YSRCP: జగన్ కీలక నిర్ణయం.. రీజినల్‌ కో-ఆర్డినేటర్ల మార్పు - జాబితా ఇదే-ys jagan appointed new regional coordinators for ysrcp ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ys Jagan Appointed New Regional Coordinators For Ysrcp

YSRCP: జగన్ కీలక నిర్ణయం.. రీజినల్‌ కో-ఆర్డినేటర్ల మార్పు - జాబితా ఇదే

HT Telugu Desk HT Telugu
Nov 24, 2022 09:07 AM IST

new regional coordinators for ysrcp: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రీజినల్‌ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులను కేంద్ర కార్యాలయం ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత జగన్ ఆదేశాలు జారీ చేశారు.

రీజనల్‌ కో-ఆర్డినేటర్ల మార్పు
రీజనల్‌ కో-ఆర్డినేటర్ల మార్పు (twitter)

YSRCP New Regional Coordinators: వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ పావులు కదుపుతోంది. ఇప్పటికే 175 సీట్లే లక్ష్యమంటూ ముందుకెళ్తోంది. నియోజకవర్గాల నేతలతో స్వయంగా ఆ పార్టీ అధినేత జగన్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. చేసిన కార్యక్రమాలు, చేయాల్సిన పనులపై దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు వైఎస్ జగన్. రీజినల్ కో ఆర్డినేటర్ నియామకంలో మార్పులు చేసింది.. కొంత మందిని తప్పించి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించారు.

శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు రీజినల్ కోఆర్డినేటర్‌గా మంత్రి బొత్స సత్యనారాయణను నియమించింది. ఇక విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు వైవీ సుబ్బారెడ్డిని... తూర్పు గోదావరి, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలకు రీజినల్ కోఆర్డినేటర్లుగా పిల్లి సుభాష్ చంద్రబోస్ ,మిథున్ రెడ్డి పేర్లను ప్రకటించింది. కృష్ణ, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లాలకు రీజినల్ కోఆర్డినేటర్లుగా మర్రి రాజశేఖర్ రెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డిని నియమించింది.

పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు బీద మస్తాన్ రావు, భూమన కరుణాకర్ రెడ్డి రీజినల్‌ కోఆర్డినేటర్‌ బాధ్యతలను అప్పగించింది. నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాలకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కో-ఆర్డినేటర్‌గా కొనసాగనున్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాలకు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, అన్నమయ్య, చిత్తూరు, శ్రీ సత్య సాయి, అనంతపురం జిల్లాలకు రీజినల్ కోఆర్డినేటర్ గా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నియమించింది.

కొత్త కోఆర్డినేటర్ల జాబితా….

కర్నూలు, నంద్యాల జిల్లాల కోఆర్డినేటర్లుగా - ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి

అన్నమయ్య, చిత్తూరు, అనంతపురం, సత్యసాయి జిల్లాల కోఆర్డినేటర్‌గా -పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల కోఆర్డినేటర్ గా - బాలినేని శ్రీనివాస్‌రెడ్డి

పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల కోఆర్డినేటర్లుగా - బీద మస్తాన్‌రావు, భూమన కరుణాకర్‌రెడ్డి

కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు జిల్లాల కోఆర్డినేటర్లుగా - మర్రి రాజశేఖర్‌, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి

కాకినాడ, తూగో, కోనసీమ, పగో, ఏలూరు జిల్లాల కోఆర్డినేటర్లుగా - పిల్లి సుభాష్‌, మిథున్‌రెడ్డి

విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల కోఆర్డినేటర్‌గా - వైవీ సుబ్బారెడ్డి

శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి జిల్లాల కోఆర్డినేటర్‌గా - బొత్స సత్యనారాయణ

చెవిరెడ్డికి కీలక పదవి...

ఇక పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించారు ముఖ్యమంత్రి జగన్. పార్టీ అనుబంధ విభాగాల కో ఆర్డినేటర్‌గా నియమించారు. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ప్రకటించింది. పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్, ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డికి సహాయకారిగా చెవిరెడ్డి వ్యవహరిస్తారని వెల్లడించింది.

ప్రాంతీయ సమన్వయకర్తలుగా వ్యవహరిస్తున్న వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థిక మంత్రి బుగ్గన , మాజీ మంత్రులు కొడాలి నాని, అనిల్‌కుమార్‌ యాదవ్‌లను ఆ బాధ్యతల నుంచి తప్పించారు. ఇదే సమయంలో 8 జిల్లాల్లో పార్టీ అధ్యక్షులను మార్చారు. ఇందులో పార్వతీపురం, విశాఖ, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాలు ఉన్నాయి. మొత్తంగా వచ్చే ఎన్నికల్లో 175కి 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. రీజనల్‌ కో-ఆర్డినేటర్ల విషయంలోనూ మార్పులకు శ్రీకారం చుట్టినట్లు అయింది.

IPL_Entry_Point