NEET UG 2023 Exam City Slip : వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశం కోసం జరిగే నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) అండర్ గ్రాడ్యుయేట్ (UG) పరీక్షకు సంబంధించి ఎగ్జామ్ సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్ (Exam City Slip)లు వెల్లడయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఈ స్లిప్‍లను నేడు (ఏప్రిల్ 30) విడుదల చేసింది. ఎన్‍టీఏ అధికారిక వెబ్‍సైట్ neet.nta.nic.inలో ఈ ఎగ్జామ్ సిటీ స్లిప్‍లను పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు డౌన్‍లోడ్ చేసుకోవచ్చు.
NEET UG 2023 Exam City Slip : నీట్ (యూజీ) 2023 పరీక్ష కోసం తమకు కేటాయించిన సెంటర్ ఏ నగరంలో ఉందోనన్న సమాచారాన్ని ఈ ఎగ్జామ్ సిటీ స్లిప్ ద్వారా అభ్యర్థులు తెలుసుకోవచ్చు. neet.nta.nic.in వెబ్‍సైట్‍లో అప్లికేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి స్లిప్ డౌన్‍లోడ్ చేసుకోవచ్చు. షెడ్యూల్ ప్రకారం, నీట్ యూజీ 2023 పరీక్ష మే 7వ తేదీన జరగనుంది. దేశవ్యాప్తంగా 499 నగరాల్లో ఈ నీట్ పరీక్ష పెన్ & పేపర్ (ఆఫ్‍లైన్) మోడ్‍లో జరుగుతుంది.
NEET UG 2023 Exam City Slip : నీట్ యూజీ 2023 అడ్మిట్ కార్డు(Admit Cards)లను కూడా మరో రెండు రోజుల్లోగా ఎన్‍టీఏ విడుదల చేస్తుందని అంచనాలు ఉన్నాయి. అభ్యర్థులు ముందుగా ఈ సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్‍ను చూసి అందుకు అనుగుణంగా తమ ప్రయాణానికిి సంబంధించిన ఏర్పాట్లు ముందుగానే చేసుకోవాలి. అప్‍డేట్‍ల కోసం neet.nta.nic.in తరచూ చెక్ చేస్తూ ఉండాలి.
NEET UG 2023 Exam:ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బీఎస్ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీఎస్‍సీ (హెచ్) వైద్య విద్యా కోర్సుల్లో అడ్మిషన్లకు నీట్ పరీక్షను ఎన్‍టీఏ ప్రతీ సంవత్సరం నిర్వహిస్తుంటుంది. ఈ ఏడాది ఈ పరీక్ష కోసం దేశవ్యాప్తంగా ఏకంగా 20.87 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం.