Jailer Tv Premiere: జైల‌ర్ టీవీ ప్రీమియ‌ర్ డేట్ క‌న్ఫామ్ - ఏ ఛానెల్‌లో టెలికాస్ట్ అంటే?-rajinikanth jailer tv premiere date locked mohanlal shivarajkumar nelson ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Jailer Tv Premiere: జైల‌ర్ టీవీ ప్రీమియ‌ర్ డేట్ క‌న్ఫామ్ - ఏ ఛానెల్‌లో టెలికాస్ట్ అంటే?

Jailer Tv Premiere: జైల‌ర్ టీవీ ప్రీమియ‌ర్ డేట్ క‌న్ఫామ్ - ఏ ఛానెల్‌లో టెలికాస్ట్ అంటే?

Nelki Naresh Kumar HT Telugu
Oct 29, 2023 03:17 PM IST

Jailer Tv Premiere: ర‌జ‌నీకాంత్ జైల‌ర్ మూవీ టీవీ ప్రీమియ‌ర్ డేట్ ఖ‌రారైంది. దీపావ‌ళి కానుక‌గా జెమిని టీవీలో ఈ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ మూవీ టెలికాస్ట్ కానుంది.

ర‌జ‌నీకాంత్ జైల‌ర్ మూవీ
ర‌జ‌నీకాంత్ జైల‌ర్ మూవీ

Jailer Tv Premiere: ర‌జ‌నీకాంత్ లేటెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ జైల‌ర్ టీవీలోకి రాబోతోంది. ఈ సినిమా టీవీ ప్రీమియ‌ర్ డేట్‌ను క‌న్ఫామ్ అయ్యింది. దీపావ‌ళి కానుక‌గా జెమిని టీవీలో ఈ మూవీ టెలికాస్ట్ కానుంది. జైల‌ర్ వ‌ర‌ల్డ్ ప్రీమియ‌ర్ డేట్‌ను జెమిని టీవీ అఫీషియ‌ల్‌గా ట్విట్ట‌ర్ ద్వారా అనౌన్స్‌చేసింది.

జైల‌ర్ మూవీకి నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. రెండు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా నాలుగు వంద‌ల కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ర‌జ‌నీకాంత్ కెరీర్‌లో హ‌య్యెస్ట్ గ్రాసింగ్ మూవీస్‌లో ఒక‌టిగా నిలిచింది. ఈ సినిమాలో ర‌జ‌నీకాంత్ యాక్టింగ్‌, ఎలివేష‌న్స్ అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాయి. జైల‌ర్ సినిమాలో ర‌మ్య‌కృష్ణ‌, వ‌సంత్ ర‌వి కీల‌క పాత్ర‌లు పోషించారు. మ‌ల‌యాళ అగ్ర న‌టుడు మోహ‌న్ లాల్‌, క‌న్నడ సీనియ‌ర్ హీరో శివ‌రాజ్‌కుమార్ అతిథి పాత్ర‌ల్లో క‌నిపించారు.

త‌న కొడుకు మ‌ర‌ణానికి కార‌ణ‌మైన ఓ డాన్‌పై ప్ర‌తీకారం తీర్చుకునే రిటైర్డ్ పోలీస్ ఆఫీస‌ర్ క‌థ‌తో ఈ సినిమా తెర‌కెక్కింది. జైల‌ర్ సినిమాతో లాంగ్ గ్యాప్ త‌ర్వాత క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ అందుకొన్నాడు ర‌జ‌నీకాంత్‌. కోలీవుడ్‌లోక‌లెక్ష‌న్స్ ప‌రంగా రికార్డులు కొల్ల‌గొట్టిన ఈ మూవీ టాలీవుడ్‌లోనూ బ్రేక్ ఈవెన్ సాధించింది. తెలుగులో చిరంజీవి భోళాశంక‌ర్‌కు పోటీగా రిలీజైన ఈ మూవీ నిర్మాత‌ల‌కు లాభాల‌ను మిగిల్చింది.

జైల‌ర్ త‌ర్వాత జై భీమ్ ద‌ర్శ‌కుడు టీజే జ్ఞాన‌వేళ్‌తో ర‌జ‌నీకాంత్ నెక్స్ట్ సినిమా చేయ‌బోతున్నాడు. అమితాబ్‌బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర‌లో నటిస్తోన్న ఈ మూవీలో రానా విల‌న్ రోల్ చేయ‌బోతున్నాడు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతోంది.

IPL_Entry_Point