APPSC Group 2 : ఏపీపీఎస్సీ గ్రూప్-2 అభ్యర్థులకు ఎస్బీఐ ఊరట, క్లర్క్ పరీక్ష మార్చి 4వ తేదీకి మార్పు
APPSC Group 2 : ఏపీపీఎస్సీ గ్రూప్-2, ఎస్బీఐ క్లర్క్ పరీక్షలు ఒకే తేదీన వచ్చాయి. దీంతో రెండు పరీక్షలకు అప్లై చేసుకున్న అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఏపీపీఎస్సీ సూచనతో ఎస్బీఐ క్లర్క్ పరీక్షను మార్చి 4వ తేదీకి మార్చింది.
APPSC Group 2 : గ్రూప్-2 (Group 2)ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసింది ఏపీపీఎస్సీ(APPSC). ఈ నెల 25న రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఇప్పటికే గ్రూప్-2 హాల్ టికెట్లు ఏపీపీఎస్సీ అభ్యర్థులకు అందుబాటులో ఉంచింది. అయితే గ్రూప్-2 పరీక్ష నిర్వహించనున్న 25వ తేదీనే ఎస్బీఐ క్లర్క్ పరీక్ష ఉంది. ఈ రెండు పరీక్షలకు అప్లై చేసుకున్న అభ్యర్థులు విషయాన్ని ఏపీపీఎస్సీ బోర్డు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ఏపీపీఎస్సీ ఎస్బీఐ అధికారులతో మాట్లాడి...క్లర్క్(SBI Clerk Exam)) పరీక్షను మరో తేదీలో నిర్వహించాలని కోరింది. ఈ నెల 25 గ్రూప్-2 పరీక్ష రాసే అభ్యర్థులు క్లర్క్ పరీక్షను మార్చి 4 వ తేదీకి మార్చుకోవచ్చని ఎస్బీఐ తెలిపింది. ఇందుకు సంబంధించిన లింక్ ను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచినట్లు ప్రకటించింది. అయితే ఈ నెల 23వ తేదీ ఉదయం 9 గంటల లోపు అభ్యర్థులు క్లర్క్ పరీక్ష తేదీని మార్చుకోవాలని సూచించింది.
ఈ నెల 25న గ్రూప్-2 పరీక్ష
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 హాల్ టిక్కెట్లను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. రాష్ట్ర వ్యాప్తంగా 899 పోస్టులకి గ్రూప్ -2 పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల 25న గ్రూప్ -2 ప్రిలిమినరీ పరీక్ష జరుగనుంది. ఉదయం 10.30 గంటల నుంచి ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహిస్తారు. ఏపీ పబ్లిక్ సర్వీస్ కమీషన్ వెబ్ సైట్ http://www.psc.ap.gov.in లో అభ్యర్థులకు హాల్ టిక్కెట్లు అందుబాటులో ఉంచినట్లు కమిషన్ వర్గాలు ప్రకటించాయి. గ్రూప్ 2 ప్రిలిమనరీ పరీక్షకి 24 జిల్లాలలో కేంద్రాలను ఏర్పాట్లు చేశారు. ఏపీపీఎస్సీ గ్రూప్ -2 పరీక్షలకు మొత్తం 4,83,525 మంది దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్ 2 పరీక్షల వాయిదా అంటూ జరుగుతున్న ప్రచారం నిజం కాదని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలని నమ్మవద్దని సూచించారు. ఏపీపీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్లలో ఏ ఒక్కటీ వాయిదా వేయలేదని కమిషన్ వర్గాలు స్పష్టం చేశాయి. తప్పుడు వదంతులని అభ్యర్ధులు నమ్మవద్దని విజ్ణప్తి చేశారు. గ్రూప్ 2 ప్రిలిమనరీ పరీక్ష యథావిధిగా ఈ నెల 25న జరుగుతుందని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. మొత్తం 899 పోస్టులకు 4,83,525 మంది దరఖాస్తు చేసుకోగా, ఒక్కో పోస్టుకు 537 మంది పోటీ పడుతున్నారు.
పరీక్ష విధానం ఇలా?
గ్రూప్-2 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌లలో ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. స్క్రీనింగ్ పరీక్షలో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ ఉంటాయి. ఈ పరీక్షను 150 ప్రశ్నలతో 150 మార్కులకు నిర్వహిస్తారు. ప్రిలిమినరీలో అర్హత సాధించిన అభ్యర్థులను మెయిన్స్ కు ఎంపిక చేస్తారు. మెయిన్స్ లో రెండు పేపర్లను 300 మార్కులకు నిర్వహిస్తారు. ఒక్కొక్కటి 150 మార్కులు కేటాయించారు. పేపర్-1లో చూస్తే ఏపీ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం అంశాలు ఉన్నాయి. ఇక పేపర్-2లో చూస్తే భారతదేశ, ఏపీ ఆర్థిక వ్యవస్థ, సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సెక్షన్ కు 75 మార్కులు కేటాయించారు.
సంబంధిత కథనం