Pushpa 2 Trailer Release Update: పుష్ప-2 ట్రైలర్ ముంగిట పోస్టర్ వదిలిన సుకుమార్.. క్యూరియాసిటీ పెంచేసిన స్టిల్-allu arjun and rashmika mandanna starrer pushpa 2 sequel glimpse is ready to explode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pushpa 2 Trailer Release Update: పుష్ప-2 ట్రైలర్ ముంగిట పోస్టర్ వదిలిన సుకుమార్.. క్యూరియాసిటీ పెంచేసిన స్టిల్

Pushpa 2 Trailer Release Update: పుష్ప-2 ట్రైలర్ ముంగిట పోస్టర్ వదిలిన సుకుమార్.. క్యూరియాసిటీ పెంచేసిన స్టిల్

Galeti Rajendra HT Telugu

Pushpa 2 Release Date: పుష్ప-2: ది రూల్‌ మూవీ థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా హైప్‌ని మరింత పెంచుతూ ఈరోజు ఒక బ్లాసింగ్ స్టిల్‌ని వదిలారు.

పుష్ప-2 స్టిల్

పుష్ప-2 మూవీ గురించి వరుస అప్‌డేట్స్‌తో ప్రేక్షకుల్లో దర్శకుడు సుకుమార్ క్యూరియాసిటీ పెంచేస్తున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబరు 5న ఈ మూవీ రిలీజ్ కాబోతుండగా.. త్వరలోనే ట్రైలర్‌ని రిలీజ్ చేయబోతున్నారు. ఈ ట్రైలర్ ముంగిట మంగళవారం ఒక బ్లాస్టింగ్‌ స్టిల్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అల్లు అర్జున్ కోపంగా ఈ పోస్టర్‌లో చూస్తుండగా.. ఫహద్‌ ఫాసిల్‌ వెటకారంగా నవ్వుతూ కనిపిస్తున్నాడు.

కోవిడ్ -19 తర్వాత 2021, డిసెంబరు 17న రిలీజైన ‘పుష్ప ది రైజ్’ మూవీ సరికొత్త రికార్డులు నెలకొల్పింది. రిలీజైన అన్ని భాషల్లోనూ సూపర్ హిట్‌గా నిలిచి.. బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు రాబట్టింది. దాంతో ‘పుష్ప-2 ది రూల్’పై అంచనాలు పెరిగిపోగా.. డిసెంబరులోనే థియేటర్లలోకి రాబోతోంది.

సమంత ఔట్.. శ్రీలీల ఇన్

అల్లు అర్జున్‌కి జంటగా కన్నడ భామ రష్మిక మంధాన శ్రీవల్లి పాత్రలో నటించగా.. మలయాళం హీరో ఫహద్‌ ఫాసిల్‌ పాత్ర కంటిన్యూ‌కానుంది. ‘పుష్ప ది రైజ్’లో ఫాసిల్ పాత్ర నిడివి చాలా తక్కువగా ఉంది. కానీ.. పుష్ప-2లో మాత్రం ఫుల్ లెంగ్త్ ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ చెప్తోంది. పుష్ప-1లో సమంత ఐటెం సాంగ్‌లో డ్యాన్స్ చేయగా.. పుష్ప-2లో శ్రీలీల ఐటెం సాంగ్‌ చేయబోతోంది. దాంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది.

పుష్ప, భన్వర్ సింగ్‌ షెకావత్‌ల మధ్య ఆధిపత్య పోరుని చూసేందుకు ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. త్వరలోనే ట్రైలర్‌ని రిలీజ్ చేయబోతున్నామని మైత్రీ మూవీ మేకర్స్‌ మంగళవారం మరోసారి అధికారికంగా ప్రకటించింది. రిలీజ్ దగ్గర పడుతుండటంతో ఈ నెల 15న ట్రైలర్ వచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

 

ప్రమోషన్‌కి రోడ్ మ్యాప్

సినిమా రిలీజ్‌కి ఇంకా ఒక నెల సమయం ఉండటంతో దేశ వ్యాప్తంగా ప్రమోషన్స్‌ని గట్టిగా చేయాలని అల్లు అర్జున్‌తో కలిసి చిత్ర యూనిట్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది. పాట్నా కోచి, హుబ్లీ, చెన్నై, ముంబయి ఇలా ప్రధాన నగరాల్ని టార్గెట్‌గా చేసుకుని ప్రమోషన్ ఈవెంట్స్ చేయాలని పుష్ప టీమ్ ప్లాన్ చేస్తోంది. పుష్ప-1లో కనిపించని కొంత మంది ఆర్టిస్ట్‌లను కూడా పుష్ప-2కి సుకుమార్ యాడ్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో జగపతి బాబు, ప్రకాశ్ రాజ్ కూడా ఉన్నారు.