తెలుగు న్యూస్ / ఫోటో /
Abhishek Sharma Record: మెరుపు సెంచరీతో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన అభిషేక్ శర్మ.. తొలి ఇండియన్ అతడే..
- Abhishek Sharma Record: టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. జింబాబ్వేతో రెండో టీ20లో మెరుపు సెంచరీ చేసిన అతడు.. కెరీర్లో రెండో టీ20 మ్యాచ్ లోనే సెంచరీ చేసిన తొలి ఇండియన్ ప్లేయర్ గా నిలిచాడు.
- Abhishek Sharma Record: టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. జింబాబ్వేతో రెండో టీ20లో మెరుపు సెంచరీ చేసిన అతడు.. కెరీర్లో రెండో టీ20 మ్యాచ్ లోనే సెంచరీ చేసిన తొలి ఇండియన్ ప్లేయర్ గా నిలిచాడు.
(1 / 5)
Abhishek Sharma Record: జింబాబ్వేతో జరిగిన తొలి టీ20యే అభిషేక్ శర్మకు కెరీర్లో తొలి టీ20 మ్యాచ్. అందులో డకౌటై తీవ్రంగా నిరాశ పరిచిన అతడు.. రెండో టీ20లోనే మెరుపు సెంచరీ చేశాడు. కేవలం 46 బంతుల్లోనే సెంచరీ చేయడం విశేషం.
(2 / 5)
Abhishek Sharma Record: కెరీర్లో ఆడిన రెండో టీ20లోనే సెంచరీ చేసిన తొలి ఇండియన్ ప్లేయర్ గా అభిషేక్ శర్మ రికార్డు క్రియేట్ చేశాడు. కేఎల్ రాహుల్ కూడా గతంలో 46 బంతుల్లోనే సెంచరీ చేయగా.. ఆ రికార్డును సమం చేశాడు. అయితే ఇండియా తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు రోహిత్ శర్మ (35 బాల్స్) పేరిట ఉండగా.. సూర్యకుమార్ 45 బంతుల్లో సెంచరీ చేశాడు.
(3 / 5)
Abhishek Sharma Record: అంతేకాదు టీ20ల్లో ఇండియా తరఫున సెంచరీ చేసిన నాలుగో యంగెస్ట్ ప్లేయర్ కూడా అభిషేక్ శర్మనే. అతడు 23 ఏళ్ల 307 రోజుల వయసులో ఈ సెంచరీ చేశాడు. అతని కంటే ముందు యశస్వి జైస్వాల్ (21 ఏళ్ల 270 రోజులు), శుభ్‌మన్ గిల్ (23 ఏళ్ల 146 రోజులు), సురేశ్ రైనా (23 ఏళ్ల 156 రోజులు) ఈ ఘనత సాధించారు.
(4 / 5)
Abhishek Sharma Record: అభిషేక్ శర్మ ఈ మ్యాచ్ లో 33 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. అయితే ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తర్వాతి 13 బంతుల్లో మరో 50 పరుగులు చేశాడంటే అతని జోరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మయర్స్ వేసిన ఓ ఓవర్లో ఏంకగా 28 పరుగులు రాబట్టాడు. వరుసగా మూడు సిక్స్ లతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఇతర గ్యాలరీలు