Vegetable Prices in AP : భారీగా పెరిగిన కూరగాయల ధరలు
Vegetable Prices in AP : ఏపీలో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. మరోవైపు చికెన్, మటన్, చేపల ధరలు కూడా పెరిగిపోయాయి.
Vegetable Prices in Andhrapradesh : రాష్ట్రంలో నిత్యావసర వస్తులవుల మంట రోజు రోజుకి పెరిగుతోంది. కూరగాయల, నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. దేశంలో ద్రవ్యోల్బణం స్థాయి పెరగడంతో నిత్యావసర వస్తువులు భారీగా పెరిగాయి. అలాగే వర్షాభావం తక్కువగా ఉండటంతో వేసవిలో కూరగాయల పంట దిగుబడి తక్కువుగా ఉంది. దీనివల్ల డిమాండ్ తగ్గట్టు ఉత్పత్తి లేకపోవడంతో కూరగాయ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కూరగాయల ధరలు ఏకంగా సెంచరీ దాటేస్తున్నాయి.
విజయనగరం పట్టణంలో కూరగాయల ధరలు గత రెండు మూడు రోజుల్లోనే 50 నుంచి 80 శాతం వరకు భారీగా పెరిగాయి. కేజీ టమాటా ధర రూ.25 -30 నుంచి ఉన్నఫలంగా రూ.60కి పెరిగింది. అలాగే కేజీ పచ్చిమిర్చి ధర రూ. 80 నుంచి రూ.120 కి పెరిగింది. బీన్స్ అయితే ఏకంగా రూ.150కి చేరింది. వంకాయ, బీరకాయ, బెండకాయ, దొండకాయ, చిక్కుళ్లు వంటి కూరగాయలు కేజీ రూ.40 నుంచి రూ.60, రూ.70కి అమాంతం పెరిగిపోయాయి.
భారీగా పెరిగిన చికెన్, మటన్ ధరలు:
రాష్ట్రంలో చికెన్, మటన్ ధరలు భారీగా పెరిగాయి. అందులో భాగంగానే విజయనగరంలో చికెన్, మటన్ ధరలు ఆకాశాన్ని అంటాయి. విజయనగరంలో కేజీ చికెన్ రూ.200 నుంచి రూ.260, రూ.280కి చేరింది. మటన్ కేజీ రూ.800 నుంచి రూ.1,000కి పెరిగింది. రొయ్యలు, చేపలు, పీతలు వంటి చేపల ధరలు కూడా భారీగా పెరిగాయి.
పెరిగిన పప్పుల ధరలు:
కూరగాయల తరువాత వంటల్లో ఎక్కువగా వాడే పప్పుల ధరలు అంతకంటే ఎక్కువే పెరిగాయి. అలాగే విజయనగరంలోనూ కూడా పప్పులు ధరలు భారీగా పెరిగాయి. కందిపప్పు కేజీ ధర రూ.110-120 నుంచి రూ.200కి పెరిగింది. క్వాలిటీ ఆధారంగా శనగపప్పు కేజీ ధర రూ.90-100 నుంచి రూ.120కి పెరిగింది. పెసరపప్పు రూ.140 కి పెరిగింది. మినపపప్పు 140 శాతం-150 శాతం పెరిగింది.
ఇతర ధరల్లో పెరుగుదల:
వంట నూనె కూడా ధర పెరుగుదలకు మినహాయింపు లేకుండా ఉంది. వంట నూనె కిలో రూ.180-రూ.190 అమ్ముతున్నారు. అలాగే సన్‌ప్లవర్ ఆయిల్ రూ.120-రూ.125 వరకు అమ్ముతున్నారు. అలాగే అల్లం ధర కిలో రూ.200కి అమ్ముతున్నారు. వెల్లుల్లి ధర రూ.300 పెరిగింది. ఉల్లిపాయాల ధరలు కూడా పెరుగుతాయి. చింతపండు కూడా కేజీ రూ.120-రూ.130 అయింది. దీంతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు.
స్టాక్ తగ్గడం, పక్క రాష్ట్రాల నుంచి దిగుమతుల వల్లే ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. దీనివల్ల సమాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల ఆదాయాలు పడిపోవడంతో, మరోవైపు ధరలు పెరిగి ఖర్చులు పెరగడంతో ఆర్థిక ఇబ్బందులను సామాన్య కుటుంబాలు ఎదుర్కొంటున్నాయి.
ఇతర ప్రాంతాల నుంచి కూరగాయలతో పాటు క్యారెట్, క్యాప్సికం వంటివి వస్తున్నాయి. ఎక్కువుగా కర్ణాటక నుంచి కూరగాయలు ఎక్కువుగా దిగుమతి అవుతున్నాయి. అందువల్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
అకాల వర్షాల కారణంగా చేతికొచ్చిన పంట దెబ్బతినడంతో అవసరానికి అనుగుణంగా సాగులేక మార్కెట్లకు స్టాక్ రావడం తగ్గిందని అమ్మకందారులు చెబుతున్నారు. ఒక్కసారి అధిక రేట్లకు కూరగాయల ధరలు పెరగడంతో నగర వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.