తెలుగు న్యూస్ / ఫోటో /
Celebrities Diwali: తారల ఇళ్లల్లో దివాళీ వెలుగులు.. ఎన్టీఆర్, రష్మిక మందన్నా నుంచి యవరాజ్ సింగ్ వరకు! (ఫొటోలు)
Rashmika Mandanna Jr NTR Celebrities Diwali Celebrations: టాలీవుడ్, బాలీవుడ్, క్రికెట్ సెలబ్రిటీ ఇళ్లల్లో దివాళీ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. కుటుంబ సభ్యులతో తారలు సంతోషంగా దీపావళి జరుపుకున్నారు. వారిలో జూనియర్ ఎన్టీఆర్, రష్మిక మందన్నా నుంచి క్రికెటర్ యువరాజ్ సింగ్ వరకు ఉన్నారు.
(1 / 12)
సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ మసాబా, నీనా గుప్తా తమ భర్తలు సత్యదీప్ మిశ్రా, వివేక్ మెహ్రాతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు.
(2 / 12)
మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తన భార్య హాజెల్ కీచ్, పిల్లలతో కలిసి ఇంట్లో ఇలా దీపావళి జరుపుకున్నారు.
(3 / 12)
బాలీవుడ్ బ్యూటి, సాహో హీరోయిన్ శ్రద్ధా కపూర్ ఇంట్లో దివాళీ వేడుకలు చేసుకుంది. ఈ సందర్భంగా తన కుక్కపిల్లతో ప్రేమగా క్యూట్‌గా దిగిన ఫొటోను షేర్ చేసింది.
(4 / 12)
బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా దివాళీ జరుపుకుంటూ భార్య తాహిరా కశ్యప్‌తో ఇలా క్యూట్ మూమెంట్ పంచుకున్నారు.
(5 / 12)
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇలా తన భార్యాపిల్లలతో కలిసి ఇంట్లోనే దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఇందులో ట్రెడిషనల్‌గా కనిపించారు తారక్ కుటుంబం.
(6 / 12)
మాజీ క్రికెట్ ఆటగాడు హర్భజన్ సింగ్, గీతా బస్రా దీపావళికి కలర్ కోఆర్డినేటెడ్ దుస్తుల్లో కనిపించారు. ఇలా అందంగా ఫొటో దిగి ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్ చేశారు.
(7 / 12)
నేషనల్ క్రష్ రష్మిక మందన్న దీపాలు వెలిగించి దివాళీ జరుపుకుంది. అందమైన తెలుపు రంగు కుర్తా ధరించిన రష్మిక రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇంట్లో దివాళీ పండుగకు హాజరైనట్లు సమాచారం.
(8 / 12)
కంగనా రనౌత్ మనాలిలోని తన ఇంట్లో దీపావళి వేడుకలు జరుపుకుంది. అందమైన గులాబీ రంగు చీరను ధరించి కుటుంబ సభ్యులతో కలిసి రంగోలీలు చేసింది.
(9 / 12)
ధర్మా ప్రొడక్షన్స్ కార్యాలయంలో బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ తన పిల్లలతో దీపావళి వేడుకలు జరుపుకున్నారు.
(10 / 12)
బాలీవుడ్ బ్యూటి పరిణీతి చోప్రా దీపావళి వేడుకలను ఆకుపచ్చ రంగులో ఉన్న లెహేరియా దుస్తులు ధరించి చేసుకుంది. చేతిలో దీపాలను చూపిస్తూ ఇలా ఫొటోలకు పోజులిచ్చింది పరిణీతి.
ఇతర గ్యాలరీలు