Theatre Popcorn Price: సినీ ప్రియులకు గుడ్‌న్యూస్ - తగ్గనున్న పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ ధరలు
Theatre Popcorn Price: సినీ గోయర్స్‌కు జీఎస్‌టీ కౌన్సిల్ గుడ్‌న్యూస్ వినిపించనుంది. థియేటర్లలోని ఫుడ్ ఐటెమ్స్‌పై జీఎస్‌టీ రేట్‌ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
Theatre Popcorn Price: ప్రస్తుతం సినిమా టికెట్ రేట్స్ కంటే అందులో అమ్మే పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్‌తో పాటు ఇతర ఫుడ్ ఐటెమ్స్ రేట్స్ ఎక్కువగా ఉంటున్నాయి. ముఖ్యంగా కొన్ని నేషనల్ మల్టీప్లెక్స్‌లో అయితే టికెట్ రేట్స్‌తో పోలిస్తే ఫుడ్ ఐటెమ్స్ ధరలు ఐదారు రెట్లు అధికంగానే ఉన్నాయి. యాభై గ్రాముల పాప్‌కార్న్‌కు ఐదు వందలకు పైగా ఛార్జీలు వసూలు చేస్తోన్నారు.
ఫుడ్ బేవరేజెస్ రేట్స్‌పై చాలా కాలంగా విమర్శలు వ్యక్తమవుతోన్నాయి. ఈ అధిక ధరల వల్లే ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్లకు దూరమవుతున్నారనే వాదనలు ఉన్నాయి. ఈ రేట్స్‌కు జీఎస్‌టీ కూడా యాడ్ కావడంతో భారం మరింతగా పెరుగుతోంది.
దాంతో అధిక ధరల తాకిడిని తగ్గించే దిశగా ఏర్పాట్లు జరుగుతోన్నట్లు తెలిసింది. ప్రస్తుతం థియేటర్లలోకి ఫుడ్ ఐటెమ్స్‌పై 18 పర్సెంట్ వరకు జీఎస్‌టీ విధిస్తోన్నట్లు సమాచారం. ఈ రేటును ఐదు శాతానికి తగ్గించేలా జీఎస్‌టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
తినుబండారాల ధరల వల్ల థియేటర్ వ్యవస్థకు జరుగుతోన్న నష్టాలను దృష్టిలో పెట్టుకొని జీఎస్‌టీ రేటును తగ్గించేలా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. త్వరలోనే ఇందుకు సంబంధించిన అనుమతులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
జీఎస్‌టీ కటాఫ్ వల్ల ఇరవై రూపాయల లోపే మాత్రమే ధరలు తగ్గే ఛాన్స్ ఉన్నట్లు చెబుతోన్నారు. ఇంకా తగ్గిస్తే బాగుంటుందని సినీ గోయర్స్ అభిప్రాయపడుతోన్నారు.
కానీ ఈ ఫుట్ ఐటెమ్స్ ధరల విషయంలో థియేటర్ వర్గాల వాదన మరోలా ఉంటుంది. ఓటీటీలతో పోటీ నెలకొన్న ప్రస్తుత తరుణంలో థియేటర్ల మనుగడే కష్టంగా మారిపోయిందని, ఫుడ్ ఐటెమ్స్ ద్వారా తమకు అదనపు ఆదాయం సమకూరుతుందని చెబుతోన్నారు. జీఎస్‌టీ కౌన్సిల్ నిర్ణయం ఫుట్ ఐటెమ్స్ ధరలు ఏ మేరకు ధరలు ఏ మేరకు తగ్గనున్నాయన్నది త్వరలో తేలనుంది.