Sreeleela Special Song: పుష్ప 2లో శ్రీలీల ఐటమ్ సాంగ్.. సమంత మ్యాజిక్ క్రియేట్ చేస్తుందా?
Sreeleela Special Song In Pushpa 2: అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలో హీరోయిన్ శ్రీలీల స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదివరకు పుష్ప మూవీలో సమంత ఊ అంటావా మావ.. ఉఉ అంటావా మావ పాటతో నేషనల్ వైడ్‌గా క్రేజ్ సొంతం చేసుకుంది. మరి బన్నీ, శ్రీలీల జోడీ ఎలా ఉంటుందో ముందు ముందు చూడాలని టాక్ వినిపిస్తోంది.
Sreeleela Item Song In Pushpa 2: ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప 2. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న పుష్ప 2 ది రూల్ మూవీపై ఎన్నో అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సినిమా నుంచి వచ్చే అప్డేట్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటూ హైప్ క్రియేట్ చేస్తున్నాయి.
ఏ హీరోయిన్ అనేది
ఇదిలా ఉంటే, పుష్ప మూవీలో సమంత చేసిన ఐటమ్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఆ మూవీ విజయంలో సమంత చేసిన ఊ అంటావా మావ.. ఉఉ అంటావా మావ పాట ఎంతగానో భాగం పంచుకుంది. అంతేకాకుండా ఆ పాటతో సమంతకు నేషనల్ వైడ్‌గా కూడా ఫుల్ క్రేజ్ వచ్చింది. మరి అంత సెన్సేషన్ అయిన పాటలాంటి మరో ఐటమ్ నెంబర్‌ను ఏ హీరోయిన్ చేయాలా అనేది మొన్నటివరకు హాట్ టాపిక్‌గా మారింది.
అల్లు అర్జున్ సరసన
పుష్ప 2 మూవీలో ఐటమ్ సాంగ్‌లో నటించే హీరోయిన్ ఈమెనే అంటూ ఎన్నో రూమర్స్, టాక్స్ వినిపించాయి. కానీ, తాజాగా అదిరిపోయే న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. పుష్ప 2 చిత్రంలో అల్లు అర్జున్ సరసన స్పెషల్ సాంగ్‌ను శ్రీలీల చేయనుందని సమాచారం. ప్రస్తుతం ఈ విషయం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిపోయింది.
డ్యాన్సింగ్ క్వీన్‌గా
ఇక శ్రీలీల డ్యాన్సింగ్ క్వీన్‌గా తెలుగులో పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. తన డ్యాన్స్‌తో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేసింది. ఇప్పుడు ఎన్నో అంచనాలు ఉన్న పుష్ప ది రూల్ మూవీలో ఐటమ్ సాంగ్‌ను శ్రీలీల చేస్తుందనగానే మరింత హైప్ క్రియేట్ అయింది. దీంతో మరి పుష్పలో సమంత క్రియేట్ చేసిన మ్యాజిక్‌ను పుష్ప 2లో శ్రీలీల రిప్లేస్ చేస్తుందా అని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు.
స్పెషల్‌గా ఐటమ్ సాంగ్స్
ప్రస్తుతం పుష్ప 2లో శ్రీలీల భాగమైనట్లు, స్పెషల్ సాంగ్‌లో శ్రీలీలనే ఫైనల్ అయినట్లు సమాచారం చక్కర్లు కొడుతోంది. దీనికి సంబంధించి అధికారికంగా వెలువడాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే, సుకుమార్ డైరెక్ట్ చేసే సినిమాల్లో ఐటమ్ సాంగ్స్‌కు చాలా ప్రత్యేకత ఉంటుంది. ఆర్య మూవీలో అ అంటే అమలాపురం, రింగా రింగా, జిగేల్ రాణి, డియ్యాలో డియ్యాలో వంటి పాటలు ఎంతగానో హిట్ అయ్యాయి.
డిసెంబర్ 5న
పుష్ప 2లో అల్లు అర్జున్, శ్రీలీల మధ్య ఈ స్పెషల్ సాంగ్‌ను ఎలా తెరకెక్కిస్తారో చూడాలి. ఇదిలా ఉంటే, పుష్ప 2 సినిమాను వరల్డ్ వైడ్‌గా డిసెంబర్ 5న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాకుండా పుష్ప ది రూల్ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆరు భాషల్లో కలిపి మొత్తం 11,500 స్త్రీన్స్‌లలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
బిగ్గెస్ట్ రిలీజ్
భారతదేశంలో 6500 స్క్రీన్స్‌లలో, ఓవర్సీస్‌లో 5000 స్క్రీన్స్‌లో పుష్ప 2 మూవీని గ్రాండ్ విడుదలకు ప్లాన్ చేస్తున్నామని ఇటీవల మేకర్స్, డిస్ట్రిబ్యూటర్స్ పేర్కొన్నారు. దీంతో ఇండియన్ సినిమా చరిత్రలోనే పుష్ప 2 బిగ్గెస్ట్ రిలీజ్‌గా రికార్డ్ క్రియేట్ చేయనునందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
టాపిక్