Chicken Parts : చికెన్‌లో ఏ భాగం తింటే ఆరోగ్యానికి మంచిది కాదు?-which part of chicken is not good for health ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chicken Parts : చికెన్‌లో ఏ భాగం తింటే ఆరోగ్యానికి మంచిది కాదు?

Chicken Parts : చికెన్‌లో ఏ భాగం తింటే ఆరోగ్యానికి మంచిది కాదు?

Anand Sai HT Telugu
Mar 07, 2024 03:30 PM IST

Chicken Good Or Bad : చికెన్ తినడమంటే చాలా మందికి ఇష్టం. అయితే దానిలోని ఏ భాగాన్ని తినాలనే క్లారిటీ మాత్రం కొందరికే ఉంటుంది. ఏదీ తింటే ఆరోగ్యానికి మంచిది కాదో తెలుసుకోవాలి.

చికెన్‌లో ఏ భాగం తినాలి
చికెన్‌లో ఏ భాగం తినాలి (Unsplash)

చికెన్ ప్రోటీన్లు పుష్కలంగా ఉండే ఆహారం. నాన్ వెజ్ ప్రియులకు ఇష్టమైనది. చాలా మంది మటన్ కంటే ఎక్కువగా చికెన్ తింటారు. ఎందుకంటే చికెన్‌ కు మటన్ కంటే తక్కువ ధర. అందుకే చికెన్‌ను తరచుగా ఇంట్లో వండుకుంటారు. ఆదివారం వస్తే చాలు.. కచ్చితంగా ఇంట్లో చికెన్ ఉండాల్సిందే. చికెన్ అంటే ఇష్టంతో గట్టిగా లాగించేస్తారు. అయితే ఫామ్ చికెన్ తగ్గించమని వైద్యులు సలహా ఇస్తారు. నిజానికి చికెన్ కొన్ని భాగాలు తినకూడదు. అవి ఆరోగ్యానికి మంచిది కాదు. ఏ భాగం తినకూడదో తెలుసుకుందాం..

చికెన్ స్కిన్ మంచిది కాదు. ఇందులో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. చికెన్ ఫ్రెష్ గా ఉండేందుకు అందులో కెమికల్స్ కలిపే అవకాశం ఉంది. స్కిన్ లేకుంటే తింటే బాగుంటుంది. కార్డియాలజిస్టులు కూడా చికెన్ స్కిన్ తినకూడదని సలహా ఇస్తున్నారు. ఫామ్ చికెన్‌ను చాలా తక్కువగా తినాలి. కానీ మీరు ఫామ్ చికెన్ తింటే చర్మం తినకండి. చికెన్ స్కిన్‌లో అసంతృప్త కొవ్వు ఎక్కువగా ఉంటుంది. చికెన్ చర్మంలో కేలరీలు కూడా ఎక్కువగా ఉంటాయి. అధిక రక్తపోటు ఉన్నవారు కోడి చర్మాన్ని తినకూడదు. చికెన్ స్కిన్‌లో ఒమేగా 3, ఒమేగా 6 కొవ్వులు ఉంటాయి. చాలా అరుదుగా తింటే సమస్య లేదు. తక్కువ పరిమాణంలో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. మీరు కోడి చర్మాన్ని తక్కువ పరిమాణంలో తినండి.

చికెన్ బ్రెస్ట్‌లో ప్రొటీన్లు ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యానికి మంచిది. ఇది బరువును నియంత్రించడంలో చాలా మంచిది. కండరాల నిర్మాణానికి కూడా, చికెన్ బ్రెస్ట్ చాలా ఉపయోగకరం. అయితే మితంగానే తినాలి. చికెన్ బ్రెస్ట్ కంటే చికెన్ తొడల్లో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. చికెన్ బ్రెస్ట్ తినేప్పుడు కూడా మరీ అతిగా తినకూడదు. ఎందుకంటే చికెన్ శరీరంలో వేడిని కలిగిస్తుంది.

చికెన్ వింగ్స్ లో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. వీటిని ఫ్రైడ్ కాకుండా గ్రిల్ చేయడం మంచిది. చికెన్ వింగ్స్ తినడం మాత్రం ఎక్కువగా చేయకూడదు. చాలా మంది చికెన్ వింగ్స్ చర్మంతోనే అతిగా తింటారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇలా తినడం తగ్గించాలి. చికెన్ తోడలు కూడా ఎక్కువగా తినకూడదు. ఎందుకు అంటే మార్కెట్లో దొరికే చికెన్ త్వరగా పెరిగేందుకు కొన్ని రకాల ఇంజక్షన్స్ వాడుతారు. అది ఎక్కవగా తొడ భాగంలో వేస్తారు. అందుకే ఎక్కువగా తొడ భాగాన్ని తినకపోవడమే మేలు.

ఫారమ్ చికెన్ ఎక్కువగా తినకూడదు. చికెన్ తినడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. శరీరానికి అవసరమైన ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. జిమ్‌కు వెళ్లేవారు చికెన్‌ను ఎక్కువగా ఉపయోగిస్తారు. నాటు కోడి తింటే ఇంకా చాలా మంచిది. ఈ కోళ్లు సహజ వాతావరణంలో పెరుగుతాయి. ఫారమ్ కోళ్ల వలె త్వరగా పెరగవు. నాటి కోడి తినడానికి మంచిది. నాటు కోడి సహజంగా పెరుగుతుంది. దానికి మందులు అవసరం లేదు. ఎముకలు ఎక్కువగా మాంసం తక్కువగా ఉంటాయి.. కానీ నాటు కోడి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం.

Whats_app_banner