Sunrisers Hyderabad Retainers: సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటెయిన్ చేసుకోబోయే ప్లేయర్స్ వీళ్లే!-sunrisers hyderabad retainers pat cummins travis head heinrich klaasen abhishek sharma nitish reddy ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Sunrisers Hyderabad Retainers: సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటెయిన్ చేసుకోబోయే ప్లేయర్స్ వీళ్లే!

Sunrisers Hyderabad Retainers: సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటెయిన్ చేసుకోబోయే ప్లేయర్స్ వీళ్లే!

Hari Prasad S HT Telugu
Sep 30, 2024 10:16 PM IST

Sunrisers Hyderabad Retainers: సన్ రైజర్స్ హైదరాబాద్ రిటెయిన్ చేసుకోబోయే ప్లేయర్స్ ఎవరు? ఈ ఏడాది ఫైనల్ చేరిన ఈ టీమ్.. ఇందులో కీలకపాత్ర పోషించిన ఐదుగురు ప్లేయర్స్ వైపే చూస్తోంది. మరి గరిష్ఠంగా ఆరుగురు ప్లేయర్స్ కు అవకాశం ఉండటంతో వాళ్లు ఎవరు కావచ్చన్నది ఇప్పుడు చూద్దాం.

సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటెయిన్ చేసుకోబోయే ప్లేయర్స్ వీళ్లే!
సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటెయిన్ చేసుకోబోయే ప్లేయర్స్ వీళ్లే! (AFP)

Sunrisers Hyderabad Retainers: ఐపీఎల్ మెగా వేలానికి ముందు గవర్నింగ్ కౌన్సిల్ ప్రతి ఫ్రాంఛైజీకి గరిష్ఠంగా ఆరుగురు ప్లేయర్స్ రిటెయిన్ చేసుకునే అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ఇందులో ఒకరిని రైట్ టు మ్యాచ్ కార్డు ద్వారా పొందే వీలు కల్పించారు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ లో ఉండబోయే ఆ ప్లేయర్స్ ఎవరన్నదానిపై ఆసక్తి నెలకొంది.

సన్ రైజర్స్ రిటెయిన్ చేసుకునేది వీళ్లనేనా?

ఐపీఎల్ 2025కు ముందు మరోసారి మెగా వేలం జరగనున్న విషయం తెలుసు కదా. అయితే దానికి ముందు ప్రతి ఫ్రాంఛైజీకి కొందరు ప్లేయర్స్ ను రిటెయిన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈసారి ఆ పరిమితి గరిష్ఠంగా ఆరుగురు ప్లేయర్స్ అని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయించింది. అంతేకాదు అలా చేయాలంటే ఒక్కో ప్లేయర్స్ ఎంత మొత్తం ఇవ్వాలన్నది కూడా వెల్లడించారు. మరి సన్ రైజర్స్ లో కొనసాగబోయే ఆ ప్లేయర్స్ ఎవరు?

ప్యాట్ కమిన్స్ - రూ.18 కోట్లు

ప్యాట్ కమిన్స్ 2024 సీజన్లోనే సన్ రైజర్స్ తో చేరాడు. కెప్టెన్ అయ్యాడు. ఏకంగా జట్టును ఫైనల్ కు తీసుకెళ్లాడు. దీంతో ఫ్రాంఛైజీ మొదటి ప్రాధాన్యత అతనికే ఉండనుంది. ఆ లెక్కన అతనికి రూ.18 కోట్లు దక్కుతాయి.

ట్రావిస్ హెడ్ - రూ.14 కోట్లు

ఇక ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ ఫైనల్ చేరడానికి ప్రధాన కారణమైన ప్లేయర్స్ లో ఒకడు ఓపెనర్ ట్రావిస్ హెడ్. ఈ ఆస్ట్రేలియా ప్లేయర్ అందించిన మెరుపు ఆరంభాలే టీమ్ ను ఫైనల్ చేర్చాయి. దీంతో రెండో ప్రాధాన్యతగా అతన్ని రూ.14 కోట్లకు రిటెయిన్ చేసుకోవచ్చు.

అభిషేక్ శర్మ - రూ.11 కోట్లు

ఇక ట్రావిస్ హెడ్ తో కలిసి అభిషేక్ శర్మ సృష్టించిన విధ్వంసం కూడా అంతా ఇంతా కాదు. ఈ సీజన్ తర్వాత అతడు టీమిండియాలోకి కూడా వచ్చాడు. దీంతో సన్ రైజర్స్ అతన్ని రూ.11 కోట్లకు కొనసాగించవచ్చు.

హెన్రిచ్ క్లాసెన్, నితీష్ రెడ్డి

సన్ రైజర్స్ హైదరాబాద్ విజయాల్లో కీలకపాత్ర పోషించిన వాళ్లలో మిడిలార్డర్ బ్యాటర్లు హెన్రిచ్ క్లాసెన్, నితీష్ రెడ్డి కూడా ఉన్నారు. వీళ్లను కూడా సన్ రైజర్స్ వదులుకోదు అనడంలో సందేహం లేదు. అయితే రైట్ టు మ్యాచ్ కార్డు ద్వారా వీళ్లను తిరిగి పొందాలన్న ఆలోచనలో టీమ్ కనిపిస్తున్న సమాచారం.

ఒక్కో ఫ్రాంఛైజీకి రూ.120 కోట్లు

మెగా వేలంలో ప్లేయర్స్ కొనుగోలు కోసం ఒక్కో ఫ్రాంఛైజీకి గరిష్ఠంగా రూ.120 కోట్ల పరిమితి విధించారు. ఒకవేళ ఏదైనా ఫ్రాంఛైజీ ఐదుగురు క్యాప్డ్ ప్లేయర్స్ ను రిటెయిన్ చేసుకోవాలనుకుంటే వాళ్లకు వరుసగా రూ.18 కోట్లు, రూ.14 కోట్లు, రూ.11 కోట్లు ఇవ్వాలి. తర్వాత నాలుగు, ఐదుగురు ప్లేయర్స్ కు మళ్లీ రూ.18 కోట్లు, రూ.14 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది.

ఆ లెక్కన ఐదుగురు ప్లేయర్స్ కే రూ.75 కోట్లు ఖర్చువుతాయి. మరో అన్‌క్యాప్డ్ ప్లేయర్ ను రిటెయిన్ చేసుకోవాలంటే రూ.4 కోట్లు అవుతుంది. అంటే రూ.79 కోట్లు. దీంతో వేలంలో సదరు ఫ్రాంఛైజీకి మిగిలేది కేవలం రూ.41 కోట్లే. అందువల్ల ప్రతి ఫ్రాంఛైజీ రిటెయినర్ల విషయంలో ఆచితూచి వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి.

Whats_app_banner