నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎస్) నీట్ పీజీ 2024 అడ్మిట్ కార్డును తాజాగా విడుదల చేసింది. ఆగస్టు 11న పరీక్ష రాసే అభ్యర్థులు natboard.edu.in అధికారిక వెబ్సైట్ నుంచి అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
నీట్ పీజీ అడ్మిట్ కార్డు 2024 డౌన్లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
నీట్ పీజీ 2024 హాల్‌టికెట్‌లో అభ్యర్థులు పరీక్ష నగరం, వేదిక, సమయం తదితర వివరాలను చూడవచ్చు.
నీట్ పీజీ పరీక్షను 2024 ఆగస్టు 11న సీబీటీ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) విధానంలో రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నారు. పరీక్ష 3 గంటల 30 నిమిషాల పాటు జరుగుతుంది.
నీట్ పీజీ ప్రశ్నపత్రంలో 200 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయని, ఇందులో అభ్యర్థులకు ఇంగ్లిష్ భాషలోనే 4 రెస్పాన్స్ ఆప్షన్లు ఉన్న ప్రశ్నలు ఇస్తారని అధికారులు తెలిపారు. అభ్యర్థులు ప్రతి ప్రశ్నలో ఇచ్చిన 4 ఆప్షన్స్‌లో సరైన / ఉత్తమ / అత్యంత సముచితమైన ప్రతిస్పందన / సమాధానాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.
వాస్తవానికి నీట్ పీజీ 2024 పరీక్ష జూన్ 23న ఎన్బీఈఎంఎస్ పరీక్షను నిర్వహించాల్సి ఉంది. అయితే నీట్ యూజీ, ఇతర ప్రవేశ పరీక్షలకు సంబంధించి పేపర్ లీక్ వివాదాల నేపథ్యంలో నీట్ పీజీ వాయిదా పడింది. ముందుజాగ్రత్త చర్యగా పరీక్షను వాయిదా వేసిన ఎన్బీఈఎంఎస్ 2024 జూలై 5న కొత్త తేదీని ప్రకటించింది. ఆగస్ట్ 11న పరీక్ష నిర్వహించనున్నట్టు వెల్లడించింది.
నీట్ పీజీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అడ్మిట్ కార్డును ఇల డౌన్లోడ్ చేసుకోవచ్చు..
మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఎన్బీఈఎంఎస్ అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించాల్సి ఉంటుంది.
మరోవైపు నీట్ పీజీ 2024 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ని సుప్రీంకోర్టు శుక్రవారం విచారించనుంది. అభ్యర్థులకు వివిధ నగరాల్లో పరీక్షా కేంద్రాలను కేటాయించారని, అవి చేరుకోవడం కష్టమని పిటిషనర్ పేర్కొన్నారు. అదే సమయంలో స్కోర్లను నార్మలైజేషన్ చేయాల్సిన అవసరం ఉందని వెల్లడించారు.
న్యాయవాది అనాస్ తన్వీర్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం గురువారం అనుమతించింది.
సంబంధిత కథనం