Stones Pelted on Chandrababu Pawan : చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై రాళ్లు విసిరిన దుండగులు-amaravati stones pelted on tdp chief chandrababu in gajuwaka jsp supremo pawan kalyan in tenali ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Stones Pelted On Chandrababu Pawan : చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై రాళ్లు విసిరిన దుండగులు

Stones Pelted on Chandrababu Pawan : చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై రాళ్లు విసిరిన దుండగులు

Bandaru Satyaprasad HT Telugu
Apr 14, 2024 09:01 PM IST

Stones Pelted on Chandrababu Pawan : టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై రాళ్ల దాడులు జరిగాయి. గుర్తుతెలియని వ్యక్తులు తెనాలి వారాహి సభలో పవన్ పై, గాజువాక ప్రజాగళం సభలో చంద్రబాబుపై రాళ్లు విసిరారు. అయితే ఈ దాడిలో వారికి గాయాలు కాలేదు.

చంద్రబాబు, పవన్ కల్యాణ్
చంద్రబాబు, పవన్ కల్యాణ్

Stones Pelted on Chandrababu Pawan : ఏపీ సీఎం జగన్(CM Jagan) పై శనివారం ఆగంతకులు రాయితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ అలాంటి ఘటనలే చోటుచేసుకున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan), టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)పై రాళ్ల దాడి జరిగింది. అయితే ఘటనలో రాళ్లు చంద్రబాబు, పవన్ కు దూరంగా పడడంతో వాళ్లకు గాయాలు కాలేదు.

టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ జిల్లా గాజువాక ప్రజాగళం సభ(TDP Prajagalam Meeting)లో పాల్గొన్నారు. ఈ సభలో చంద్రబాబు మాట్లాడుతున్న సమయంలో ఆగంతకులు చంద్రబాబు(Chandrababu)పై రాళ్లు విసిరారు. ఈ రాళ్లు చంద్రబాబు(Stone Pelting on Chandrababu) సమీపంలో పడ్డాయి. గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు విసిరి పరారయ్యారు. తనపై రాళ్లు విసరడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాళ్లు వేసిన వారిని చంద్రబాబు హెచ్చరించారు. ఇలాంటి దాడులకు భయపడేది లేదన్నారు. చంద్రబాబుపై రాళ్లు విసరడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. రాళ్లు వేసిన దుండగులను పట్టుకునేందుకు టీడీపీ(TDP) కార్యకర్తలు ప్రయత్నించగా, నిందితులు పరారయ్యారు.

అనంతరం సభలో చంద్రబాబు(Chandrababu) మాట్లాడుతూ..."ప్రభుత్వం నీది.. ముఖ్యమంత్రి నువ్వు.. నీ ప్రభుత్వంలో కరెంటు పోతే, నిన్ను ఎవరో చీకట్లో కొడితే నన్ను అంటావా? ఇలాగే కోడికత్తి డ్రామా ఆడావు, బాబాయ్ గొడ్డలి వేటు డ్రామా ఆడావు. నా మీద తోశావ్.నాకు నేరాలు అంటగడతావా ? నేను నీలాగా నేరస్తులని ప్రోత్సహించను. నేరాలు చేసే వాళ్లని తొక్కుతా." అని నిన్న జరిగిన ఘటనపై విమర్శలు చేశారు.

దాడులు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు?

నిన్న చీకట్లో సీఎం జగన్ (Attack on Jagan)పై గులకరాయి వేశారని, ఇప్పుడు కరెంటు ఉండగానే నాపై రాయి విసిరారని చంద్రబాబు(Chandrababu) ఆరోపించారు. గంజాయి బ్యాచ్‌, బ్లేడ్‌ బ్యాచ్‌ ఈ పనులు చేస్తుందని మండిపడ్డారు. తెనాలి వారాహి సభలో పవన్‌ కల్యాణ్‌(Stone Pelting on Pawan Kalyan)పై కూడా రాళ్లు విసిరారన్నారు. క్లైమోర్‌ మైన్స్‌కే తాను భయపడలేదని చంద్రబాబు అన్నారు. గత ఎన్నికల సమయంలో కూడా తనపై రాళ్ల దాడి(Attack on Chandrababu) జరిగిందని చంద్రబాబు గుర్తుచేశారు. నిన్న జగన్‌ సభలో కరెంటు పోయిందని, దానికి ఎవరు బాధ్యత వహించాలన్నారు. రాళ్ల దాడులు జరుగుతుంటే చూస్తూ ఉండటానికే పోలీసులు ఉన్నారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. గత ఎన్నికల్లో జగన్ కోడికత్తి డ్రామా(Kodi kathi Drama) ఆడారన్నారు. నిన్న జగన్ పై జరిగిన రాయి దాడి ఘటనను అందరం ఖండించామన్నారు. కానీ పేటీఎం బ్యాచ్‌ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, రాళ్లు తాను వేయించినట్లు ప్రచారం చేస్తు్న్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పవన్ పై రాయి విసిరిన దుండగుడు

వారాహి యాత్ర(Varahi Yatra)లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan)మీద దుండగుడు రాయి విసిరాడు. తెనాలి(Tenali)లో వారాహి యాత్రలో పాల్గొన్న పవన్ పైకి ఓ వ్యక్తి రాయి విసిరాడు. అయితే ఆ రాయి పవన్ కల్యాణ్ కు దూరంగా పడింది. రాయి విసిరిన వ్యక్తిని జనసైనికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

Whats_app_banner

సంబంధిత కథనం