AP Politics: ఏపీలో 'వన్ ఛాన్స్' పాలిటిక్స్.. నాడు జగన్.. నేడు చంద్రబాబు, పవన్-one chance politics in andhrapradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  One Chance Politics In Andhrapradesh

AP Politics: ఏపీలో 'వన్ ఛాన్స్' పాలిటిక్స్.. నాడు జగన్.. నేడు చంద్రబాబు, పవన్

HT Telugu Desk HT Telugu
Nov 18, 2022 10:46 AM IST

ఏపీ పాలిటిక్స్.... నిత్యం ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా కర్నూలు పర్యటనలో చంద్రబాబు చేసిన చివరి ఎన్నికల కామెంట్స్... హాట్ టాపిక్ గా మారింది. గతంలో జగన్ వన్ ఛాన్స్ అంటే.. ఇప్పుడు చంద్రబాబు లాస్ట్ ఛాన్స్ అంటూ ముందుకెళ్తున్నారు. ఇప్పుడు ఈ కామెంట్సే టాక్ ఆఫ్ ది ఆంధ్రాగా మారాయి.

ఏపీలో సరికొత్త రాజకీయాలు
ఏపీలో సరికొత్త రాజకీయాలు

Andhrapradesh Politics: "నాకు ఓట్లు వేసి గెలిపించి అసెంబ్లీకి పంపించండి. లేకపోతే ఇవే నా చివరి ఎన్నికలు"... ఇవి టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూలు చేసిన కామెంట్స్. సరిగ్గా ఇప్పుడు ఈ కామెంట్సే ఆంధ్రా అడ్డాలో తెగ చర్చకు దారి తీస్తున్నాయి. గెలవకపోతే చంద్రబాబు పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పేస్తారా అని ఓవైపు వార్తలు వస్తుంటే... చంద్రబాబుకే కాదు టీడీపీకి కూడా సమాధి కంటే ఎన్నికలు అంటూ వైసీపీ కౌంటర్ మొదలుపెట్టింది. అయితే చంద్రబాబు... పక్కా వ్యూహంతోనే ఈ కామెంట్స్ చేశారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో వైసీపీ అధినేత జగన్ అంటున్న వన్ మోర్ ఛాన్స్... పవన్ అంటున్న వన్ ఛాన్స్ పై కూడా చర్చ జరుగుతోంది.

సుదీర్ఘ పాదయాత్రతో వన్ ఛాన్స్ అంటూ ప్రజల్లోకి వెళ్లారు జగన్. 150కి పైగా స్థానాలు గెలిచి ఆంధ్రా అడ్డాలో భారీ విక్టరీని క్రియేట్ చేశారు. ఇక టీడీపీ మాత్రం.. ఘోరంగా విఫలమైంది. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం... వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఎలాగైన అధికారంలోకి రావాలని చూస్తోంది. ఇప్పటికే లోకేశ్ పాదయాత్రకు కూడా రెడీ అయ్యారు. చంద్రబాబు ఉత్తరాంధ్రలో పర్యటించారు. తాజాగా సీమ జిల్లాలో పర్యటనలు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన చేసిన కామెంట్స్... ఆసక్తికరంగా మారాయి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే.. తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. అక్కడితో ఆగకుండా.. ఇవే తనకు చివరి ఎన్నికలు అని.. 'లాస్ట్ ఛాన్స్' అని వ్యాఖ్యానించారు. దీనిపై ప్రత్యర్థులు సెటైర్లు వేసినా.. టీడీపీ దీన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది. ఏపీ అభివృద్ధి కోసం చంద్రబాబుకు అవకాశం ఇవ్వాలని కోరుతోంది.

చంద్రబాబు చేసిన కామెంట్స్ పై వైసీపీ కౌంటర్స్ వేస్తోంది. ఇక టీడీపీ పని అయిపపోందని... వచ్చే ఎన్నికలే ఆ పార్టీకి చివరి అంటూ విమర్శలు చేస్తోంది. అయితే వైసీపీ కూడా... 2024 టార్గెట్ గా చాలా రోజుల కిందటే ఆపరేషన్ షురూ చేసింది. ఆ పార్టీ అధినేత జగన్.... నియోజకవర్గాల నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. వై నాట్ 175 అంటూ....ప్రస్తావిస్తున్నారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని... వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటును కూడా వదలుకోకూడదని చెబుతున్నారు. వన్ మోర్ ఛాన్స్ అంటూ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక జనసేన పరిస్థితి చూస్తుంటే... పవన్ కల్యాణ్ గతానికి భిన్నంగా అడుగులు వేస్తున్నారు. కొన్ని సామాజికవర్గాలపై కన్నేసిన ఆయన... పక్కాగా వ్యూహాలు రచించే పనిలో పడ్డారు. ఇక అధికార వైసీపీ టార్గెట్ గా విమర్శల వర్షం గుప్పిస్తున్నారు. ఇక బీజేపీకి దూరంగా ఉన్నట్లు సీన్ కనిపిస్తోంది. ఈ మధ్యే మోదీని కలిసినప్పటికీ... పరిస్థితి గతంలో మాదిరిగా లేనట్లు అనిపిస్తోంది. పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్న పవన్... ఒక్క అవకాశం తనకి ఇవ్వాలని... ఏపీని అభివృద్ధి చేసి చూపిస్తామంటూ ప్రజలను ఆలోచనలో పడేస్తున్నారు.

మొత్తంగా వన్ మోర్ ఛాన్స్, లాస్ట్ ఛాన్స్, వన్ ఛాన్స్ అంటూ ప్రజల్లోకి వెళ్లే పనిలో పడ్డాయి ప్రధాన పార్టీలు. అయితే గత ఎన్నికల మాదిరిగానే జగన్ ను ఆదరిస్తారా..? లేక చివరి ఎన్నికలే అంటున్న చంద్రబాబుకు పట్టం కడుతారా..? వీరిద్దరిని కాకుండా జనసేన అధినేతకు జై కొడుతారా అనేది వచ్చే ఎన్నికల్లో తేలనుంది.

IPL_Entry_Point