AP Elections 2024 : 50 ఏళ్లకే బీసీలకు నెలకు రూ. 4 వేల పెన్షన్ - చంద్రబాబు మరో కీలక హామీ-chandrababu has announced that will be given a pension of rs 4000 per month to bcs at the age of 50 ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ap Elections 2024 : 50 ఏళ్లకే బీసీలకు నెలకు రూ. 4 వేల పెన్షన్ - చంద్రబాబు మరో కీలక హామీ

AP Elections 2024 : 50 ఏళ్లకే బీసీలకు నెలకు రూ. 4 వేల పెన్షన్ - చంద్రబాబు మరో కీలక హామీ

Maheshwaram Mahendra Chary HT Telugu
Apr 11, 2024 10:06 PM IST

Chandrababu Latest News : టీడీపీ అధినేత చంద్రబాబు మరో కీలక ప్రకటన చేశారు. ఏపీలో తాము అధికారంలోకి వచ్చాక… బీసీలకు 50 ఏళ్లకే నెలకు రూ.4,000ల పింఛన్ ఇస్తామని హామీనిచ్చారు.

చంద్రబాబు కీలక ప్రకటన
చంద్రబాబు కీలక ప్రకటన (CBN Twitter)

Chandrababu News :జ్యోతిరావ్ ఫూలే జయంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) కీలక ప్రకటన చేశారు.  ఏపీలో తాము అధికారంలోకి వచ్చాక బీసీలకు 50 ఏళ్లకే నెలకు రూ.4,000ల పింఛన్ ఇస్తామని చెప్పారు. 1 లక్ష 50 వేల కోట్ల రూపాయలతో బీసీ సబ్ ప్లాన్ అమలు చేస్తామన్న ఆయన..... బీసీల స్వయం ఉపాధికి ఐదేళ్ళలో రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తామని తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. 

yearly horoscope entry point

వృత్తిదారులకు ఆదరణ పథకం ద్వారా రూ.5 వేల కోట్ల విలువ చేసే పరికరాలను అందిస్తామన్నారు చంద్రబాబు.  చంద్రన్న బీమా పథకాన్ని పునరుద్ధరిస్తామని తెలిపారు. ఈ స్కీమ్ కింద ఇచ్చే పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచుతామని చెప్పారు. పెళ్లి కానుక రూ.1 లక్షకు పెంచుతామని వివరించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను పునరుద్ధరిస్తామన్న చంద్రబాబు(Chandrababu)... చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కోసం అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామని స్పష్టం చేశారు. బీసీలకు శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలను అందజేస్తామని తెలిపారు.  

బీసీల కోసం ఇంకా ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఫూలే ఆశయాలకు అనుగుణంగా పాలన అందిస్తామన్నారు చంద్రబాబు. ఆధునిక సమాజంలో 'కుల నిర్మూలన' ఉద్యమాలకు బీజం నాటిన తొలితరం సామాజిక సంస్కర్త జ్యోతిరావ్‌ పూలే అని కొనియాడారు.  ఆ మహాశయుని స్ఫూర్తితోనే బడుగు బలహీన వర్గాలకు రాజకీయాల్లోనూ, అధికారంలోనూ ప్రాధాన్యం కల్పించిన్న చరిత్ర తెలుగుదేశం పార్టీదన్నారు. బీసీల పార్టీగా పేరుబడింది తెలుగుదేశమని… వెనుకబడిన వర్గాలకు ఉపప్రణాళిక తెచ్చిన ఘనత టీడీపీకే దక్కుతుందని గుర్తు చేశారు.

చంద్రబాబు, పవన్ ప్రచారం… వైసీపీపై ఫైర్

Pawan and Chandrababu Campagin: మరోవైపు ఇవాళ పి. గన్నవరంలో చంద్రబాబు, పవన్ కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అంబాజీపేటలో వారాహి విజయ భేరీ బహిరంగ సభలో మాట్లాడిన పవన్ కల్యాణ్…. సినిమాల్లోనే కాకుండా, సమాజంలో కూడా మంచి కోరుకునే వ్యక్తి పవన్ కల్యాణ్ అని చెప్పుకొచ్చారు. వైసీపీ  ప్రభుత్వాన్ని పంపించేందుకు 3 పార్టీలు కలిసి వచ్చామన్నారు. పచ్చని కోనసీమ ను వైసీపీ ప్రభుత్వం కలహాల సీమ గా మార్చిందని దుయ్యబట్టారు. 

“రెండున్నర లక్షల హెక్టార్ల కొబ్బరి తోటలతో నిండిన కోనసీమను కొట్లాట సీమ, కలహాల సీమగా మారకుండా ఆరోజు మేము అందరం మా వంతు కృషి చేసాం, భవిష్యత్తులో కూడా ప్రేమ సీమగా ఉండేలా, అన్ని కులాల ప్రజలు, సంఖ్యా బలం లేని 120 పైగా BC కులాల ప్రజలు, మైనార్టీ వర్గాలు అందరూ కలిసి అందేలా పనిచేస్తాం. త్రివేణి సంగమం లాగ జనసేన - టీడీపి - బీజేపి కలిసి ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి కృషి చేస్తుంది. కోనసీమ రైతులు క్రాప్ హాలిడే ప్రకటించకుండా ఉండటానికి మేము కృషి చేస్తాం.  నాడు నేడు పనులు ఇక్కడ మొదలుపెట్టారు, ఇప్పటికీ ముందుకు వెళ్ళలేదు, ఆ సభలో జగన్ఇ చ్చిన హామీలు ఏమయ్యాయి అని ఈరోజు అడుగుతున్నాను.  వరదలు వస్తేఅప్పనపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ కు 40 కోట్లు ఇస్తామని చెప్పాడు, 4 వేల ఎకరాలకు నీరు ఇచ్చే దీనికి ఒక్క పైసా ఇవ్వలేదు, వెదురుపిడెం కాజ్ వే నిర్మాణం చేతా అన్నారు చేయలేదు, వరద వస్తే ఇక్కడ ప్రాంతాలు మునిగిపోతున్నాయి, 25 కోట్లు పరిష్కారం కోసం ఇస్తామని చెప్పారు, ఒక్క పైసా ఇవ్వలేదు, గోదావరి వరదల సమయంలో 2023 జూలై 6న లంక గ్రామాల్లో జగన్ పర్యటించి 30కోట్లు ఖర్చుపెడతా అని చెప్పి ఒక్క రూపాయి ఇవ్వలేదు, గోదావరి వరదలు వస్తే తీర ప్రాంతాలు మునిగిపోకుండా ఉండేందుకు 200 కోట్లతో గట్లు పటిష్ట పరుస్తామని చెప్పి ఈరోజు వరకు ఒక్క రూపాయి ఇవ్వలేదు” అని పవన్ ప్రశ్నించారు.

Whats_app_banner