UGC NET 2024: యూజీసీ నెట్ 2024 సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ రెడీ.. ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..
యూజీసీ నెట్ 2024 సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ వెబ్ సైట్ లో సిద్ధంగా ఉన్నాయి. యూజీసీ నెట్ అధికారిక వెబ్ సైట్ ugcnet.nta.ac.in నుంచి విద్యార్థులు తమ సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్ లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆగస్టు 21, 22, 23 తేదీల్లో జరిగే పరీక్షలకు సంబంధించిన సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ ఇవి.
ఆగస్టు 21, 22, 23 తేదీల్లో జరిగే పరీక్షలకు సంబంధించి యూజీసీ నెట్ 2024 సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్ లను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ విడుదల చేసింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు యూజీసీ నెట్ అధికారిక వెబ్సైట్ ugcnet.nta.ac.in ద్వారా ఈ స్లిప్స్ ను చెక్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
2024 ఆగస్టు 21, 22, 23 తేదీల్లో పరీక్ష
2024 ఆగస్టు 21, 22, 23 తేదీల్లో నిర్వహించనున్న యూజీసీ - నెట్ జూన్ 2024 కోసం ఎగ్జామినేషన్ సిటీ కేటాయింపునకు సంబంధించిన సమాచారాన్ని అధికారిక వెబ్ సైట్ ugcnet.nta.ac.in లో అప్ లోడ్ చేశారు. యూజీసీ-నెట్ పరీక్షను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. అభ్యర్థులు తమ యూజీసీ - నెట్ జూన్ 2024 ఎగ్జామినేషన్ సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్ ను వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని ఎన్టీఏ సూచించింది.
ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..
ఎగ్జామ్ సిటీ స్లిప్ డౌన్ లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులు ఈ కింది స్టెప్స్ ఫాలో అవ్వొచ్చు.
- ముందుగా విద్యార్థులు యూజీసీ అధికారిక వెబ్ సైట్ ugcnet.nta.ac.in ను సందర్శించాలి.
- హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న యూజీసీ నెట్ ఎగ్జామ్ సిటీ స్లిప్ లింక్ పై క్లిక్ చేయండి.
- అభ్యర్థులు లాగిన్ వివరాలను నమోదు చేయాల్సిన కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- ఆ వివరాలను నమోదు చేసి, సబ్మిట్ పై క్లిక్ చేస్తే మీ ఎగ్జామ్ సిటీ స్లిప్ స్క్రీన్ పై కనిపిస్తుంది.
- స్లిప్ ను చెక్ చేసుకుని, డౌన్లోడ్ చేసుకోండి.
- తదుపరి అవసరాల కోసం దాన్ని ప్రింట్ తీసుకుని భద్రపర్చుకోండి.
83 సబ్జెక్టుల్లో యూజీసీ నెట్ 2024
యూజీసీ నెట్ 2024 (UGC NET 2024) పరీక్షను 83 సబ్జెక్టులకు ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 4, 2024 వరకు సీబీటీ విధానంలో నిర్వహిస్తారు. పరీక్ష రెండు షిఫ్టుల్లో జరుగుతుంది. మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండవ షిఫ్ట్ మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. యూజీసీ నెట్ జూన్ 2024 ఎగ్జామినేషన్ సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్ డౌన్లోడ్/ చెక్ చేయడంలో ఎవరికైనా ఇబ్బందులు ఎదురైతే 011-40759000 నంబరుకు ఫోన్ చేయొచ్చు. లేదా ugcnet@nta.ac.in కు ఈ-మెయిల్ చేయవచ్చు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు యూజీసీ నెట్ (UGC NET 2024) అధికారిక వెబ్సైట్ ను చూడవచ్చు.