Tamannaah: ఐపీఎల్ ఇల్లీగ‌ల్ స్ట్రీమింగ్ కేసు - సైబ‌ర్ క్రైమ్ విచార‌ణ‌కు త‌మ‌న్నా - కార‌ణం ఇదే!-tollywood actress tamannaah summoned in illegal ipl streaming case ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Tamannaah: ఐపీఎల్ ఇల్లీగ‌ల్ స్ట్రీమింగ్ కేసు - సైబ‌ర్ క్రైమ్ విచార‌ణ‌కు త‌మ‌న్నా - కార‌ణం ఇదే!

Tamannaah: ఐపీఎల్ ఇల్లీగ‌ల్ స్ట్రీమింగ్ కేసు - సైబ‌ర్ క్రైమ్ విచార‌ణ‌కు త‌మ‌న్నా - కార‌ణం ఇదే!

Nelki Naresh Kumar HT Telugu
Apr 25, 2024 11:43 AM IST

Tamannaah: ఐపీఎల్ ఇల్లీగ‌ల్ స్ట్రీమింగ్ కేసులో మ‌హారాష్ట్ర సైబ‌ర్ క్రైమ్ పోలీసులు మిల్కీ బ్యూటీ త‌మ‌న్నాకు నోటీసులు పంపించారు. ఈ కేసుకు సంబంధించి నెక్స్ట్ వీక్‌లో విచార‌ణ‌కు త‌మ‌న్నా హాజ‌రుకానున్న‌ట్లు స‌మాచారం.

త‌మ‌న్నా
త‌మ‌న్నా

Tamannaah: మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా చిక్కుల్లో ప‌డ్డ‌ది. ఐపీఎల్ 2024 ఇల్లీగ‌ల్ స్ట్రీమింగ్ కేసులో త‌మ‌న్నాకు సైబ‌ర్ క్రైమ్ పోలీసులు నోటీసులు పంపించారు.

నిబంధ‌న‌లు అతిక్ర‌మిస్తూ...

ఐపీఎల్ 2025 స్ట్రీమింగ్ రైట్స్ 23 758 కోట్ల‌కు వ‌యాకామ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ ద‌క్కించుకున్న‌ది. ఐపీఎల్ లైవ్ స్ట్రీమింగ్ హ‌క్కులు వ‌యాకామ్ త‌ప్ప మ‌రో సంస్థ‌కు లేవు. కానీ ఈ నిబంధ‌న‌ల‌ను అతిక్ర‌మిస్తూ ఫెయిర్‌ప్లే బెట్టింగ్ యాప్ త‌మ ఛానెల్‌లో ఐపీఎల్ మ్యాచ్‌ల‌ను లైవ్ స్ట్రీమింగ్ చేసింది. ఫెయిర్ ప్లే బెట్టింగ్‌ యాప్ వ‌ల్ల త‌మ‌కు భారీగా న‌ష్టం వాటిల్లింద‌ని మ‌హారాష్ట్ర సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు వ‌యాకామ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప్ర‌తినిధులు ఫిర్యాదుచేశారు.

త‌మ‌న్నాకు నోటీసులు...

ఈ ఐపీఎల్ ఇల్లీగ‌ల్ స్ట్రీమింగ్‌కు సంబంధించి ఫెయిర్ ప్లే యాప్‌ నిర్వ‌హ‌కుల‌తో పాటు త‌మ‌న్నాకు కూడా సైబ‌ర్ క్రైమ్ పోలీసులు నోటీసులు పంపించిన‌ట్లు తెలిసింది. ఈ ఫెయిర్ ప్లే బెట్టింగ్ యాప్ యాడ్స్‌లో త‌మ‌న్నా న‌టించింది. ఈ యాప్‌ను ప్ర‌మోట్ చేస్తోంది.

అందువ‌ల్లే త‌మ‌న్నాకు కూడా మ‌హారాష్ట్ర సైబ‌ర్ క్రైమ్ పోలీసులు నోటీసుల‌ను పంపించిన‌ట్లు స‌మాచారం. నెక్స్ట్ వీక్‌లో త‌మ‌న్నాను సైబ‌ర్ క్రైమ్ పోలీసులు విచారించ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఏప్రిల్ 29న ఆమె విచార‌ణ‌కు హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతోన్నారు.

ర‌ణ్‌భీర్ కూడా...

ఈ ఫెయిర్ ప్లే బెట్టింగ్ యాప్ యాడ్స్‌లో న‌టించిన స్టార్స్ చిక్కుల్లో ప‌డ‌టం ఇది కొత్తేమీ కాదు. గ‌తంలో ఈ యాప్ యాడ్స్‌లో ర‌ణ్‌భీర్‌క‌పూర్, శ్ర‌ద్ధాక‌పూర్ న‌టించారు. వారికి గ‌త ఏడాది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఈ యాప్ ద్వారా అక్ర‌మంగా వారు భారీగా ఆదాయాల్ని సంపాదించిన‌ట్లు వార్త‌లొచ్చాయి.

200 కోట్ల‌తో పెళ్లి...

ఫెయిర్ ప్లే బెట్టింగ్ యాప్‌ను మ‌హాదేవ్ ఆన్‌లైన్ గేమింగ్ యాప్ నిర్వ‌హిస్తోంది. ఇందులో క్రికెట్‌తో పాటు ఫుట్‌బాట్‌, టెన్నిస్‌, బ్యాడ్మింట‌న్‌తో పాటు ప‌లు గేమ్స్‌కు సంబంధించి బెట్టింగ్ జ‌రుపుతుంటారు. మ‌హాదేవ్ గేమింగ్ యాప్ ఓన‌ర్ సౌర‌భ్ చంద్ర‌కార్ పెళ్లి గ‌త ఏడాది దుబాయ్‌లో జ‌రిగింది. ఈ పెళ్లి కోసం అత‌డు రెండు వంద‌ల కోట్లు ఖ‌ర్చు చేయ‌డం అప్ప‌ట్లో హాట్‌టాపిక్‌గా మారింది.

జైల‌ర్‌తో హిట్‌...

త‌మ‌న్నా ద‌క్షిణాదితో పాటు బాలీవుడ్‌లో ప‌లు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. గ‌త ఏడాది ర‌జ‌నీకాంత్ జైల‌ర్ మూవీలో కీల‌క పాత్ర చేసింది. వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ మూవీ ఐదు వంద‌ల కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. తెలుగులో చిరంజీవి భోళాశంక‌ర్‌లో త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టించింది. కానీ మూవీ ఆశించిన విజ‌యాన్ని సాధించ‌లేక‌పోయింది.

బాక్ రిలీజ్‌కు సిద్ధం...

త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టించిన త‌మిళ మూవీ అరాణ్మ‌ణై 4 రిలీజ్‌కు సి్ధంగా ఉంది. ఏప్రిల్ 26న విడుద‌ల కావాల్సిన ఈ మూవీ అనివార్య కార‌ణాల వ‌ల్ల వాయిదాప‌డింది. తెలుగులోనూ బాక్ పేరుతో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ఇందులో త‌మ‌న్నాతో రాశీఖ‌న్నా మ‌రో హీరోయిన్‌గా న‌టిస్తోంది.

తెలుగులో ఓదెల 2లో త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తొంది. ఇటీవ‌లే ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లైంది. హిందీలో రెండు సినిమాలు చేస్తోంది.

IPL_Entry_Point

టాపిక్