Pushpa 3: పుష్ప 3 కూడా వచ్చేస్తోంది అంటున్న ఫహద్ ఫాజిల్
Pushpa 3: పుష్ప 2 కోసం ఇప్పుడు టాలీవుడ్‌తోపాటు పాన్ ఇండియా ఫ్యాన్స్ వేచి చూస్తున్నారు. ఈ మూవీ అప్‌డేట్స్ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మూవీలో నటించిన ఫహద్ మాత్రం మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చాడు.
పుష్ప మూవీ పాన్ ఇండియా లెవల్లో సృష్టించిన సంచలనాల తర్వాత ఈ మూవీ సెకండ్ పార్ట్‌పై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను ఓ కొత్త లుక్‌లో చూపించిన డైరెక్టర్ సుకుమార్.. బాక్సాఫీస్ దగ్గర అద్భుతమే చేశాడు. గతేడాది డిసెంబర్‌లో రిలీజైన ఈ మూవీ.. కలెక్షన్ల వర్షం కురిపించింది. ముందే సెకండ్ పార్ట్ కూడా రాబోతోందని చెప్పడంతో దీని గురించి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఇప్పుడు తాజాగా వస్తున్న సమాచారాన్ని బట్టి సుకుమార్ పుష్ప 2తో ఆపేసేలా కనిపించడం లేదు. పుష్ప 3 తీయడానికి కూడా అవసరమైన స్క్రిప్ట్ తన దగ్గర ఉందట. ఈ విషయాన్ని పుష్పలో నటించిన ఫహద్ ఫాజిలే చెప్పడం విశేషం. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పుష్ప 3 గురించి వెల్లడించాడు. ఆ ఇంటర్వ్యూ క్లిప్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
"సుక్కు సార్ స్టోరీ చెప్పినప్పుడు పుష్ప ఒకే సినిమా అని అనుకున్నాను. కానీ పోలీస్ స్టేషన్ సీన్, సెకండాఫ్‌లో నా పార్ట్ తర్వాత అది రెండు పార్ట్‌లు అయింది. అయితే ఈ మధ్యే అతడు నాతో మాట్లాడుతూ.. పుష్ప 3కి కూడా తాను సిద్ధమయ్యాయని, అందుకు సరిపడా మెటీరియల్ తన దగ్గర ఉందని చెప్పాడు" అంటూ నవ్వేశాడు ఫహద్.
పుష్ప సెకండ్ పార్ట్ కోసమే ఆతృతగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌ను ఇది మరింత ఆశ్చర్యపరిచింది. ఆగస్ట్‌లో పుష్ప 2 షూటింగ్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది డిసెంబర్‌లో ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు అంచనా వేస్తున్నారు.