IRCTC Tripura Tour Package : త్రిపుర ప్రకృతి అందాలపై ఓ లుక్కేయండి, 6 రోజుల ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ ఇదిగో!
IRCTC Tripura Tour Package : త్రిపుర రాజధాని అగర్తలా నుంచి ఆరు రోజుల టూర్ ప్యాకేజీ అందిస్తోంది ఐఆర్సీటీసీ. త్రిపురలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలు అగర్తల, ఉనోకోటి, దోంబూర్, సెపాహిజాలను ఈ టూర్ లో చూడవచ్చు.
IRCTC Tripura Tour Package : ఈశాన్య రాష్ట్రాలు(North East Tour) ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. ఈ సమ్మర్ లో నార్త్ ఈస్ట్ లోని త్రిపుర(Tripura) అందాలు చూడాలనుకుంటున్నారా? అయితే ఐఆర్సీటీసీ రోడ్డు టూర్ ప్యాకేజీ(IRCTC Tour Package) అందిస్తోంది. ఈశాన్య రాష్ట్రాలలో ఒకటైన త్రిపుర, బంగ్లాదేశ్ సరిహద్దులను పంచుకుంటుంది. తూర్పున అసోం, మిజోరాంతో సరిహద్దులను కలిగి ఉంటుంది. త్రిపురలో ఆహ్లాదకరమైన వాతావరణం, సుందరమైన ప్రకృతి దృశ్యాలతో ప్రసిద్ధ పర్యాటక కేంద్రం(Tripura Tourist Places). త్రిపురలో హిందూ, బౌద్ధ ప్రదేశాలు, దేవాలయాలు, నదులు, రాతి శిల్పాలు వంటి ఎన్నో పర్యాటక ఆకర్షణలను కలిగి ఉంది. ఐఆర్సీటీసీ ఆరు రోజుల టూర్ ప్యాకేజీలో అగర్తల, ఉనోకోటి, దోంబూర్, సెపాహిజాలను కవర్ చేస్తుంది. ఈ టూర్ ప్రతి శుక్రవారం, శనివారం త్రిపుర రాజధాని అగర్తలా(Agartala) నుంచి మొదలవుతుంది. రూ.23,420 ప్రారంభ ధరతో టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది.
ఒక్కో వ్యక్తికి ధర
క్లాస్ | సింగిల్ ఆక్యుపెన్సీ | డబుల్ ఆక్యుపెన్సీ | ట్రిపుల్ ఆక్యుపెన్సీ | చైల్డ్ విత్ బెడ్(5-11 years) | చైల్డ్ విత్ అవుట్ బెడ్ (5-11 years) |
స్టాండర్ట్ | రూ.41730 | రూ.30350 | రూ.23420 | రూ.22670 | రూ.22300 |
టూర్ ప్రయాణ వివరాలు(Tour Details)
- డే 1 : అగర్తలా విమానాశ్రయం/ రైల్వే స్టేషన్ నుంచి పికప్ చేసుకుంటారు. హోటల్‌లో చెక్ ఇన్ చేసి విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం స్థానిక మార్కెట్, డిన్నర్ ఉంటుంది. రాత్రికి హోటల్‌లో బస చేస్తారు.
- డే 2 : బ్రేక్ ఫాస్ట్ అనంతరం ఉనోకోటి టూర్ ఉంటుంది. సాయంత్రం తిరిగి అగర్తలకు తిరిగి వెళ్లాలి. డిన్నర్, రాత్రిపూట బస అగర్తలా హోటల్‌లో చేయాలి.
- డే 3 : అల్పాహారం తర్వాత త్రిపురేశ్వరి ఆలయ దర్శనం కోసం ఉదయపూర్‌కు వెళ్లాలి. ఆ తర్వాత చబిమురా, తర్వాత దంబూర్ లేక్ ఐలాండ్ సందర్శనం ఉంటుంది. డిన్నర్, రాత్రి బస డోంబూర్‌లో చేయాలి.
- డే 4 : బ్రేక్ ఫాస్ట్ తర్వాత మేలఘర్ (నీర్ మహల్)కి వెళ్లాలి. తర్వాత సెపాహిజలా సందర్శన ఉంటుంది. అగర్తలాకు తిరిగి వెళ్లాలి. హోటల్‌లో రాత్రి భోజనం, బస చేస్తారు.
- డే 5 : అల్పాహారం తర్వాత, రోజంగా స్థానిక టూరిస్ట్ ప్రదేశాల సందర్శన ఉంటుంది. అగర్తలాలోని స్టేట్ మ్యూజియం, ఉజ్జయంత ప్యాలెస్, క్యాపిటల్ కాంప్లెక్స్ - అఖౌరా ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ సందర్శన చేస్తారు. అగర్తలాలోని హోటల్‌లో రాత్రి భోజనం, రాత్రి బస చేస్తారు.
- డే 6 : బ్రేక్ ఫాస్ట్ తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ అవుతారు. విమానాశ్రయం లేదా రైల్వే స్టేషన్‌లో డ్రాప్ చేస్తారు.
సంబంధిత కథనం