Ranbir kapoor: అలియా నేను పెళ్లి చేసుకున్నట్లుగా అనిపించడం లేదు... రణ్‌భీర్‌కపూర్ ఫన్నీ కామెంట్స్....
బిజీ షెడ్యూల్స్ కారణంగా అలియాతో తన పెళ్లి జరిగినట్లుగా అనిపించడం లేదని సరదాగా వ్యాఖ్యానించారు బాలీవుడ్ హీరోరణ్‌భీర్‌కపూర్. తీరిక లేని షూటింగ్స్ కారణంగా వైవాహిక జీవితాన్ని ఆస్వాదించే అవకాశం తమకు దొరకడం లేదని పేర్కొన్నాడు.
బాలీవుడ్ ప్రేమపక్షులు రణ్‌భీర్‌కపూర్, అలియాభట్ ఈ ఏడాది ఏప్రిల్ 14న వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా ఈ జంట పెళ్లి వేడుక జరిగింది. బిజీ షెడ్యూల్ కారణంగా వైవాహిక జీవితాన్ని ఆస్వాదించే అవకాశం చిక్కడం లేదని అంటున్నారు రణ్‌భీర్, అలియా. పెళ్లి తర్వాత రణ్‌భీర్‌కపూర్ యానిమల్ షూటింగ్ కోసం మనాలీ వెళ్లారు. రాఖీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ సినిమా షూటింగ్ తో అలియా బిజీగా మారిపోయింది. వివాహానికి ముందు నాలుగైదేళ్ల నుంచి ఈ జంట కలిసిమెలిసి ఉన్నారు.
కానీ పెళ్లి తర్వాత మాత్రం తీరిక లేకుండా కనిపిస్తున్నారు. సినిమా షూటింగ్స్ కారణంగా అలియాతో తనకు పెళ్లియినట్లుగా అనిపించడం లేదని రణ్‌భీర్‌కపూర్ సరదాగా వ్యాఖ్యానించాడు. ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ ముందస్తు కమిట్ మెంట్స్ వల్ల పెళ్లైన తర్వాత రోజే తాను, అలియా షూటింగ్స్ మొదలుపెట్టాల్సివచ్చిందని చెప్పాడు.
వైవాహిక బంధంలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ఏకాంతంగా తామిద్దరం సమయం గడిపే అవకాశం దొరకడం లేదని చెప్పాడు. అలియా లండన్ నుంచి తిరిగిరాగానే..తన శంషేర్ సినిమా విడుదల అయిన వెంటనే షూటింగ్స్ కు ఇద్దరం బ్రేక్ తీసుకోవాలని అనుకుంటున్నామని రణ్‌భీర్‌కపూర్ అన్నాడు. వారం రోజుల విదేశాలకు ఈ జంట టూర్ ప్లాన్ చేసినట్లు సమాచారం.
ప్రస్తుతం అలియా హాలీవుడ్ చిత్రం హార్ట్ ఆఫ్ స్టోన్ షూటింగ్ కోసం లండన్ వెళ్లింది. ఈ సినిమాతోనే ఆమె హాలీవుడ్ లో అరంగేట్రం చేయబోతున్నది. మరోవైపు రణ్‌భీర్‌కపూర్ యానిమల్ సినిమా చేస్తున్నారు. సందీప్ వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది.
సంబంధిత కథనం
టాపిక్