిసింది. థియేటర్లలో యానిమల్ మూవీని చూడటం మిస్ అయిన వాళ్లు ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
నెట్ఫ్లిక్స్ ఓటీటీ బేసిక్ ప్లాన్ రూ.199 నుంచి అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ ద్వారా మొబైల్, ల్యాప్టాప్, టీవీలో ఒక సమయానికి ఒక స్క్రీన్ లో మూవీస్, షోస్ చూసే వీలుంటుంది.
టాపిక్