Dear OTT: ప‌దిహేను రోజుల్లోనే ఓటీటీలోకి ఐశ్వ‌ర్య రాజేష్ కామెడీ మూవీ - తెలుగులోనూ స్ట్రీమింగ్‌-gv prakash kumar aishwarya rajesh dear movie to stream on netflix ott from this date ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dear Ott: ప‌దిహేను రోజుల్లోనే ఓటీటీలోకి ఐశ్వ‌ర్య రాజేష్ కామెడీ మూవీ - తెలుగులోనూ స్ట్రీమింగ్‌

Dear OTT: ప‌దిహేను రోజుల్లోనే ఓటీటీలోకి ఐశ్వ‌ర్య రాజేష్ కామెడీ మూవీ - తెలుగులోనూ స్ట్రీమింగ్‌

Nelki Naresh Kumar HT Telugu
Apr 26, 2024 06:01 AM IST

Dear OTT: జీవీ ప్ర‌కాష్ కుమార్‌, ఐశ్వ‌ర్య రాజేష్ జంట‌గా న‌టించిన డియ‌ర్ మూవీ థియేట‌ర్ల‌లో విడుద‌లై రెండు వారాలు కూడా గ‌డ‌వ‌క‌ముందే ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. ఏప్రిల్ 28 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది.

డియ‌ర్ మూవీ ఓటీటీ
డియ‌ర్ మూవీ ఓటీటీ

Dear OTT: జీవీ ప్ర‌కాష్ కుమార్‌, ఐశ్వ‌ర్య రాజేష్ హీరోహీరోయిన్లుగా న‌టించిన డియ‌ర్ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైన రెండు వారాల గ్యాప్‌లోనే ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. ఏప్రిల్ 28 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో డియ‌ర్ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. త‌మిళంతో పాటు తెలుగులోనూ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ రిలీజ్ అవుతోంది.

ఏప్రిల్ 11న థియేట‌ర్ల‌లో...

ఏప్రిల్ 11న డియ‌ర్ మూవీ థియేట‌ర్ల ద్వారా ప్రేక్ష‌కుల ముందుకువ‌చ్చింది. గుర‌క స‌మ‌స్య ప్ర‌ధానంగా ఫ్యామిలీ ఎమోష‌న్స్‌కు కామెడీని జోడించి ద‌ర్శ‌కుడు ఆనంద్ ర‌విచంద్ర‌న్ డియ‌ర్ మూవీని తెర‌కెక్కించాడు. యూనిక్ కాన్సెప్ట్‌ను ఎంచుకున్న ఆ స‌మ‌స్య‌ను అర్థ‌వంతంగా చెప్ప‌డంలో ద‌ర్శ‌కుడు త‌డ‌బ‌డ‌టంతో సినిమా డిజాస్ట‌ర్‌గా మిగిలింది. థియేట‌ర్ రిజ‌ల్ట్ కార‌ణంగానే ఈ మూవీని రెండు వారాల గ‌డువులోనే ఓటీటీలో రిలీజ్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. తెలుగులోనూ ఈ మూవీ థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. కానీ రిలీజైన విష‌యం కూడా తెలియ‌కుండానే ఎత్తేశారు.

అర్జున్‌...దీపిక పెళ్లి క‌థ‌...

అర్జున్ (జీవీ ప్ర‌కాష్ కుమార్‌) ఓ న్యూస్ రీడ‌ర్‌. చిన్న‌పాటి శ‌బ్దాల‌కే నిద్ర‌లో నుంచి మేల్కొంటుంటాడు. దీపికతో (ఐశ్వ‌ర్య రాజేష్‌) అత‌డి పెళ్లిని పెద్ద‌లు జ‌రిపిస్తారు. దీపిక‌కు గుర‌క‌పెట్టే అల‌వాటు ఉంటుంది. ఒక‌రి స‌మ‌స్య‌ను మ‌రికొరు దాచేసి పెళ్లిచేసుకుంటారు. భార్య గుర‌క కార‌ణంగా అర్జున్ ఎలాంటి ఇబ్బందులు ప‌డ్డాడు? ఈ చిన్న స‌మ‌స్య‌కు దీపిక నుంచి విడాకులు తీసుకోవాల‌ని అనుకున్న అర్జున్ ప్ర‌య‌త్నాలు నెర‌వేరాయా? దీపిక సంఘ‌ర్ష‌ణ‌ను ఎలా అర్థం చేసుకున్నాడు? అన్న‌దే మూవీ క‌థ‌.

సినిమాటిక్ ఎమోష‌న్స్‌...

గుర‌క నేప‌థ్యంలో వ‌చ్చే స‌న్నివేశాల్లోని కామెడీ స‌రిగ్గా పండ‌లేదు. ఫ్యామిలీ ఎమోష‌న్స్ కూడా సినిమాటిక్‌గా సాగ‌డం కూడా డియ‌ర్ మూవీకి మైన‌స్‌గా మారింది. ఈ గుర‌క కాన్సెప్ట్‌తో గ‌త ఏడాది త‌మిళంతో గుడ్‌నైట్ పేరుతో ఓ మూవీ వ‌చ్చింది.

రెండు క‌థ‌లు ఇంచుమించు ఒక‌టే కావ‌డం కూడా డియ‌ర్ ఫెయిల్యూర్‌కు కార‌ణ‌మైంది. సినిమా డిజాస్ట‌ర్ అయినా ఐశ్వ‌ర్య రాజేష్ యాక్టింగ్‌కు మాత్రం ప్ర‌శంస‌లు ద‌క్కాయి. గుర‌క వ‌ల్ల ఎర్ప‌డిన స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట‌ప‌డి త‌న కాపురాన్ని చ‌క్క‌దిద్దుకోవాల‌ని ప్ర‌య‌త్నించే ఇల్లాలి పాత్ర‌లో స‌హ‌జ న‌ట‌న‌ను క‌న‌బ‌రిచింది.

క‌థ న‌చ్చితే...

గ్లామ‌ర్‌కు దూరంగా కెరీర్ ఆరంభం నుంచి యాక్టింగ్‌కు ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్ట‌ర్స్ ఎంచుకుంటూ తెలుగు, త‌మిళ భాష‌ల్లో సినిమాలు చేస్తోంది ఐశ్వ‌ర్య రాజేష్‌. క‌థ న‌చ్చితే హీరోయిన్‌గానే కాకుండా క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా కూడా క‌నిపించ‌డానికి సిద్ధ‌ప‌డుతోంది. త‌మిళంలో గ‌త ఏడాది ది గ్రేట్ ఇండియ‌న్ కిచెన్‌, ర‌న్ బేబీ ర‌న్‌తో పాటు మ‌రో నాలుగు సినిమాలు చేసింది. రెండు మిన‌హా మిగిల‌న‌వ‌న్నీ ప్రేక్ష‌కుల్ని మెప్పించాయి. ఈ ఏడాది డియ‌ర్‌తో ఫ‌స్ట్ టైమ్ ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించింది. ప్ర‌స్తుతం త‌మిళంలో ఆరు సినిమాలు చేస్తోంది ఐశ్వ‌ర్య రాజేష్‌.

తెలుగులోనూ...

తెలుగులో కౌస‌ల్య కృష్ణ‌మూర్తి, వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌, ట‌క్ జ‌గ‌దీష్‌తో పాటు రిప‌బ్లిక్ సినిమాలు చేసింది. మ‌రోవైపు మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా బిజీగా ఉంటూనే హీరోగా సినిమాలు చేస్తున్నాడు జీవీ ప్ర‌కాష్ కుమార్‌. అత‌డు హీరోగా న‌టించిన రెబెల్ మూవీ ఇటీవ‌లే రిలీజైంది.

IPL_Entry_Point

టాపిక్