ICC Rankings: 91 ర్యాంక్‌లో కోహ్లి - సిరాజ్ 50 - ఈ స్టార్ క్రికెటర్ల ఐసీసీ ర్యాంకింగ్స్ 50 కంటే ఎక్కువే!
ICC Rankings: ఇటీవలే టీ20 ఫార్మెట్‌కు గుడ్‌బై చెప్పాడు కోహ్లి. అయినా కూడా టీ20 ర్యాంకింగ్స్‌లో కొనసాగుతోన్న కోహ్లి...ఆల్‌రౌండర్స్ విభాగంలో 91 ర్యాంక్‌లో నిలిచాడు. వన్డే ఆల్‌రౌండర్స్ విభాగంలో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ 50వ ప్లేస్‌లో ఉన్నాడు.
ICC Rankings: విరాట్ కోహ్లి ఇటీవలే టీ20 క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. టీ20 వరల్డ్ కప్ లో విజేతగా టీమిండియా ను నిలిపి పొట్టి ఫార్మెట్‌కు ఘనంగా వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం వన్డే, టెస్ట్ జట్టులో మాత్రమే సభ్యుడిగా కొనసాగుతోన్నాడు విరాట్ కోహ్లి. బ్యాటింగ్ పరంగా టీ20లతో పాటు వన్డే, టెస్టుల్లో టీమిండియాకు ఎన్నో విజయాల్ని అందించాడు కోహ్లి.
ప్రజెంట్ ఐసీసీ ర్యాంకింగ్ బ్యాటింగ్ విభాగంలో టెస్టుల్లో పదో స్థానంలో, వన్డేల్లో నాలుగో ర్యాంక్‌లో కోహ్లి కొనసాగుతోన్నాడు. అయితే టీ20 ఫార్మెట్‌లో ఆల్ రౌండర్స్ విభాగంలో మాత్రం కోహ్లి 91వ ర్యాంక్‌లో కొనసాగుతోన్నాడు. అతడి కంటే ముందు పలువురు అనామక క్రికెటర్లు ఉండటం గమనార్హం. కాగా కోహ్లి వన్డేల్లో 13906 రన్స్, టెస్టుల్లో 8848 రన్స్ చేయగా...టీ20 క్రికెట్‌లో 4188 రన్స్ మాత్రమే చేశాడు.
మహ్మద్ సిరాజ్ 50 ర్యాంక్...
టీమిండియా ప్రధాన పేసర్లలో ఒకరిగా కొనసాగుతోన్నాడు మహ్మద్ సిరాజ్. గత కొన్నాళ్లుగా భారత పేస్ దళాన్ని నడిపిస్తోన్న సిరాజ్ మూడు ఫార్మెట్లలో కీలక ప్లేయర్‌గా పేరుతెచ్చుకున్నాడు. ఇటీవల టీ20 వరల్డ్ కప్‌లో విఫలమైన సిరాజ్ విమర్శలను ఎదుర్కొన్నాడు. కాగా ఐసీసీ వన్డే ర్యాకింగ్స్‌లో బౌలింగ్ విభాగంలో సిరాజ్ ఏడో స్థానంలో కొనసాగుతోన్నాడు. వన్డే ఆల్‌రౌండర్స్ ర్యాకింగ్స్‌లో మాత్రం సిరాజ్ 50వ స్థానంలో ఉన్నాడు. సిరాజ్ తన కెరీర్‌లో టెస్టుల్లో 74, వన్డేల్లో 71 వికెట్లు తీసుకున్నాడు. టీ20 క్రికెట్‌లో మాత్రం 14 వికెట్లు మాత్రమే దక్కాయి.
కోహ్లి, సిరాజ్ మాత్రమే కాడు మరికొందరు స్టార్ క్రికెటర్లు వివిధ విభాగాల్లో 50 కంటే ఎక్కువ ర్యాంకింగ్స్‌లోనే కొనసాగుతోన్నారు.
64వ ర్యాంక్ లో రూట్…
జాయ్ రూట్ సమకాలీన క్రికెటర్లలో బ్యాటింగ్ పరంగా ఎన్నో తిరుగులేని రికార్డులను నెలకొల్పాడు. ఇంగ్లండ్‌కు చిరస్మరణీయ విజయాల్ని అందించాడు. బ్యాటింగ్‌లోని తిరుగులేని క్రికెటర్‌గా కొనసాగుతోన్న జాయ్ రూట్ బౌలింగ్ విభాగంలో మాత్రం 64వ ర్యాంక్‌లో కొనసాగుతోన్నాడు.
క్లాసెన్ 53వ ర్యాంక్...
ఈ ఏడాది ఐపీఎల్‌లో బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించాడు క్లాసెన్. సన్‌రైజర్స్ తరఫున బరిలో దిగిన ఈ ఆల్‌రౌండర్ 16 మ్యాచుల్లో 479 రన్స్ చేశాడు. ఈ సీజన్‌లో ఏకంగా 38 సిక్స్‌లు కొట్టాడంటే అతడి విధ్వంసం ఏ రేంజ్‌లో జరిగిందో ఊహించుకోవచ్చు. ఐపీఎల్‌లో అదరగొట్టిన క్లాసెన్ ఐసీసీ ర్యాకింగ్స్‌లో మాత్రం వెనుకబడిపోయాడు. టీ20 ర్యాకింగ్స్‌లో బ్యాటింగ్ విభాగంలో 53వ స్థానంలో ఉన్నాడు.