Telugu News  /  Entertainment  /  Vijay Varisu And Ajith Thunivu Streaming On Ott Same Day Details Here
అజిత్
అజిత్

Varisu OTT Release Date: ఓటీటీలో అజిత్‌తో పోటీప‌డుతోన్న విజ‌య్ - తునివు వారిసు ఒకే రోజు రిలీజ్?

20 January 2023, 13:10 ISTNelki Naresh Kumar
20 January 2023, 13:10 IST

Varisu OTT Release Date: కోలీవుడ్‌లో సంక్రాంతికి థియేట‌ర్ల‌లో పోటీప‌డ్డ విజ‌య్ వారిసు అజిత్ తునివు సినిమాలో ఓటీటీలో ఒకే రోజు రిలీజ్ కాబోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఏ రోజు ఏ ప్లాట్‌ఫామ్‌ల‌లో ఈ సినిమాలు రిలీజ్ కానున్నాయంటే...

Varisu OTT Release Date: సంక్రాంతికి బాక్సాఫీస్ వ‌ద్ద అజిత్ తునివు, విజ‌య్ వారిసు సినిమాలు పోటీప‌డ్డాయి. జ‌న‌వ‌రి 11న థియేట‌ర్ల ద్వారా ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ రెండు సినిమాలు అభిమానుల‌ను మెప్పించాయి. వారిసు సినిమా ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొంద‌గా అజిత్ తునివు సినిమా బ్యాంకు స్కామ్‌ల‌తో యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కింది.

ట్రెండింగ్ వార్తలు

తాజాగా ఈ రెండు సినిమాలు ఓటీటీలో ఒకేరోజు రిలీజ్ కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఫిబ్ర‌వ‌రి 10 నుంచి విజ‌య్ వారిసు సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు స‌మాచారం. అదే రోజు అజిత్ తునివు సినిమా నెట్‌ఫ్లిక్స్ ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్లు చెబుతున్నారు. ఈ రెండు సినిమాలు ఓటీటీలో పోటీప‌డ‌నున్న‌ట్లు స‌మాచారం.

విజ‌య్ వారిసు సినిమాకు వంశీపైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మ‌న‌స్ప‌ర్థ‌ల‌తో విడిపోయిన త‌న కుటుంబాన్ని ఒక్క‌టి చేసిన ఓ కొడుకు క‌థ‌తో ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వారిసు సినిమాను వంశీపైడిపెల్లి తెర‌కెక్కించారు. వారిసు సినిమాలో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టించింది. దిల్‌రాజు ఈ సినిమాను నిర్మించారు.

వారిసు సినిమా వార‌సుడు పేరుతో తెలుగులో డ‌బ్ అయ్యింది. త‌మిళ వెర్ష‌న్ జ‌న‌వ‌రి 11న రిలీజ్ కాగా తెలుగు వెర్ష‌న్ మాత్రం జ‌న‌వ‌రి 14న ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది మ‌రోవైపు అజిత్ తునివు సినిమాకు హెచ్ వినోద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మ్యూచ్‌వ‌ల్ ఫండ్స్, క్రెడిట్ కార్డులు, ఛార్జీల పేరుతో సామాన్య ప్ర‌జ‌ల‌ను బ్యాంకులు ఎలా మోసం చేస్తున్నాయ‌నే సందేశానికి యాక్ష‌న్ అంశాల‌ను జోడించి ఈ సినిమా తెర‌కెక్కింది. తునివు సినిమా కూడా తెగింపు పేరుతో తెలుగులోకి అనువాద‌మైంది.