UGC NET 2024 : యూజీసీ నెట్ హాల్ టికెట్లు విడుదల, పరీక్షల రీషెడ్యూల్ ఇదే-ugc net 2024 re examination schedule released admit cards available at ugc net website ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ugc Net 2024 : యూజీసీ నెట్ హాల్ టికెట్లు విడుదల, పరీక్షల రీషెడ్యూల్ ఇదే

UGC NET 2024 : యూజీసీ నెట్ హాల్ టికెట్లు విడుదల, పరీక్షల రీషెడ్యూల్ ఇదే

Bandaru Satyaprasad HT Telugu
Aug 18, 2024 07:19 PM IST

UGC NET 2024 : యూజీసీ నెట్ 2024 రీషెడ్యూల్ ను యూజీసీ ప్రకటించింది. ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 4 వరకు నెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే ఆగస్టు 21, 22, 23 తేదీల్లో నిర్వహించే పరీక్షల అడ్మిట్ కార్డులను ఎన్టీఏ విడుదల చేసింది. ఇతర తేదీల్లో పరీక్షల అడ్మిట్ కార్డులను త్వరలో విడుదల చేయనున్నారు.

యూజీసీ నెట్ హాల్ టికెట్లు విడుదల, పరీక్షల రీషెడ్యూల్ ఇదే
యూజీసీ నెట్ హాల్ టికెట్లు విడుదల, పరీక్షల రీషెడ్యూల్ ఇదే

UGC NET 2024 : యూజీసీ-నెట్ పరీక్ష హాల్ టికెట్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఆగస్టు 21, 22, 23 తేదీల్లో నిర్వహించే అడ్మిట్ కార్డులను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. దేశవ్యాప్తంగా ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు 83 సబ్జెక్టులకు కంప్యూటర్ ఆధారిక పరీక్ష నిర్వహిస్తున్నారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు పరీక్ష కేంద్రం, తేదీల వివరాలను ఇప్పటికే తెలియజేశారు. తాజాగా ఈ నెల 21, 22, 23 తేదీల్లో నిర్వహించే పరీక్షల అడ్మిట్ కార్డ్‌లు విడుదల చేశారు. అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డ్‌ని అధికారిక వెబ్ సైట్ https://ugcnet.nta.ac.in/ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. అడ్మిట్ కార్డులను ఈ నెల 17 నుంచి అభ్యర్థులకు అందుబాటులో ఉంచినట్లు ప్రకటించారు.

అభ్యర్థి అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేయడంలో ఇబ్బంది ఎదుర్కొన్నా, వివరాలు తప్పుగా ఉన్నా 011- 40759000 లేదా ఈ-మెయిల్ ugcnet@nta.ac.in ద్వారా అధికారులను సంప్రదించాలని సూచించింది. అభ్యర్థులు తాజా అప్డేట్స్ కోసం www.nta.ac.in, https://ugcnet.nta.ac.in/ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శిస్తూ ఉండాలని సూచించారు. ప్రస్తుతం ఆగస్టు 21 నుంచి 23 వరకు జరిగే సబ్జెక్టుల హాల్ టికెట్లు మాత్రమే విడుదల చేశారు. ఇతర సబ్జెక్టుల హాల్ టికెట్లు త్వరలో విడుదల చేయనున్నట్లు ఎన్టీఏ తెలిపింది.

పరీక్ష తేదీలు

21.08.2024

  • SHIFT – I (09:00 AM to 12:00 PM) : ఇంగ్లీష్, జపనీస్, పెర్ఫార్మింగ్ ఆర్ట్ - డ్యాన్స్/డ్రామా/థియేటర్, ఎలక్ట్రానిక్ సైన్స్
  • SHIFT – II (03:00 PM to 06:00 PM) : ఇంగ్లీష్, డోగ్రీ, స్పానిష్, రష్యన్, పర్షియన్, మతాల అధ్యయనం, హిందూ అధ్యయనాలు

22.08.2024

  • SHIFT – I (09:00 AM to 12:00 PM) : సోషల్ వర్క్, హోమ్ సైన్స్, సంగీతం, ఫ్రెంచ్, వయోజన విద్య/ నిరంతర విద్య/ ఆండ్రగోగి/, అనధికారిక విద్య, భారతీయ సంస్కృతి, బౌద్ధులు; జైన; గాంధేయ, పీస్ స్టడీస్, ఆర్కియాలజీ
  • SHIFT – II (03:00 PM to 06:00 PM) : పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎడ్యుకేషన్

23.08.2024

  • SHIFT – I (09:00 AM to 12:00 PM) : కంప్యూటర్ సైన్స్ , అప్లికేషన్స్
  • SHIFT – II (03:00 PM to 06:00 PM) : బెంగాలీ, చైనీస్, రాజస్థానీ, అరబ్ సంస్కృతి, ఇస్లామిక్ అధ్యయనాలు, కాశ్మీరీ, సామాజిక శాస్త్రం

యూజీసీ నెట్ అడ్మిట్ కార్డు డౌన్ లోడ్ ఎలా?

  • ముందుగా అధికారిక వెబ్ సైట్ https://ugcnet.nta.ac.in/ లింక్ పై క్లిక్ చేయండి.
  • హోం పేజీలో 'Admit Card for exam dated 21st, 22nd & 23 August 2024' లింక్ పై క్లిక్ చేయండి.
  • తర్వాత పేజీలో అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.
  • అభ్యర్థి అడ్మిట్ కార్డు డిస్ ప్లే అవుతుంది. డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోండి.

Whats_app_banner

సంబంధిత కథనం