థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘1000 బేబీస్’ కొత్త రిలీజ్ డేట్ వెల్లడైంది. ఈ సిరీస్‍లో బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా, రహమాన్ ప్రధాన పాత్రలు పోషించారు. మలయాళంలో రూపొందిన ఈ సిరీస్ ఏడు భాషల్లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ సిరీస్‍కు నీజమ్ కోయ దర్శకత్వం వహించారు. 1000 బేబీస్ సిరీస్ ట్రైలర్ నేడు (అక్టోబర్ 7) వచ్చేసింది. దీంతో పాటు కొత్త స్ట్రీమింగ్ డేట్‍ను డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ వెల్లడించింది.
1000 బేబీస్ ట్రైలర్ ఇంట్రెస్టింగ్‍గా ఉంది. స్టోరీ పెద్దగా రివీల్ కాకపోయినా మిస్టరీతో థ్రిల్లింగ్‍గా ఉంటుందని అర్థమవుతోంది. ముందుగా ఓ ల్యాబోరేటరీ షాట్‍తో ఈ ట్రైలర్ మొదలైంది. ఆ తర్వాత నీనా గుప్తా, రహమాన్ కనిపించారు. ఈ చిత్రంలో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా రహమాన్ నటించారు. వృద్ధ మహిళ సారాగా మిస్టీరియస్‍గా ఈ ట్రైలర్లో నీనా ఉన్నారు. ఈ ట్రైలర్లో ఓ టైప్ రైటర్‌లో సారా టైపింగ్ చేస్తూ ఉంటారు. గతాన్ని గుర్తు చేసుకుంటుంటారు.
ఓ భవనంలో గతంలో ఏదో క్రైమ్ జరిగినట్టు అర్థమవుతుంది. రహమాన్ ఈ కేసును దర్యాప్తు చేస్తుంటారు. ఆ తర్వాత మెర్లిన్ గురించి, ఆమె పంపిన ఉత్తరాల గురించి రహమాన్ మాట్లాడతారు. ఆ తర్వాత హత్యలు జరిగిన సీన్స్ ఉన్నాయి. మనుషులపై ల్యాబ్‍లో ఏదో ప్రయోగాలు జరుగుతాయి. ఈ కేసును తీవ్రంగా దర్యాప్తు చేస్తుంటారు రహమాన్ . మొత్తంగా 1000 బేబీస్ వెబ్ సిరీస్‍పై ఈ ట్రైలర్ క్యూరియాసిటీ పెంచింది. ఉత్కంఠతో ట్విస్టులతో ఈ సిరీస్ ఉండనున్నట్టు అర్థమవుతోంది.
1000 బేబీస్ వెబ్ సిరీస్ అక్టోబర్ 18వ తేదీన డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. సెప్టెంబర్ 20నే స్ట్రీమింగ్‍కు తెచ్చేందుకు హాట్‍స్టార్ గతంలో నిర్ణయించింది. అయితే, ఆలస్యమైంది. ఇప్పుడు అక్టోబర్ 18వ తేదీన ఈ సిరీస్ స్ట్రీమింగ్‍కు రావడం ఖరారైంది.
1000 బేబీస్ వెబ్ సిరీస్ మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మరాఠి, బెంగాలీ భాషల్లోనూ అక్టోబర్ 18న హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వస్తుంది. మొత్తంగా ఏడు భాషల్లో స్ట్రీమ్ అవనుంది.
1000 బేబీస్ సిరీస్‍కు డైరెక్టర్ నీజమ్ కోయతో పాటు అరౌజ్ ఇర్ఫాన్ కథ రాశారు. సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్‌గా ఈ సిరీస్‍ను నీజమ్ రూపొందించినట్టు అర్థమవుతోంది. ఈ సిరీస్‍లో రహమాన్, నీనా గుప్తాతో పాటు సంజూ శివరామ్, అశ్విన్ కుమార్, ఆదిల్ ఇబ్రహీం, షాజు శ్రీధర్, జాయ్ మాథ్యూ, వీకేపీ, మను ఎం లాల్, షాలు రహీం, సిరాజుద్దీన్ నాజర్ కీలకపాత్రలు పోషించారు.
1000 బేబీస్ వెబ్ సిరీస్‍ను షాజి నదేషన్, ఆర్య నిర్మించారు. ఈ సిరీస్ మంచి ప్రొడక్షన్ వాల్యూస్‍తోనే రూపొందించినట్టు ట్రైలర్‌తో తెలుస్తోంది. ఈ సిరీస్‍కు శంకర్ శర్మ మ్యూజిక్ ఇచ్చారు. ట్రైలర్లో సస్పెన్స్‌ఫుల్ బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది. క్యూరియాసిటీని పెంచేలా ఉంది. ఈ చిత్రానికి ఫైద్ సిద్దిక్ సినిమాటోగ్రఫీ చేయగా.. జాన్‍కుట్టీ ఎడిటింగ్ చేశారు. అక్టోబర్ 18 నుంచి హాట్‍స్టార్ ఓటీటీలోకి రానున్న 1000 బేబీస్ సిరీస్‍ను చూసేయవచ్చు.