100 Crore Movies : 2023లో 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన సౌత్ సినిమాలివే-2023 south movies with 100 crore gross waltair veerayya veera simha reddy varisu vaathi ponniyin selvan 2 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  100 Crore Movies : 2023లో 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన సౌత్ సినిమాలివే

100 Crore Movies : 2023లో 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన సౌత్ సినిమాలివే

Anand Sai HT Telugu
May 03, 2023 09:53 AM IST

100 Crore South Movies : ఈ ఏడాది సౌత్ సినిమాల హవా మెుదటి నుంచే మెుదలైంది. విడుదలైన కొన్ని సినిమాలు మంచి హిట్ సాధించాయి. అంతేకాదు.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లలోనూ దూసుకెళ్లాయి.

బాక్సాఫీసు కలెక్షన్స్
బాక్సాఫీసు కలెక్షన్స్

సౌత్ సినిమాలు(South Movies) ఈ ఏడాది కూడా దూసుకెళ్తున్నాయి. 2022లోనూ సౌత్ సినిమాలు హవా కొనసాగించాయి. చిన్న సినిమాలుగా విడుదలై.. పాన్ ఇండియా(Pan India) స్థాయిలో హిట్టు కొట్టాయి. కలెక్షన్లలోనూ దూసుకెళ్లాయి. అదే సంప్రదాయాన్ని ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నాయి. ఇప్పటి వరకూ విడుదలైన సినిమాలు మంచి కలెక్షన్లు సాధించాయి. అయితే 100 కోట్ల కలెక్షన్స్ దాటిన సౌత్ సినిమాలు కొన్ని ఉన్నాయి.

2023లో దాదాపు సగంలోకి వచ్చేశాం. కొన్ని గొప్ప సినిమాలు, కొన్ని సినిమాలు బోల్తా కొట్టడం చూశాం. వినోదం అంతా పొంగల్ సినిమాలతో ప్రారంభమైంది. వాల్తేరు వీరయ్య, వరిసు వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో పొంగల్ విజేతలుగా నిలిచాయి. ఏప్రిల్ నెలలో ఉగాది, వేసవికి విడుదలైన కొన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టాయి. అయితే 100 కోట్లకుపై గ్రాస్ వసూలు చేసిన 2023 సౌత్ సినిమాలు జాబితా ఇక్క డ ఉంది.

వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) సినిమా ప్రపంచ వ్యాప్తంగా.. రూ 223 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. చిరంజీవి, రవితేజ, శ్రుతిహాసన్ నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం 2023 పొంగల్‌కు విడుదలైంది. కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. 200 కోట్ల ప్లస్ వసూలు చేసింది.

నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహా రెడ్డి(Veerasimha Reddy) చిత్రం వాల్తేరు వీరయ్యతో పాటు 2023 సంక్రాంతికి విడుదలైంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన వీరసింహారెడ్డి చిత్రం 150+ కోట్ల గ్రాస్ కలెక్షన్‌లతో బాక్స్ ఆఫీస్ వద్ద మాస్ హిట్ అయ్యింది.

వరిసు(Varisu) సినిమాను టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు(Dil Raju), దర్శకుడు వంశీ పైడిపల్లితో దళపతి విజయ్ చేశాడు. పొంగల్ 2023 విడుదలైన ఈ చిత్రం హిట్‌గా నిలిచింది. అజిత్ తునివుతో పోటీ పడింది. రూ 292 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

అజిత్ నటించిన తునివు(Ajit Thunivu) చిత్రం దళపతి విజయ్ సినిమాతో పోటీ పడింది. హెచ్.వినోత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. అయితే బాక్సాఫీస్ వద్ద 196 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియిన్ సెల్వన్ 2(Ponniyin Selvan 2) సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఈ సినిమా నాలుగు రోజుల్లో 200 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇంకా నడుస్తూనే ఉంది.

ధనుష్(dhanush), సంయుక్తా మీనన్ జంటగా నటించిన వాతి(తెలుగులో సర్) చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. బాక్సాఫీస్ వద్ద 111+ కోట్లు వసూలు చేసింది.

నాని కెరీర్‌లో తొలి 100 కోట్ల గ్రాసర్‌గా దసరా(Dasara) సినిమా నిలిచింది. దసరా చిత్రానికి శ్రీకాంత్ ఒదెల దర్శకత్వం వహించాడు. బాక్సాఫీస్ వద్ద మాస్ హిట్ అయ్యింది. రూ 118 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.

సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన విరూపాక్ష(virupaksha) చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవలి కాలంలో వచ్చిన అత్యుత్తమ మిస్టరీ థ్రిల్లర్‌లలో ఒకటిగా నిలిచింది. రూ.70 కోట్లు కలెక్ట్ చేసింది. 100 కోట్ల గ్రాస్ వైపు పరుగులు పెడుతోంది.

IPL_Entry_Point