Pat Cummins: అల్లు అర్జున్, మహేష్ బాబు డైలాగులతో అదరగొట్టిన సన్ రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్.. వీడియో చూశారా?-video of sunrisers hyderabad captain pat cummins saying allu arjun mahesh babu dialogues gone viral ipl 2024 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pat Cummins: అల్లు అర్జున్, మహేష్ బాబు డైలాగులతో అదరగొట్టిన సన్ రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్.. వీడియో చూశారా?

Pat Cummins: అల్లు అర్జున్, మహేష్ బాబు డైలాగులతో అదరగొట్టిన సన్ రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్.. వీడియో చూశారా?

Hari Prasad S HT Telugu
Apr 24, 2024 11:55 AM IST

Pat Cummins: సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ నోట మన అల్లు అర్జున్, మహేష్ బాబు డైలాగులు ఎప్పుడైనా విన్నారా? ఇప్పుడతడు ఆ డైలాగులు చెబుతున్న వీడియో వైరల్ అవుతోంది.

అల్లు అర్జున్, మహేష్ బాబు డైలాగులతో అదరగొట్టిన సన్ రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్.. వీడియో చూశారా?
అల్లు అర్జున్, మహేష్ బాబు డైలాగులతో అదరగొట్టిన సన్ రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్.. వీడియో చూశారా?

Pat Cummins: ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా ఎవరున్నా టాలీవుడ్ హీరోల డైలాగులు చెప్పడం కామనైపోయింది. గతంలో డేవిడ్ వార్నర్ ఉన్నప్పుడు డైలాగ్సే కాదు.. ఎన్నో రీల్స్ కూడా చేసేవాడు. ఇప్పుడు మన జట్టుకు కెప్టెన్ గా వచ్చిన ప్యాట్ కమిన్స్ కూడా అలాగే అదరగొట్టాడు. అల్లు అర్జున్, మహేష్ బాబుల పాపులర్ డైలాగులు చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కమిన్స్ నోట తెలుగు సినిమాల డైలాగులు

సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా ప్యాట్ కమిన్స్ ఈ సీజన్లోనే నియమితుడైన విషయం తెలుసు కదా. ఈ ఆస్ట్రేలియా కెప్టెన్ ఇప్పుడు తెలుగులో మాట్లాడుతున్నాడు. అంతేకాదు సినిమా డైలాగులూ చెప్పేస్తున్నాడు. అల్లు అర్జున్, మహేష్ బాబు డైలాగులు.. పవన్ కల్యాణ్ మేనరిజంతో కమిన్స్ చేసిన వీడియో అభిమానులకు తెగ నచ్చేస్తోంది.

మహేష్ బాబు మూవీ పోకిరిలోని పాపులర్ డైలాగ్ ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను అనే డైలాగుతోపాటు పుష్పలోని ఫైర్ డైలాగ్ కూడా కమిన్స్ ఎంతో పర్ఫెక్ట్ గా చెప్పాడు. "ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను.. కమిన్స్ అంటే క్లాస్ కాదు.. మాస్.. ఊర మాస్.. ఎస్ఆర్‌హెచ్ అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్" అనే డైలాగులు కమిన్స్ చెప్పాడు.

ఇక వీడియో చివర్లో పవన్ కల్యాణ్ మేనరిజంతో అదరగొట్టేశాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో సన్ రైజర్స్ ఆరెంజ్ ఆర్మీ షేర్ చేసింది. అప్పటి నుంచీ అభిమానులు ఈ వీడియోను లైక్స్, షేర్ చేస్తున్నారు. ప్యాట్ కమిన్స్ తెలుగులో మాట్లాడటం విన్నారా అంటూ ఈ వీడియోను పోస్ట్ చేశారు.

అదరగొడుతున్న సన్ రైజర్స్

ఇక ఐపీఎల్ 2024లో ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీలో సన్ రైజర్స్ హైదరాబాద్ అదరగొడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బ్యాటింగ్ లో భారీ స్కోర్లు చేస్తూ ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తోంది. ఈ సీజన్లో 287 రన్స్ చేసి ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు నమోదు చేసింది. ప్రస్తుతం పాయింట్ల టేబుల్లో మూడో స్థానంలో ఉన్న సన్ రైజర్స్ ఈ ఏడాది ప్లేఆఫ్స్ కు చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

గత వేలంలో కమిన్స్ ను రూ.20.5 కోట్లకు కొనుగోలు చేసి కెప్టెన్సీ అప్పగించిన సన్ రైజర్స్.. సరైన నిర్ణయమే తీసుకున్నట్లు ఇప్పటి వరకూ జరిగిన మ్యాచ్ లను బట్టి స్పష్టమవుతోంది. కమిన్స్ తో పాటు మరో ఆస్ట్రేలియన్ ట్రావిస్ హెడ్ కూడా చెలరేగుతున్నాడు. ఓపెనర్ గా అతడు సృష్టిస్తున్న విధ్వంసమే సన్ రైజర్స్ కు మంచి ఆరంభాలను ఇస్తోంది.

గతంలో 2016లో ఆస్ట్రేలియన్ అయిన డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో సన్ రైజర్స్ ఐపీఎల్ ట్రోఫీ గెలిచింది. అంతకుముందు డెక్కన్ ఛార్జర్స్ గా ఉన్నప్పుడు ఆస్ట్రేలియన్ గిల్‌క్రిస్ట్ కెప్టెన్సీలోనే ట్రోఫీ అందుకుంది. దీంతో ఈసారి కమిన్స్ కెప్టెన్సీలో అదే రిపీట్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సగం సీజన్ ముగిసిన తర్వాత చూస్తే సన్ రైజర్స్ ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది.

IPL_Entry_Point