OTT Web Series: ఆదా శర్మ కొత్త వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ షురూ.. ఎక్కడ చూడొచ్చంటే..
OTT Web Series: రీటా సన్యాల్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ మొదలైంది. ఈ సిరీస్‍లో అదా శర్మ ప్రధాన పాత్ర పోషించారు. లాయర్ పాత్ర పోషించారు. ఈ సిరీస్ ఏ ప్లాట్‍ఫామ్‍లోకి వచ్చేందంటే..
ది కేరళ స్టోరీ తర్వాత హీరోయిన్ ఆదా శర్మ.. ఉమెన్ ఓరియెంటెడ్ చిత్రాలే చేస్తున్నారు. ఈ ఏడాది ఆమె నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ అనుకున్న స్థాయిలో హిట్ కాలేదు. కేరళ స్టోరీ కాంబినేషన్ రిపీట్ అయినా.. బస్తర్ పెద్దగా ఆడలేదు. కాగా, ఆదా శర్మ ప్రధాన పాత్రలో రీటా సన్యాల్ వెబ్ సిరీస్ రూపొందింది. అభిరూప్ ఘోష్ ఈ సిరీస్‍కు దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ నేడు (అక్టోబర్ 14) స్ట్రీమింగ్‍కు వచ్చేసింది.
రోజుకో ఎపిసోడ్
రీటా సన్యాల్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో నేడు (అక్టోబర్ 14) మొదలైంది. తొలి ఎపిసోడ్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. సోమవారం నుంచి శుక్రవారం వరకు కొత్త ఎపిసోడ్లు వస్తాయని హాట్‍స్టార్ వెల్లడించింది.
రీటా సన్యాల్ సిరీస్ హిందీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఇంగ్లిష్ సబ్‍టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ సిరీస్‍లో లాయర్‌గా ఆదా శర్మ నటించారు. ఇన్వెస్టిగేటివ్ సిరీస్ అయినా కామెడీ కూడా ప్రధానంగా ఉంటుంది.
రీటా సన్యాల్ సిరీస్‍లో అదా శర్మతో పాటు రాహుల్ దేవ్, అంకుర్ రాఠీ, ఫైజల్ సయ్యద్, మాణిక్ పప్నేజా కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ఇన్వెస్టిగేటివ్ డ్రమెడీ సిరీస్‍గా డైరెక్టర్ అభిరూప్ తెరకెక్కించారు. తండ్రిని హత్య చేసిందవరనేది నిరూపించేందుకు ఓ యంగ్ లాయర్ ప్రయత్నించడం చుట్టూ ఈ సిరీస్ సాగుతుంది. ఈ సిరీస్‍లో రకరకాల గెటప్‍లు వేశారు అదా శర్మ.
రీటా సన్యాల్ సిరీస్‍ను కీలైట్ ప్రొడక్షన్స్ పతాకంపై రాజేశ్వర్ నాయర్, కృష్ణన్ అయ్యర్ నిర్మించారు. అమిత్ ఖాన్ క్రియేట్ చేసిన పాత్ర ఆధారంగా రీతా సన్యాల్‍ను రూపొందించారు. కథను వేరుగా రాసుకున్నారు అభిరూప్.
డిఫరెంట్‍గా ఉంటుంది: అదా
రీటా సన్యాల్ సిరీస్ గురించి అదా శర్మ ఇటీవలే మాట్లాడారు. ఈ సిరీస్ తనకు చాలా ఉత్సాహం కలిగించిందని అన్నారు. ఇది పల్ప్ ఫిక్షన్ లాంటి సిరీస్ అని చెప్పారు. క్రైమ్, లాయర్ ఉన్న సిరీస్‍లు ఎక్కువగా సీరియస్‍గా ఉంటాయని, కానీ ఈ సిరీస్ డిఫరెంట్‍గా ఉంటుందని తెలిపారు.
రీటా సన్యాల్ చిత్రం వాస్తవికతకు దూరంగా ఉంటుందని అదా శర్మ తెలిపారు. “ఇండియాలో అంత ఎక్కువగా పల్ప్ ఫిక్షన్ కంటెంట్ రాలేదు. ఇక్కడ లాయర్, క్రైమ్ షోలు అంటే సీరియస్‍గా ఉంటాయి. అయితే, ఈ సిరీస్ వాస్తవికతకు దూరంగా ఉంటుంది. ఇది ఫిక్షన్, ఫ్యాంటసీ, అడ్వెంచర్‌గా ఉంటుంది. రీతా లాయరే, క్రైమ్‍పైనే పోరాడుతుంది. తన క్లైంట్‍ను ఆమెనే దోషిగా ఎందుకు నిలబెట్టాలనుకుంటుందో తెలుసుకునేందుకు చాలా ఆసక్తికరంగా ఉంటుంది” అని అదా శర్మ వెల్లడించారు.
‘1000 బేబీస్’ ఈవారంలోనే..
1000 బేబీస్ వెబ్ సిరీస్ ఈవారంలోనే డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. అక్టోబర్ 18వ తేదీన ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. నీజమ్ కోయ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మరాఠి, బెంగాలీ భాషల్లో స్ట్రీమింగ్ అవనుంది. 1000 బేబీస్ సిరీస్‍లో నీనా గుప్తా, రహమాన్ ప్రధాన పాత్రలు పోషించారు.