KL Rahul in IPL 2024: కేఎల్ రాహులే టీ20 వరల్డ్ కప్ టీమ్ కెప్టెన్.. ప్రశంసలు కురిపిస్తున్న ఫ్యాన్స్.. ఇదీ కారణం-ipl 2024 news in telugu kl rahul successfully defending small totals as captain for lucknow super giants fans happy ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Kl Rahul In Ipl 2024: కేఎల్ రాహులే టీ20 వరల్డ్ కప్ టీమ్ కెప్టెన్.. ప్రశంసలు కురిపిస్తున్న ఫ్యాన్స్.. ఇదీ కారణం

KL Rahul in IPL 2024: కేఎల్ రాహులే టీ20 వరల్డ్ కప్ టీమ్ కెప్టెన్.. ప్రశంసలు కురిపిస్తున్న ఫ్యాన్స్.. ఇదీ కారణం

Hari Prasad S HT Telugu
Apr 08, 2024 01:40 PM IST

KL Rahul in IPL 2024: ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ పై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ 2024కు కెప్టెన్ గా పోటీ పడుతున్నాడా అని అడుగుతున్నారు. దీనికి కారణమేంటో చూడండి.

కేఎల్ రాహులే టీ20 వరల్డ్ కప్ టీమ్ కెప్టెన్.. ప్రశంసలు కురిపిస్తున్న ఫ్యాన్స్.. ఇదీ కారణం
కేఎల్ రాహులే టీ20 వరల్డ్ కప్ టీమ్ కెప్టెన్.. ప్రశంసలు కురిపిస్తున్న ఫ్యాన్స్.. ఇదీ కారణం (PTI)

KL Rahul in IPL 2024: ఐపీఎల్ 2024 ప్రారంభానికి ముందు కేఎల్ రాహుల్ టీ20 వరల్డ్ కప్ 2024 టీమ్ లో ఓ వికెట్ కీపర్ స్థానం కోసం పోటీ పడుతున్నాడని భావించారు. కానీ ఇప్పుడీ ఐపీఎల్లో కెప్టెన్ గా అతని ప్రదర్శన చూసిన తర్వాత రాహుల్ ఏకంగా కెప్టెన్సీ కోసమే చూస్తున్నాడా అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాపై ప్రస్తుతం అతనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

కేఎల్ రాహుల్.. సూపర్ కెప్టెన్

తాజాగా గుజరాత్ టైటన్స్ పై లక్నో సూపర్ జెయింట్స్ గెలిచిన తర్వాత కేఎల్ రాహుల్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాడు. ముఖ్యంగా ఐపీఎల్లో 160 ప్లస్ టార్గెట్స్ ను డిఫెండ్ చేయడంలో అతడు చూపిస్తున్న ప్రతిభకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ రాహుల్ కెప్టెన్సీలో 160 ప్లస్ టార్గెట్స్ విధించినప్పుడు ఒక్క మ్యాచ్ లోనూ ఓడలేదు.

ఇలా 13 మ్యాచ్ లలోనూ ఎల్ఎస్‌జీ గెలిచింది. తాజాగా గుజరాత్ టైటన్స్ తో మ్యాచ్ లోనూ ఆ టీమ్ 164 రన్స్ లక్ష్యాన్ని కాపాడుకుంది. పైగా ఆ జట్టులో చెప్పుకోదగిన స్టార్ బౌలర్లు ఎవరూ లేరు. ఇదే విషయాన్ని అభిమానులు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. బుమ్రా, షమి, రబాడా, కమిన్స్, స్టార్క్, సిరాజ్ లాంటి బౌలర్లు లేకుండా ఇంత తక్కువ లక్ష్యాలను డిఫెండ్ చేసుకోవడం లక్నోకే సాధ్యమవుతోంది.

ఈ సీజన్లో ఆ జట్టులో మయాంక్ యాదవ్ కొత్త స్టార్ గా ఎదిగాడు. గంటలకు 150కుపైగా కి.మీ. వేగంతో బౌలింగ్ చేస్తున్నాడు. అయితే అతడు కూడా గాయపడి టైటన్స్ తో మ్యాచ్ లో కేవలం ఒకే ఓవర్ వేశాడు. ఈ మ్యాచ్ లో మరో స్టార్ యశ్ ఠాకూర్ 5 వికెట్లతో రాణించాడు. వీళ్లకుతోడు నవీనుల్ హక్, రవి బిష్ణోయ్, కృనాల్ పాండ్యాలాంటి బౌలర్లతో ఆ టీమ్ టార్గెట్స్ డిఫెండ్ చేసుకుంటోంది.

రాహుల్‌కే క్రెడిట్

ఈ క్రెడిట్ అంతా రాహుల్ కే దక్కుతుందని అభిమానులు అంటున్నారు. తనకున్న పరిమిత వనరులను అతడు అద్భుతంగా ఉపయోగించుకుంటూ ఈ సీజన్లో మూడు మ్యాచ్ లలోనూ లక్ష్యాలను డిఫెండ్ చేసుకున్నాడు. ఇన్నాళ్లూ టీ20 వరల్డ్ కప్ కోసం ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, రిషబ్ పంత్, జితేష్ శర్మ, ధృవ్ జురెల్ లాంటి వికెట్ కీపర్లతో రాహుల్ పోటీ పడేవాడు.

ఇప్పుడు ఏకంగా కెప్టెన్సీ కోసమే పోటీ పడుతున్నాడా అని కూడా ఫ్యాన్స్ అంటున్నారు. అయితే ఓ బ్యాటర్ గా మాత్రం రాహుల్ ఈ సీజన్లో తన పూర్తి స్థాయి ప్రదర్శన చేయలేకపోతున్నాడు. నాలుగు మ్యాచ్ లలో 126 రన్స్ మాత్రమే చేశాడు. అతని అత్యధిక స్కోరు 58. టైటన్స్ తో మ్యాచ్ లో 33 రన్స్ చేశాడు. బ్యాటింగ్ పరంగా చూస్తే సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, పంత్ గట్టి పోటీ ఇస్తున్నారు.

వీళ్లు ఇప్పటికే కొన్ని మ్యాచ్ లలో మెరుపులు మెరిపించారు. ఇప్పుడు రాహుల్ టీ20 వరల్డ్ కప్ జట్టులో ఉండాలంటే బ్యాట్ తోనూ మెరవాల్సిన అవసరం ఉంది. అయితే 2022లో టీ20 వరల్డ్ కప్ తర్వాత ఈ ఫార్మాట్ లో అతడు ఆడలేదు. రాహుల్ స్ట్రైక్ రేట్ కూడా దీనికి ఓ కారణంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే వరల్డ్ కప్ కు అతనికి జట్టులో చోటు దక్కడం కష్టంగానే కనిపిస్తోంది.

Whats_app_banner