DeAr OTT Streaming: ఓటీటీలోకి వచ్చేసిన డియర్ సినిమా.. ఐదు భాషల్లో స్ట్రీమింగ్
DeAr Movie OTT Streaming: డియర్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఐశ్వర్య రాజేశ్ నటించిన ఈ మూవీ ఐదు భాషల్లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. థియేటర్లలో రిలీజైన రెండు వారాల్లోనే ఓటీటీలో ఎంట్రీ ఇచ్చింది.
DeAr Movie OTT: జీవీ ప్రకాశ్ కుమార్, ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రలు పోషించిన తమిళ మూవీ ‘డియర్’ మంచి అంచనాలతో థియేటర్లలోకి వచ్చింది. ఏప్రిల్ 11వ తేదీన తమిళంలో రిలీజైన ఈ చిత్రం.. ఒక్క రోజు తర్వాత ఏప్రిల్ 12న తెలుగులోనూ విడుదలైంది. ఈ సినిమా తెలుగు వెర్షన్ కోసం కూడా మూవీ టీమ్ బాగానే ప్రమోషన్లను చేసింది. అయితే, అనుకున్న స్థాయిలో డియర్ మూవీ కలెక్షన్లను రాబట్టలేకపోయింది. ఈ తరుణంలో 20 రోజులోపే ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చేసింది.
స్ట్రీమింగ్ వివరాలివే..
డియర్ సినిమా నేడు (ఏప్రిల్ 28) నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో రిలీజ్ అయిన 17 రోజుల్లోనే ఈ కామెడీ ఫ్యామిలీ డ్రామా మూవీ ఓటీటీలో అడుగుపెట్టింది. అనుకున్నస్థాయిలో థియేట్రికల్ రన్ లేకపోవటంతో అంచనాల కంటే ముందే ఈ మూవీ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది.
డియర్ సినిమా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లోనూ స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోని ఈ చిత్రం.. ఓటీటీలోకి త్వరగానే వచ్చేసింది. దీంతో ఓటీటీ మంచి వ్యూస్ దక్కించుకుంటుందనే అంచనాలు ఉన్నాయి.
డియర్ సినిమాకు ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. జీవీ ప్రకాశ్ కుమార్, ఐశ్వర్య రాజేశ్‍తో పాటు కాళీ వెంకట్, రోహిణి, ఇళవరసు, తలైవాసల్ విజయ్, గీతా కైలాసం, నందిని కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమారే సంగీతం అందించారు. నట్‍మెగ్ ప్రొడక్షన్స్, రోమియో పిక్చర్స్ పతాకాలపై వరుణ్ త్రిపురణేని, అభిషేక్ రామిశెట్టి, పృథ్విరాజ్ ఈ మూవీని సంయుక్తంగా నిర్మించారు.
డియర్ మూవీ స్టోరీ లైన్
దీపికా (ఐశ్వర్య రాజేశ్) గురక చుట్టూ డియర్ మూవీ సాగుతుంది. న్యూస్ రీడర్‌గా పని చేసే అరుణ్ (జీవీ ప్రకాశ్ కుమార్), దీపిక (ఐశ్వర్య)కు వివాహం జరుగుతుంది. తాను గొప్ప జర్నలిస్ట్ కావాలని అరుణ్ లక్ష్యంగా పెట్టుకుంటాడు. అయితే, చిన్న శబ్దం వచ్చినా అతడికి మేలకువ వచ్చే సమస్య ఉంటుంది. మరోవైపు, నిద్రలో గట్టిగా గురక పెట్టే సమస్య దీపికకు ఉందని అరుణ్‍కు అర్థమవుతుంది. దీపిక గురక వల్ల అరుణ్ నిద్రపట్టక సతమతమవుతుంటాడు. ఏకంగా దీపికతో విడాకులు తీసుకోవాలని కూడా ఓ దశలో అనుకుంటాడు. అయితే, మొత్తంగా దీపిక పరిస్థితిని అరుణ్ అర్థం చేసుకున్నాడా.. వారి బంధం బలపడిందా.. లేదా అనేది డియర్ సినిమాలో ప్రధాన అంశాలుగా ఉన్నాయి.
డియర్ సినిమాలో ఐశ్వర్య రాజేశ్, ప్రకాశ్ కుమార్ పర్ఫార్మెన్స్‌కు ప్రశంసలు వచ్చాయి. అయితే, ఈ మూవీలో కథనం అంతగా ఆకట్టుకోలేదని, ఎమోషనల్‍గా కనెక్ట్ కాలేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మిక్స్డ్ టాక్ రావటంతో ఈ చిత్రం ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయింది.
కాగా, నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ఏప్రిల్ 26వ తేదీన తెలుగు బ్లాక్ బస్టర్ టిల్లు స్క్వేర్ అడుగుపెట్టింది. థియేటర్లలో బంపర్ హిట్ అయిన ఈ కామెడీ థ్రిల్లర్ చిత్రం.. నెట్‍ఫ్లిక్స్‌లో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ స్ట్రీమ్ అవుతోంది. సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు.