Anushka Shetty: పెళ్లిపై ఎట్టకేలకు పెదవి విప్పిన అనుష్క శెట్టి.. నేరం కాదు కదా? మరి దాయాల్సిన అవసరమేంటని విసుర్లు-actress anushka shetty responded to rumours of her secret marriages ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Anushka Shetty: పెళ్లిపై ఎట్టకేలకు పెదవి విప్పిన అనుష్క శెట్టి.. నేరం కాదు కదా? మరి దాయాల్సిన అవసరమేంటని విసుర్లు

Anushka Shetty: పెళ్లిపై ఎట్టకేలకు పెదవి విప్పిన అనుష్క శెట్టి.. నేరం కాదు కదా? మరి దాయాల్సిన అవసరమేంటని విసుర్లు

Galeti Rajendra HT Telugu
Nov 10, 2024 09:15 PM IST

Anushka Shetty Marriage: అనుష్క శెట్టి పెళ్లి గురించి మళ్లీ రూమర్స్ తెరపైకి వచ్చాయి. సైజ్ జీరో తర్వాత చాలా రోజులు సినిమాలకి దూరంగా ఉండిపోయిన అనుష్క.. ఘాటి సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతోంది.

అనుష్క శెట్టి
అనుష్క శెట్టి

హీరోయిన్ అనుష్క శెట్టి రెండు రోజుల క్రితం 43వ పడిలో అడుగుపెట్టింది. దాదాపు దశాబ్దకాలం టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా కొనసాగిన అనుష్క శెట్టి.. త్వరలోనే లేడీ ఓరియెంటెడ్ మూవీ ఘాటీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గ్లింప్స్ రెండు రోజుల క్రితం విడుదలవగా.. అందులో అనుష్క శెట్టి చాలా క్రూరంగా, పవర్‌ఫుల్‌గా కనిపించింది. మలయాళంలోనూ ఓ సినిమాలో అనుష్క ప్రస్తుతం నటిస్తోంది.

సైజ్ జీరోతో గాడి తప్పిన కెరీర్

సైజ్ జీరో సినిమా కోసం బరువు పెరిగిన అనుష్క శెట్టి.. ఆ తర్వాత వేగంగా బరువు తగ్గలేకపోయింది. ఈ క్రమంలో ఇండస్ట్రీకి కూడా దాదాపు మూడేళ్ల పాటు ఈ అమ్మడు దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు బరువు తగ్గించుకున్న అనుష్క మళ్లీ వరుసగా సినిమాలు చేస్తుండటంతో.. ఆమె పెళ్లి టాపిక్‌ను కొంత మంది మళ్లీ తెరపైకి తెచ్చారు. గతంలో ప్రభాస్‌తో డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే.

నేరం కాదు కదా?

అనుష్క కొన్నాళ్ల పాటు సినిమాలు, మీడియాకి దూరంగా ఉండిపోవడంతో.. ఆమె పెళ్లి చేసుకుందని రూమర్స్ వినిపించాయి. ఆ ఆరోపణలపై అనుష్క తాజాగా స్పందించింది.

‘‘అందరూ నేను పెళ్లి చేసుకున్నాను అంటున్నారు. మరి ఎవరిని పెళ్లి చేసుకున్నాను అనే విషయం మాత్రం ఎందుకు చెప్పడం లేదు?. అయినా పెళ్లి అనేది నేరం కాదు కదా? మరి దాయాల్సిన అవసరమేంటి? కనీసం ఇకనైనా ఇలాంటి ఫేక్ న్యూస్‌ను స్ప్రెడ్ చేయడం ఆపండి’’ అని అనుష్క శెట్టి చురకలు అంటించింది.

తెలుగులో దాదాపు సీనియర్ హీరోలందరితో సినిమాలు చేసిన అనుష్క శెట్టి.. తమిళంలోనూ టాప్ హీరోలతో కలిసి పనిచేసింది. ఆమె నటించి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు అరుంధతి, భాగమతి ట్రెండ్‌ను క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.,

మూడు రూమర్స్

ప్రభాస్‌తో అనుష్క డేటింగ్‌ చేస్తున్నట్లు కొన్ని రోజులు వార్తలు వచ్చాయి. అయితే.. తాము బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమేనని ఇద్దరూ క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత టాలీవుడ్ డైరెక్టర్‌‌‌ను పెళ్లి చేసుకోబోతోందని రూమర్స్ వినిపించాయి. ఇటీవల దుబాయ్‌కి చెందిన ఒక బిజినెస్‌ మ్యాన్‌తో ఆమె వివాహం చేయడానికి కుటుంబ సభ్యులు నిశ్చయించినట్లు కూడా ప్రచారం జరిగింది. కానీ.. తాజాగా అనుష్క శెట్టి మాటల్ని చూస్తే.. ఇవన్నీ ఫేక్‌ అని తేలిపోయింది.

Whats_app_banner