(1 / 5)
ఈనెల 25వ తేదీన ఏపీ గ్రూపు-2 ప్రిలిమ్స్ పరీక్ష ఉంది. ఇప్పటికే హాల్ టికెట్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది ఏపీ పబ్లిక్ సర్వీక్ కమిషన్. అయితే ఇదే రోజు ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్ కూడా ఉంది.
(https://portal-psc.ap.gov.in/)(2 / 5)
ఒకే రోజు రెండు పరీక్షలు ఉన్న నేపథ్యంలో అభ్యర్థులకుకీలక అప్డేట్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్.
(/unsplash.com/)(3 / 5)
ఎస్బీఐ క్లర్క్ పరీక్ష గురించి పలువురు గ్రూప్ 2 అభ్యర్థులు విజ్ఞప్తి చేశారని ఏపీపీఎస్సీ తెలిపింది. పరీక్షను వాయిదా వేయాలని కోరినట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో అభ్యర్థులకు కీలక అప్డేట్ ఇస్తూ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది.
(/unsplash.com/)(4 / 5)
ఇప్పటివరకు తమకు వినతిపత్రం ఇచ్చిన వారే కాకుండా… ఇంకా ఎవరైన ఈ రెండు పరీక్షలు రాస్తున్నవారు ఉంటే హాల్‌టికెట్ల కాపీలను ఫిబ్రవరి 19వ తేదీ రాత్రి 12:00లోపు పంపాలని సూచించింది. appschelpdesk@gmail.comకి మెయిల్ చేయాలని పేర్కొంది.
(/unsplash.com/)(5 / 5)
అభ్యర్థులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఎస్బీఐ వారితో మాట్లాడుతామని తెలిపింది. అభ్యర్థులు పంపే వివరాలను వారికి పంపుతామని… పరీక్ష తేదీల మార్పునకు కృషి చేస్తామని తెలిపింది. ఒకేరోజు రెండు పరీక్షలు ఉన్న నేపథ్యంలో…. చివరికి కమిషన్ ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా…? లేక ఎస్బీఐ నుంచి ప్రకటన ఉంటుందా అనేది తేలాల్సి ఉంది.
(/unsplash.com/)ఇతర గ్యాలరీలు