తెలుగు న్యూస్ / ఫోటో /
Rohit Sharma Rare Record: ఐపీఎల్లో రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. ధోనీ తర్వాత అతడే
- Rohit Sharma Rare Record: ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్లో 250 మ్యాచ్ లు ఆడిన రెండో ప్లేయర్ గా నిలిచాడు.
- Rohit Sharma Rare Record: ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్లో 250 మ్యాచ్ లు ఆడిన రెండో ప్లేయర్ గా నిలిచాడు.
(1 / 5)
Rohit Sharma Rare Record: ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం (ఏప్రిల్ 18) పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లీగ్ లో రోహిత్ శర్మకు 250వ మ్యాచ్ కావడం విశేషం. ధోనీ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్ గా రోహిత్ నిలిచాడు.
(2 / 5)
Rohit Sharma Rare Record: ధోనీ, రోహిత్ శర్మ తర్వాత దినేష్ కార్తీక్ 249 మ్యాచ్ లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక విరాట్ కోహ్లి 244 మ్యాచ్ లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇప్పటి వరకూ ఐపీఎల్ చరిత్రలో 200కుపైగా మ్యాచ్ లు ఆడిన ప్లేయర్స్ కేవలం పది మంది మాత్రమే. వాళ్లంతా ఇండియన్ ప్లేయర్సే కావడం విశేషం.
(3 / 5)
Rohit Sharma Rare Record: ఇక విదేశీయుల విషయానికి వస్తే వెస్టిండీస్ కు చెందిన కీరన్ పొలార్డ్ 189 మ్యాచ్ లతో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. అతని తర్వాత సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ (184 మ్యాచ్ లు) ఉన్నాడు.
(4 / 5)
Rohit Sharma Rare Record: రోహిత్ శర్మ 250 మ్యాచ్ లలో (పంజాబ్ కింగ్స్ మ్యాచ్ కలిపి) 6508 రన్స్ చేశాడు. అందులో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి. అంతేకాదు బౌలింగ్ లో హ్యాట్రిక్ కూడా తీశాడు. ఇలా సెంచరీ, హ్యాట్రిక్ తీసిన ప్లేయర్స్ లో రోహిత్ కాకుండా షేన్ వాట్సన్, సునీల్ నరైన్ మాత్రమే ఉన్నారు.
(5 / 5)
Rohit Sharma Rare Record: ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన వారిలో రోహిత్ శర్మ నాలుగో స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లి, శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్ తర్వాత రోహిత్ ఉన్నాడు. ఇక కెప్టెన్ గా ముంబై ఇండియన్స్ ను ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిపాడు. చెన్నై సూపర్ కింగ్స్ ధోనీ కూడా తన జట్టును ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిపిన విషయం తెలిసిందే.
ఇతర గ్యాలరీలు