IPL 2025 Retention: ఐపీఎల్ 2025 రిటెన్షన్ రూల్స్‌లో మార్పులు, పవర్ హిట్టర్ కోసం రూ.23 కోట్లు వెచ్చిస్తున్న సన్‌రైజర్స్
ఐపీఎల్ 2025 రిటెన్షన్ గడువుకి ముందు బీసీసీఐ నిబంధనల్ని మార్చినట్లుంది. దాంతో ఫ్రాంఛైజీలు తమకి నచ్చిన ప్లేయర్‌కి ఎంత ధర అయినా వెచ్చించి రిటెన్ చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో హైదరాాబాద్ సాహసోపేత నిర్ణయం తీసుకుంది.
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు రిటెన్షన్ నిబంధనల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఐపీఎల్ 2025లో రిటెన్షన్‌కి సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇటీవల కొన్ని నిబంధనలను రూపొందించిన విషయం తెలిసిందే.
ఫ్రాంఛైజీలు ఐపీఎల్ 2025 వేలానికి ముందు గరిష్టంగా 5 మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. వేలం సమయంలో ఒక రైట్ టు మ్యాచ్ (ఆర్‌టీఎం) ఛాన్స్ ఫ్రాంఛైజీలకి ఉంటుంది. అలా ఫ్రాంఛైజీలు అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల కోసం వేలానికి ముందు రూ.75 కోట్లు ఖర్చు చేసే వెసులబాటుని ఐపీఎల్ పాలక వర్గం ఇచ్చింది.
రిటెన్షన్ కోసం రూ.75 కోట్లు
ఓవరాల్‌గా ప్రతి ఫ్రాంఛైజీకి రూ.120 కోట్లు కేటాయించగా.. ఐదుగురు ఆటగాళ్ల రిటెన్షన్ కోసం రూ.75 కోట్లు ఖర్చు చేసిన తర్వాత మిగిలిన రూ.45 కోట్లతో వేలానికి వెళ్లనున్నాయి. ఆటగాళ్ల రిటెన్షన్ కోసం స్లాబ్‌లను కూడా బీసీసీఐ సూచించింది. ఎలా అంటే ఫస్ట్ అట్టిపెట్టుకున్న ప్లేయర్‌కి ఫ్రాంఛైజీ రూ.18 కోట్లు ఇవ్వాలి. ఆ తర్వాత సెకండ్ ప్లేయర్‌కి రూ.14 కోట్లు, మూడో ప్లేయర్‌కి రూ.11 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఐదుగురిని రిటెన్ చేసుకోవాలని అనుకుంటే అప్పుడు తిరిగి వరుసగా 4, 5వ ప్లేయర్‌కి కూడా రూ.18 కోట్లు, రూ.14 కోట్లు చెల్లించాలనేది నిబంధన.
కానీ.. ఈ నిబంధనపై ఫ్రాంఛైజీల నుంచి విమర్శలు రావడంతో రిటెన్షన్ పాలసీలో బీసీసీఐ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. అయితే.. అధికారికంగా ప్రకటించలేదు. కానీ.. ఫ్రాంఛైజీలు తాము రిటైన్ చేసుకున్న ఆటగాళ్లకు ఆ రూ.75 కోట్ల నుంచి ఎంత మొత్తాన్ని అయినా ఇవ్వవచ్చని తెలుస్తోంది.
ఒక్కడికే రూ.23 కోట్లు
రూల్ మారడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ.. పవర్ హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్‌ని రూ.18 కోట్లతో కాకుండా రూ.23 కోట్లతో రిటెన్ చేసుకోవాలని నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ తర్వాత పాట్ కమిన్స్‌కి రూ.18 కోట్లు, అభిషేక్ శర్మకి రూ.14 కోట్లు ఇచ్చి రిటెన్ చేసుకోవాలని హైదరాబాద్ ఫ్రాంఛైజీ నిర్ణయించిందట. ఈ ముగ్గురితో పాటు ట్రావిస్ హెడ్, నితీశ్ రెడ్డిలను కూడా కొనసాగించాలని ఫ్రాంఛైజీ ప్రాథమికంగా ఓ నిర్ణయాని వచ్చినట్లు తెలుస్తోంది. ఓవరాల్‌గా ఈ ఐదుగురు ప్లేయర్లకీ రూ.75 కోట్లలోనే సర్దుబాటు చేయనుంది.
తెలుగు ప్లేయర్‌కి రూ.10 కోట్లు?
వాస్తవానికి హైదరాబాద్ టాప్-3 ప్లేయర్ల కోసమే రూ.55 కోట్లని ఖర్చు చేయనుండగా.. ఇక మిగిలిన రూ.20 కోట్ల నుంచి ట్రావిస్ హెడ్, నితీశ్ రెడ్డిని రిటెన్ చేసుకోనుంది. ఇద్దరికీ చెరో రూ.10 కోట్లు ఇస్తుందా? లేదా వేరే ఆలోచన ఏదైనా ఉందా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. అక్టోబరు 31 లోపు ఫ్రాంఛైజీలు తాము రిటెన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాని బీసీసీఐకి సమర్పించాల్సి ఉంది.