Sunrisers Hyderabad Matches: ఐపీఎల్ 2024లో సన్‍రైజర్స్ హైదరాబాద్ 14 మ్యాచ్‍ల తేదీలు ఇవే..-sunrisers hyderabad full schedule match dates timings venues in ipl 2024 srh updates ,cricket న్యూస్
తెలుగు న్యూస్  /  Cricket  /  Sunrisers Hyderabad Full Schedule Match Dates Timings Venues In Ipl 2024 Srh Updates

Sunrisers Hyderabad Matches: ఐపీఎల్ 2024లో సన్‍రైజర్స్ హైదరాబాద్ 14 మ్యాచ్‍ల తేదీలు ఇవే..

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 25, 2024 09:41 PM IST

Sunrisers Hyderabad IPL 2024 Matches: ఐపీఎల్ 2024 సీజన్‍కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ నేడు ఖరారైంది. ఈ సీజన్‍లో లీగ్ దశలో సన్‍రైజర్స్ హైదరాబాద్ ఆడనున్న 14 మ్యాచ్‍ల వివరాలు వెల్లడయ్యాయి. మ్యాచ్‍ల తేదీలు, వేదికల వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Sunrisers Hyderabad Matches: ఐపీఎల్ 2024లో సన్‍రైజర్స్ హైదరాబాద్ 14 మ్యాచ్‍ల తేదీలు ఇవే..
Sunrisers Hyderabad Matches: ఐపీఎల్ 2024లో సన్‍రైజర్స్ హైదరాబాద్ 14 మ్యాచ్‍ల తేదీలు ఇవే.. (AFP)

Sunrisers Hyderabad Matches: ఐపీఎల్ 2024 టోర్నీ పూర్తి షెడ్యూల్ ఖరారైంది. ఈ సీజన్ కోసం తొలి దశగా 21 మ్యాచ్‍లను గతంలో ప్రకటించిన బీసీసీఐ.. నేడు (మార్చి 25) పూర్తి షెడ్యూల్‍ను ప్రకటించింది. 74 మ్యాచ్‍ల తేదీలను ఖరారు చేసింది. మార్చి 22న ఇప్పటికే ఈ సీజన్ ప్రారంభం కాగా.. మే 26వ తేదీన ఫైనల్ జరగనుంది. మే 19వ తేదీ వరకు లీగ్ దశ మ్యాచ్‍లు జరుగుతాయి. ఈ సీజన్‍లో ఇప్పటికే ఓ మ్యాచ్ ఆడిన సన్‍రైజర్స్ హైదరాబాద్ (SRH) స్వల్ప తేడాతో ఓడింది. ఐపీఎల్ 2024లో హైదరాబాద్ 14 లీగ్ మ్యాచ్‍ల షెడ్యూల్, తేదీలు, వేదికలు ఏవో ఇక్కడ చూడండి.

ట్రెండింగ్ వార్తలు

ఐపీఎల్ 2024లో హైదరాబాద్ షెడ్యూల్

  • సన్‍రైజర్స్ హైదరాబాద్ vs కోల్‍కతా నైట్‍రైడర్స్ - మార్చి 23 - రాత్రి 7.30 - కోల్‍కతాలో..
  • సన్‍రైజర్స్ హైదరాబాద్ vs ముంబై ఇండియన్స్ - మార్చి 27 - రాత్రి 7.30 - హైదరాబాద్‍లో..
  • సన్‍రైజర్స్ హైదరాబాద్ vs గుజరాత్ టైటాన్స్ - మార్చి 31 - మధ్యాహ్నం 3.30 - అహ్మదాబాద్‍లో..
  • సన్‍రైజర్స్ హైదరాబాద్ vs చెన్నై సూపర్ కింగ్స్ - ఏప్రిల్ 05 - రాత్రి 7.30 - హైదరాబాద్‍లో..
  • సన్‍రైజర్స్ హైదరాబాద్ vs పంజాబ్ కింగ్స్ - ఏప్రిల్ 09 - రాత్రి 7.30 - ముల్లాన్‍పూర్‌లో..
  • సన్‍రైజర్స్ హైదరాబాద్ vs రాయల్ చాలెంజర్స్ బెంగళూరు - ఏప్రిల్ 15 - రాత్రి 7.30 - బెంగళూరులో..
  • సన్‍రైజర్స్ హైదరాబాద్ vs ఢిల్లీ క్యాపిటల్స్ - ఏప్రిల్ 20 - రాత్రి 7.30 - ఢిల్లీలో..
  • సన్‍రైజర్స్ హైదరాబాద్ vs రాయల్ చాలెంజర్స్ బెంగళూరు - ఏప్రిల్ 25 - రాత్రి 7.30 - హైదరాబాద్‍లో..
  • సన్‍రైజర్స్ హైదరాబాద్ vs చెన్నై సూపర్ కింగ్స్ - ఏప్రిల్ 28 - రాత్రి 7.30 - చెన్నైలో..
  • సన్‍రైజర్స్ హైదరాబాద్ vs రాజస్థాన్ రాయల్స్ - మే 02 - రాత్రి 7.30 - హైదరాబాద్‍లో..
  • సన్‍రైజర్స్ హైదరాబాద్ vs ముంబై ఇండియన్స్ - మే 06 - రాత్రి 7.30 - ముంబైలో..
  • సన్‍రైజర్స్ హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్ - మే 08 - రాత్రి 7.30 - హైదరాబాద్‍లో..
  • సన్‍రైజర్స్ హైదరాబాద్ vs గుజరాత్ టైటాన్స్ - మే 16 - రాత్రి 7.30 - హైదరాబాద్‍లో..
  • సన్‍రైజర్స్ హైదరాబాద్ vs పంజాబ్ కింగ్స్ - మే 19 - మధ్యాహ్నం 3.30 - హైదరాబాద్‍లో..

తొలి మ్యాచ్‍లో..

ఐపీఎల్ 2024 సీజన్‍లో మార్చి 23న కోల్‍కతా నైట్ రైజర్స్ జట్టుతో సన్‍రైజర్స్ హైదరాబాద్ తలపడింది. కోల్‍కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‍లో కోల్‍కతా 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‍ లక్ష్యఛేదనలో ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ 29 బంతుల్లో 8 సిక్సర్లతో 63 పరుగులు చేశాడు. అతడు చివరి వరకు పోరాడినా కాస్తలో ఓటమి పాలైంది.

ఈ మ్యాచ్‍లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‍కతా నైట్‍రైడర్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 208 రన్స్ చేసింది. ఆ తర్వాత లక్ష్యఛేదనలో హైదరాబాద్ టీమ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 204 పరుగులు చేసింది. చివరి ఓవర్లో తడబడి ఓడింది ఎస్‍ఆర్‌హెచ్. తర్వాతి మ్యాచ్‍లో మార్చి 27న ముంబై ఇండియన్స్ జట్టుతో హైదరాబాద్ తలపడనుంది. ఈ సీజన్‍లో ఎస్‍ఆర్‌హెచ్‍కు ఆస్ట్రేలియా స్టార్ ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ చేస్తున్నాడు.

ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ షెడ్యూల్

ఐపీఎల్ 2024 సీజన్‍లో లీగ్ దశ మ్యాచ్‍లో మే 19 వరకు జరగనున్నాయి ప్లేఆఫ్స్ మే 21 నుంచి ఫ్లేఆఫ్స్ జరుగుతాయి. మే 21వ తేదీన అహ్మదాబాద్‍‍లో క్యాలిఫయర్-1, మే 22న ఎలిమినేటర్ మ్యాచ్‍లు జరగనున్నాయి. మే 24వ తేదీన చెన్నైలో క్వాలిఫయర్-2, మే 26న అక్కడే ఫైనల్ జరగనున్నాయి.

WhatsApp channel