KKR vs SRH : 'రూ. 25 కోట్లు ఉఫ్​'- మిచెల్​ స్టార్క్​పై దారుణంగా ట్రోలింగ్​!-kkr vs srh costliest ipl player mitchell starc registers his most expensive spell ,cricket న్యూస్
తెలుగు న్యూస్  /  Cricket  /  Kkr Vs Srh Costliest Ipl Player Mitchell Starc Registers His Most Expensive Spell

KKR vs SRH : 'రూ. 25 కోట్లు ఉఫ్​'- మిచెల్​ స్టార్క్​పై దారుణంగా ట్రోలింగ్​!

Sharath Chitturi HT Telugu
Mar 24, 2024 10:08 AM IST

Mitchell Starc IPL : కేకేఆర్​ వర్సెస్​ ఎస్​ఆర్​హెచ్​ మ్యాచ్​లో 4 ఓవర్లకు 53 రన్స్​ ఇచ్చిన మిచెల్​ స్టార్క్​ని దారుణంగా ట్రోల్​ చేస్తున్నారు! స్టార్క్​.. ఐపీఎల్​ని మధ్యలోనే వదిలేస్తాడని అంటున్నారు.

కేకేఆర్​ ప్లేయర్​ మిచెల్​ స్టార్క్​..
కేకేఆర్​ ప్లేయర్​ మిచెల్​ స్టార్క్​.. (PTI)

Mitchell Starc IPL 2024 price : ఐపీఎల్​ రెండో రోజే.. రసవత్తర మ్యాచ్​ చూసి క్రికెట్​ లవర్స్​ థ్రిల్​ అయిపోయారు. సన్​రైజర్స్​ హైదరాబాద్​ని 4 పరుగులు తేడాతో ఓడించింది కోల్​కతా నైట్​ రైడర్స్​. చివరి నిమిషం వరకు హోరాహోరీగా సాగిన పోరులో కేకేఆర్​ పైచేయి సాధించింది. హెన్రిక్​ క్లాసెన్​ వీర మాస్​ హిట్టింగ్​(29 బాల్స్​లో 63 పరుగులు) వృథా అయ్యింది. వీటన్నింటి మధ్య.. ఆస్ట్రేలియన్​ స్టార్​ బౌలర్​, కేకేఆర్​ ప్లేయర్​ మిచెల్​ స్టార్క్​ని దారుణంగా ట్రోల్​ చేస్తున్నారు క్రికెట్​ ఫ్యాన్స్​. ఐపీఎల్​ 2024లో అత్యధిక ధర పలికిన ప్లేయర్​గా ఉన్న స్టార్క్​.. మొదటి మ్యాచ్​లోనే బౌలింగ్​లో హాఫ్​ సెంచరీ కొట్టడం ఇందుకు కారణం.

ట్రెండింగ్ వార్తలు

'రూ. 25 కోట్లు ఉఫ్​..'!

ఆస్ట్రేలియా జట్టులో సీనియర్​ ప్లేయర్​గా ఉన్న మిచెల్​ స్టార్క్​.. ఐపీఎల్​లో ఆడి 9ఏళ్లు అయ్యింది. కానీ.. ఐపీఎల్​ 2024 కోసం మిచెల్​ స్టార్క్​ని రూ. 24.75 కోట్లు కొనుక్కుంది కేకేఆర్​. అప్పట్లో ఇది పెద్ద షాకింగ్​గానే అనిపించింది. ఇక శనివారం జరిగిన మ్యాచ్​ విషయానికొస్తే.. రెండో ఇన్నింగ్స్​, తన స్పెల్​లో మూడు ఓవర్లకు 27 పరగులు ఇచ్చాడు మిచెల్​ స్టార్క్​. అంతా బాగానే ఉందనుకుంటున్న సమయంలో.. 19వ ఓవర్​ వేశాడు ఆస్ట్రేలియన్​ స్టార్​ బౌలర్​. ఆ ఒక్క ఓవర్​లో.. ఏకంగా 26 పరుగులు సమర్పిచుకున్నాడు. ఆ ఓవర్​లో 4 సిక్స్​లు ఇచ్చుకున్నాడు. చివరికి.. 4 ఓవర్లకు 53 పరగులు ఇచ్చాడు స్టార్క్​.

ఐపీఎల్​ 2024లో మోస్ట్​ ఎక్స్​పెన్సివ్​ ప్లేయర్​ మిచెల్​ స్టార్క్​ ప్రదర్శన చూసిన కేకేఆర్​ అభిమానులు, క్రికెట్​ లవర్స్​ షాక్​ అవుతున్నారు. అతడిని దారుణంగా ట్రోల్​ చేస్తున్నారు.

KKR vs SRH highlights : "మిచెల్​ స్టార్క్​.. ఐపీఎల్​ని మధ్యలోనే ఒదిలేస్తాడు. అతడి బౌలింగ్​ని మరీ దారుణంగా కొట్టకండి," అని ఓ నెటిజన్​ కామెంట్​ చేశాడు.

"ప్రతి మ్యాచ్​లోనూ బౌలింగ్​తో హాఫ్​ సెంచరీ కొట్టడానికి.. మిచెల్​ స్టార్క్​ని రూ. 25 కోట్లు పెట్టి కొంది కేకేఆర్​," అని మరో క్రికెట్​ లవర్​ రాసుకొచ్చారు.

"మిచెల్​ స్టార్క్​ని గ్రౌండ్​ మొత్తం స్మాష్​ చేశారు. విధ్వంసం సృష్టించారు," అని మరో వ్యక్తి ట్వీట్​ చేశాడు.

ప్యాట్​ కమిన్స్​ పరిస్థితేంటి..?

టీ20 మ్యాచ్​లో స్కోర్​ 200 దాటిందంటేనే.. ప్రత్యర్థి జట్టు బౌలింగ్​ ప్రదర్శన ఎలా ఉందో అర్థమైపోతుంది. కేకేఆర్​తో మ్యాచ్​లో ఎస్​ఆర్​హెచ్​ బౌలింగ్​ కూడా తేలిపోయింది. మోస్ట్​ ఎక్స్​పీరియెన్స్​డ్​ బౌలర్​ భువనేశ్వర్​ అయితే.. 4 ఓవర్లలో ఏకంగా 51 పరుగులు ఇచ్చేశాడు. మార్కో జాన్సన్​ 3 ఓవర్లకు 40 రన్స్​ ఇచ్చేశాడు.

KKR vs SRH live score : ఇక.. ఐపీఎల్​లో మరో ఎక్స్​పెన్సివ్​ ప్లేయర్​, ఎస్​ఆర్​హెచ్​ సారథి ప్యాట్​ కమిన్స్​ కూడా అంచనాలను అందుకోలేకపోయాడని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. 4 ఓవర్లకు 32 పరుగులు తీసి, 1 వికెట్​ తీశాడు. ఇతరులతో పోల్చుకుంటే పర్లేదు కానీ.. అతని ఎకనామీ కూడా 8లోనే ఉంది.

ఐపీఎల్​ 2024 ఇప్పుడే మొదలైంది. ఒక్క మ్యాచ్​ చూసి మిచెల్​ స్టార్క్​, ప్యాట్​ కమిన్స్​ ప్రదర్శనను అంచనా వేయకూడదు. మరి.. ఈ సీజన్​లో వీరిద్దరు ఏ మేరకు ప్రదర్శన చేస్తారో చూడాలి!

WhatsApp channel

సంబంధిత కథనం