IPL 2024 points table : పంజాబ్‌పై ముంబై గెలుపు.. ఐపీఎల్ పాయింట్స్ టేబుల్లో భారీ మార్పులు
IPL 2024 points table : పంజాబ్ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్ గెలుపుతో.. ఐపీఎల్ 2024 పాయింట్స్ టేబుల్లో భారీ మార్పులు కనిపించాయి. ఆ వివరాలను ఇక్కడ చూడండి.
IPL 2024 points table today : ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్‌పై నెయిల్ బైటింగ్ థ్రిలర్‌లో విజయం సాధించింది ముంబై ఇండియన్స్. జస్ప్రీత్ బుమ్రా, గెరాల్డ్ రాణించడంతో ముంబై ఇండియన్స్ 9 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్‌పై విజయం సాధించింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో విజయంతో.. ముంబై ఇండియన్స్ రెండు కీలక పాయింట్లు సాధించి.. ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి పెరిగింది.
ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో.. ఫాఫ్ డూప్లెసిస్ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. 2 పాయింట్లతో 10వ స్థానంలో ఉంది. ఆ జట్టు ఆడిన 7 మ్యాచుల్లో కేవలం 1 మ్యాచ్ మాత్రమే విజయం సాధించింది. గురువారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదో ఓటమిని చూసిన శిఖర్ ధావన్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్.. 9వ స్థానంలో ఉంది.
MS vs PBKS 2024 : శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్.. 6 పాయింట్లతో ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉండగా.. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్‌కి కూడా 6 పాయింట్లే ఉన్నాయి. కానీ నెట్ రన్ రేట్ ఎక్కువగా ఉండటంతో.. ముంబై 7వ స్థానానికి చేరింది.
రిషబ్ పంత్ సారథ్యంలోని దిల్లీ క్యాపిటల్స్ ఇటీవల కొన్ని కీలక విజయాలు సాధించి.. ఆరు పాయింట్లతో -0.074 నెట్ రన్ రేట్‌తో ఆరో స్థానంలో నిలిచింది. కేఎల్ రాహుల్ సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్ 6 పాయింట్లు, ఎన్ఆర్ఆర్ +0.038 పాయింట్లతో ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది.
ఇదీ చూడండి:- Rohit Sharma: ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై రోహిత్ శర్మ ఫైర్ - దూబే, సుందర్ లాంటి ఆల్‌రౌండర్లకు ప్రమాదకరం
ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో తాజా ర్యాంకింగ్స్ ఇలా ఉన్నాయి.
IPL 2024 latest updates : నాలుగో స్థానంలో ప్యాట్ కమిన్స్ సారథ్యంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2024లో రికార్డు స్థాయి ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో ఆ జట్టుకు 8 పాయింట్లు, పాజిటివ్ ఎన్ఆర్ఆర్ 0.502 ఉన్నాయి. ఫలితంగా.. ఎస్ఆర్హెచ్ 4వ స్థానంలో ఉంది. రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఎన్ఆర్ఆర్ +0.726తో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఇప్పటివరకు ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో ఆధిపత్యం చెలాయించింది. 8 పాయింట్లతో ఐపిఎల్ 2024 పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో బలంగా ఉంది.
12 పాయింట్లతో రాజస్థాన్ రాయల్స్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆడిన 7 మ్యాచుల్లో కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఓడిన ఆ జట్టు.. 0.677 పాజిటివ్ నెట్ రన్ రేట్‌ను కలిగి ఉంది.
IPL 2024 orange cap lsit : ఇక ఐపీఎల్ 2024 ఆరెంజ్ క్యాప్ విషయానికొస్తే.. ఆర్సీబీ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ముంబై ఇండియన్స్ బుమ్రా పర్పుల్ క్యాప్‌లో టాప్‌లో ఉన్నాడు.
సంబంధిత కథనం