Pawan Kalyan : కోడి గుడ్డు మంత్రి కిలో మీటర్ రోడ్డు వేయించలేకపోయారు, అనకాపల్లి సభలో పవన్ కల్యాణ్ సెటైర్లు-anakapalle janasena varahi yatra pawan kalyan sensational comments on ysrcp cm jagan ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Pawan Kalyan : కోడి గుడ్డు మంత్రి కిలో మీటర్ రోడ్డు వేయించలేకపోయారు, అనకాపల్లి సభలో పవన్ కల్యాణ్ సెటైర్లు

Pawan Kalyan : కోడి గుడ్డు మంత్రి కిలో మీటర్ రోడ్డు వేయించలేకపోయారు, అనకాపల్లి సభలో పవన్ కల్యాణ్ సెటైర్లు

Bandaru Satyaprasad HT Telugu
Apr 07, 2024 07:53 PM IST

Pawan Kalyan : వైసీపీ అధికారం కట్టబెడితే భూములు అమ్మేసుకున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే పొత్తు పెట్టుకున్నామని చెప్పారు.

పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్

Pawan Kalyan : ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా దశాబ్ద కాలంగా పార్టీ నడిపిస్తున్నానంటే...రాష్ట్ర భవిష్యత్తు కోసమేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) అన్నారు. అనకాపల్లి వారాహి విజయ భేరి (anakapalle Varahi Meeting)సభలో పాల్గొన్న ఆయన.. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అనకాపల్లి బెల్లం గురించి విన్నామని, కానీ వైసీపీ ప్రభుత్వంలో అనకాపల్లి కోడి గుడ్డు వింటున్నామన్నారు. ఇక్కడి ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ మంత్రి పదవి కట్టిబెట్టినా... కనీసం ఒక కిలోమీటర్ రోడ్డు వేయలేకపోయారని విమర్శించారు. అనకాపల్లి సభలో మహిళలు ఇంత పెద్ద ఎత్తున పాల్గొన్నారంటే వైసీపీ ప్రభుత్వంపై ఎంత ఆగ్రహం ఉందో తెలుస్తుందన్నారు. అనకాపల్లి నూకాలమ్మ జాతరను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించేలా చేస్తామన్నారు. ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా దశాబ్ద కాలం పార్టీని నడపగలిగానంటే... రాష్ట్ర భవిష్యత్తు కోసమేనన్నారు. తనకు పదవులు కావాలంటే ఎప్పుడో ప్రధాని మోదీని(PM Modi) అడిగి తెచ్చుకునే వాడినన్నారు. అమ్మ ఒడి పథకానికి ఎలా కోతలు విధించారో పవన్ తెలిపారు. ప్రతీ విద్యార్థికి రూ.15 వేలు ఇస్తామని చెప్పి సీఎం జగన్(CM Jagan) మోసం చేశారని ఆరోపించారు. రూ.15 వేలు ఇస్తామని చివరికి రూ.13 వేలకు కుదించారన్నారు. ఒక చేత్తో అమ్మ ఒడి ఇస్తూ మరో చేత్తో లాగేసుకునేవారన్నారు. సీఎం జగన్ ఓ సారా వ్యాపారి అని విమర్శలు చేశారు. కేవలం 21 ఎమ్మెల్యేలు, 2 ఎంపీ స్థానాలకే పరిమితం అయ్యామంటే అది కేవలం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతోనే అన్నారు.

కోడి గుడ్డు మంత్రి, కోడి గుడ్డు ప్రభుత్వం కావాలా?

కూటమి ప్రభుత్వం రాగానే అనకాపల్లి బెల్లం పరిశోధనలను ముందుకు తీసుకెళ్తామని పవన్ కల్యాణ్ (Pawan Kalyan)హామీ ఇచ్చారు. కోడి గుడ్డు మంత్రి, కోడి గుడ్డు ప్రభుత్వం కావాలో... కూటమి ప్రభుత్వం కావాలో ఒకసారి ఆలోచించాలన్నారు. వైసీపీకి(Ysrcp) అధికారం కట్టబెడితే భూములు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలనే తన పోరాటం అని, అందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. క్షేత్ర స్థాయిలో జనసేనను మరింత బలోపేతం చేయాలని, ఈసారి కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకుందన్నారు. యువతకు స్కిల్ డెవలప్మెంట్(skill Development), ఎస్ఈజెడ్ మౌలిక సదుపాయాలు, రైతులకు సాగునీరు, అనకాపల్లి బెల్లానికి మార్కెటింగ్ వ్యవస్థ మెరుగుపరుస్తామన్నారు. మంత్రి అమర్ నాథ్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగుల నుంచి రూ.5 లక్షలు వసూలు చేశారని ఆరోపించారు. అనకాపల్లి బెల్లం ఒకప్పుడు తిరుమల శ్రీవారి లడ్డు తయారీకి వినియోగించేవారన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక నిలిపివేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరిగి అనకాపల్లి బెల్లాన్ని(anakapalle Jaggery) తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి వాడేలా చేస్తామన్నారు.

నూకాలమ్మా జాతరను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేలా చర్యలు

"తెలంగాణలో సమ్మక్క సారక్క పండుగ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా చేస్తున్నట్లుగా, మన నూకాలమ్మ జాతరను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించి, పట్టు వస్త్రాలు సమర్పించేలా కృషి చేస్తానని మాటిస్తున్నాను. నూకాలమ్మ తల్లి దీవెనలతో, ఇంత ఘనంగా రోడ్లపైకి వచ్చి జనసేన, టీడీపీ, బీజేపి కూటమికి మద్దతు పలికిన ప్రతీ ఒక్కరికీ నా ధన్యవాదాలు. సీనియర్ నాయకులు కొణతాల రామకృష్ణ, నాదెండ్ల మనోహర్, మండలి బుద్ధ ప్రసాద్ లాంటి వ్యక్తులు మన తరపున అసెంబ్లీలో గళం వినిపిస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇక్కడ యువతకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ రావాలి, నాకు సత్యానంద్ అనే గురువు నటన అనే స్కిల్ నేర్పిస్తే మీరు అందరూ ఆదరించే నటుడిగా మారాను, మీ కోసం పనిచేసే నాయకుడిగా మారాను. అందుకే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ చాలా ముఖ్యం" - పవన్ కల్యాణ్

Whats_app_banner

సంబంధిత కథనం